పొడి చర్మానికి ఆలివ్‌

                      పొడి చర్మానికి ఆలివ్‌

olive oil
olive oil

శీతాకాలం పొడి చర్మం వారిని ఎన్నో సమస్యలు వేధిస్తుంటాయి. పొడి చర్మతత్వం ఉన్న వారు స్నానానికి గోరు వెచ్చటినీళ్లు వాడాలి. అలానే తక్కువ నీళ్లు ఉపయోగించాలి. షవర్‌ స్నానం జోలికి వెళ్లకూడదు. లేదంటే చర్మంపై సహజ నూనెలు, తేమ తగ్గిపోతాయి. తేనెలో చక్కెర కలిపి చర్మానికి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా ఉంటుంది. తేమ అందుతుంది. రాత్రిపూట పడుకునే ముందు పాలలో దూదిని ముంచి.. ముఖం తుడుచుకోవాలి. పాలలోని లాక్టిక్‌ యాసిడ్‌ గుణాలు చర్మానికి అందుతుంది. రెండు చెంచాల తేనెలో మూడు చెంచా ఆలివ్‌ నూనె, నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దన చేసుకోవాలి. ఇరవై నిమిషాయలయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే సరి. రెండు చెంచాల పాల పొడిలో చిటికెడు పసుపు, చెంచా తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. కొద్దిసేపయ్యాక తడి టిష్యూతో తుడిచేస్తే చాలు.