వెన్నునొప్పి లక్షణాలు

BACK PAIN
BACK PAIN

వెన్నునొప్పి లక్షణాలు

యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ తొలి లక్షణం నడుంనొప్పి. ముఖ్యంగా పొద్దున లేస్తూనే తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. ఈ నొప్పి 45 నిమిషాల నుంచి గంట వరకూ అలాగే ఉంటుంది. దీని బారినపడ్డవాళ్లు వెంటనే పక్కమీది నుంచి లేవలేరు కూడా శరీరం కాసేపు కుదురుకున్నాకే లేస్తుంటారు. మామూలుగా నడవటానికి దాదాపు గంట సేపు పట్టొచ్చు. రాత్రిపూట పడుకున్న తర్వాత కూడా నొప్పి వేధించవచ్చు. దీంతో అర్ధరాత్రి, తెల్లవారుజామున మెలకువ వచ్చేస్తుంటుంది. వీరికి పడుకొని పక్కలకు దొర్లటమూ సాధ్యం కాదు. నడుము కదలికలు కష్టం కావటం వల్ల చేతులను పక్క వైపులకు ఆనించి వాటి సాయంతో నెమ్మదిగా కదులుతుంటారు. పిరుదుల్లో మార్చి మార్చి నొప్పి కనబడటం మరో ప్రత్యేకత. కొద్దిరోజు ఎడమ పిరుదులో నొప్పి వేధిస్తే.. కొన్నాళ్లకు కుడి పిరుదులో నొప్పి తలెత్తుతుంది.

కొందరిలో రెండు పిరుదుల్లోను నొప్పి ఉండవచ్చు. ఎముకతో స్నాయువ్ఞలు కలిసేచోట వాపు తలెత్తటం మరో ముఖ్య లక్షణం. దీంతో చాలా మందిలో మడమల వద్ద ఎకిలిస్‌ టెండన్‌లో నొప్పి పుడుతుంది. మోకాలు, మోచేతి స్నాయువ్ఞల్లోనూ వాపు తలెత్తవచ్చు. ఒకోసారి పక్కటెముకలకు అంటుకునే స్నాయువ్ఞలు, కండర బంధనాలతోనూ ఒక రకమైన ఛాతీనొప్పి రావొచ్చు.

దీంతో శ్వాస తీసుకోవటమూ, కష్టమవ్ఞతుంది. చాలా మంది దీన్ని గుండెనొప్పిగానూ పొరపడుతుంటారు. యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ బాధితుల్లో కనుగుడ్డు మధ్య పొరలో వాపు కూడా తలెత్తవచ్చు. దీంతో కళ్లు ఎర్రబడటం, నీరు కారటం, నొప్పి, చూపు మసకబారటం వంటివి మొదవ్ఞతాయి. నిర్లక్ష్యం చేస్తే శుక్లాలకూ దారి తీయొచ్చు. యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ ఎందుకొస్తుందో కచ్చితంగా చెప్పలేం. కానీ హెచ్‌ఎల్‌ఏ బి27 జన్యువ్ఞతో దీనికి బలమైన సంబంధం ఉంటుండటం మాత్రం నిజం. యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ బారిన పడ్డ 90 శాతం మందిలో ఈ జన్యువ్ఞ కనబడుతుండటమే దీనికి నిదర్శనం. అయితే హెచ్‌ఎల్‌ఏ బి27 జన్యువ్ఞ ఉన్నా కూఆ జబ్బు రావాలనేమీ లేదు. ఈ జన్యువ్ఞ ఉన్నవారిలో కేవలం 2 శాతం మందికే వచ్చే అవకాశముంది. కాబట్టి జన్యువ్ఞ ఉండటంతో పాటు నడుంనొప్పి, కీళ్లనొప్పులు, ఉదయం పూట శరీరం బిగుసుకుపోవటం వంటి లక్షణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సమస్యను నిర్ధారించాల్సి ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా వస్తుందనీ చెప్పలేం.

ఎందుకంటు హెచ్‌ఎల్‌ఏ బి27 తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే అవకాశం 50 శాతమే. ఒకవేళ పిల్లల్లో జన్యువ్ఞ ఉన్నా కూడా జబ్బు వచ్చే అవకాశం 15 శాతమే కావటం గమనార్హం. పేగుల్లో ఇన్‌ఫెక్షన్‌, మూత్ర ఇన్‌ఫెక్షన్ల వంటి ఇతరత్రా అంశాలు కూడా దీన్ని ప్రేరేపించవచ్చు. యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ తీవ్రమయితే నడుము ముందుకు వంగిపోయి, మెడను అటూ ఇటూ సరిగా తిప్పలేరు. అయితే అందరిలోను ఇలాంటి లక్షణాలే ఉండాలనేమీ లేదు. అందువల్ల రక్తపరీక్ష, జన్యుపరీక్ష, ఎక్స్‌రేల వంటి వాటి ద్వారా సమస్యను నిర్ధారిస్తారు. వీరికి ఈ ఎస్‌ఆర్‌, సిఆర్‌పీ ఎక్కువగానూ.. హిమోగ్లిబిన్‌ తక్కువగానూ ఉంటుంది.

జన్యుపరీక్షలో హెచ్‌ఎల్‌ఏ బి27 జన్యువ్ఞ ఉంటే బయటపడుతుంది. యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ మూలంగా దెబ్బతిన్న ఎముక తిరిగి కోలుకోవటం దాదాపు అసాధ్యం. అందువల్ల సమస్యను వీలైనంత త్వరగా నిర్ధారించి, చికిత్స తీసుకోవటం చాలా అవసరం. దీంతో ఎముక మరింత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఇందుకు ఫిజియోథెరపి, వ్యాయామాలు, మందుల వంటి బాగా ఉపయోగపడతాయి.