తులసి ఎంతో మేలు

ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ

Basil is very good
Basil is very good

ఇనెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించాలంటే కొన్ని మూలికలను ప్రధానంగా తీసుకోవాలి. అవి: తులసి ఆయుర్వేద వైద్యంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ మొక్క ఆకులతో కషాయం కాచి తాగవచ్చు. టీలో వేసి మరిగించవచ్చు. లేదంటే నేరుగా ఆకులనే నమలవచ్చు.

ఎలా తీసుకున్నా తులసిలోని ఔషధగుణాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ప్రతిరోజు కొన్ని తులసి ఆకులను క్రమం తప్పకకుండా తీసుకోవాలి. అల్లం లేదా శొంఠి శ్వాసకోస సమస్యలను తగ్గిస్తాయి.

వీటిలోని ఔషధ గుణాలు శరీరంలో తలెత్తే వాపులను అదుపు చేస్తాయి. కాబట్టి కషాయం లేదా టీలో అల్లం రసం కలిపి తాగాలి. వేడి ఒళ్లు కలిగిన పిత్త శరీర తత్వం ఉన్న వారయితే అల్లాన్ని పరిమితంగా వాడాలి.

Basil

వ్యాధులతో పోరాడే గుణం పసుపుకు ఉంటుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా పసుపును విరివిగా వాడతారు. కండరాల నొప్పులు తగ్గించడంతో పాటు గాయాలను మాన్పే గుణం కూడా పసుపుకు ఉంటుంది.

కఫాన్ని కరిగించి, వెలుపలికి రప్పించే గుణం ఉన్న పసుపును వేడి పాలలో కలిపి తీసుకుంటే ఊపిరితిత్తులు బలపడతాయి.

అశ్వగంధ మూలిక శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుండి. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి లాంటి సమస్యలన పరిష్కరిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా కలిగి ఉండే అశ్వగంధ వ్యాధినిరోధక శక్తినీ పెంచుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/