రక్తహీనత నివారణకు ఆహారం

Blood Contents
Blood Contents

రక్తహీనత నివారణకు ఆహారం

హెచ్‌.ఐ.వి. రోగుల్లో 80 శాతం రక్తహీనత ఏర్పడుతుంది. హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌ వ్యాధి పెరుగుతున్న కొద్దీ రక్తహీనత కూడా ఎక్కువ అవ్ఞతుంది. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లోనే అధికంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద రక్తహీనత భారతీయ స్త్రీలలోనే చాలా ఎక్కువ. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గడానికి రక్తహీనత అని అంటాము. సగటున రోజుకి ఒక వ్యక్తికి 2000 మిల్లీగ్రాముల ఇనుము అవసరమవ్ఞతుంది. రక్తహీనతతో బాధపడేవారు ముఖ్యంగా ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను బాగా తీసుకోవాలి. (శాఖాహారులకు /మాంసాహారులకు) మనం రోజూ తీసుకునే ఆహారంలో బెల్లం, రాగులు, రాగిముద్ద, సజ్జలు, బెల్లంతో తయారుచేసిన వేరు శెనగ ఉండలు, నల్లద్రాక్ష పళ్లు, బాదం, సపోటా, యాపిల్‌, మామిడి, సీతాఫలం, బొప్పాయి, పుచ్చకాయ, చెర్రి స్రాటబెర్రీ, రాస్పబెర్రీ, కిస్మిస్‌, దంపుడు అటుకులు, దంపుడు బియ్యం, నల్లనువ్ఞ్వలు, నువ్ఞ్వల నూనె, బ్రెడ్‌, పాలు, ఒంటెపాలు, తేనె, మొలకెత్తిన పెసలు, శెనగలు, ఆప్రికాట్‌, ఫిగ్‌, ఖర్జూరం, ఈతపండ్లు, బీట్‌రూట్‌, బీన్స్‌, రాజ్మా, మటన్‌, కిడ్నీ, చికెన్‌, కార్జం (లివర్‌), నత్తలు, కొన్ని రకాల చేపలు, గోధుమ గడ్డిరసం (వీట్‌గ్రాస్‌), లేక గోధుమగడ్డి పౌడరు, ఉల్లికాడలు, తోటకూర, మునగాకు, తాజా ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటితోపాటు సి విటమిన్‌ ఉండే ఉసిరి, బత్తాయి, నిమ్మ నారింజ తీసుకుంటే శరీరం ఇనుముని బాగా గ్రహిస్తుంది. ఇనుము లోపం కారణంగా వచ్చే రక్తహీనత చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇటువంటి వారు ఆహారపదార్థాలను ఇనుప పాత్రల్లో వండుకుని ఇంటే ఒంటికి కొంత ఇనుము పిట్టి రక్తహీనత నుండి బయటపడడానికి బాగా దోహడం అవ్ఞతుందని హెమటాలజిస్ట్‌లు, పరిశోధకులు అంటున్నారు. కంటి చుట్టూ నల్లటి వలయాలు, కళ్లుతిరటం, కళ్ల పాలిపోయినట్లు ఉండటం, చూపు మందగించడం, తలనొప్పి, తల తిరుగుతున్నట్లు ఉండటం, చీటికీ మాటికి జలుబు చేయడం, గుండెదడ, గుండె పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, త్వరగా అలసిపోవడం, కొద్ది నడిచే సరికి ఆయాసం రావడం, శ్రమపడకుండా అకారణంగా నీరసం రావడం, తీవ్రమైన అలసట, బలహీనత. ఏ పని చేయడానికి శరీరం సహకరించడకపోవడం, కాళ్లు చేతులు తిమ్మిర్లు, కాళ్లకు, ఒళ్లంతా నీరు చేరడం చర్మం రంగు తెల్లగా పాలిపోవడం, ముఖం పాలిపోవడం, శరీరంలో విపరీతంగా కొవ్ఞ్వ శాతం , నీటి శాతం పెరిగిపోవడం, చేతివేళ్లు, నాలుక, పెదాలు పాలిపోయి తెల్లగా కనిపించడం, చిగుళ్లువాపు, నాలుకపై తెల్లని మచ్చలు, తరచూ ఇన్ఫెక్షను మొదలైన లక్షణాలు ఉంటాయి. మన శరీరంలో ఇనుము పాత్ర చాలా కీలకమైనది కాబట్టి ఎనీమియా లక్షణాలు కనబడినప్పుడు వీలైనంత త్వరగా డాక్టరును సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు నిత్యం ఆహారంలో ఉప్పును తగ్గించుకుని తినడం ఎంతో శ్రేయస్కరం.