పిల్లల్లో చెవి వ్యాధులు : హోమియో చికిత్స

               పిల్లల్లో చెవి వ్యాధులు : హోమియో చికిత్స

ear problems in children
ear problems in children

చిన్న పిల్లల్లో చెవి సంబంధ వ్యాధులు ప్రధా నంగా మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్స్‌ కారణంగా వస్తాయి. అవి – అక్యూట్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌, క్రానిక్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌, అక్యూట్‌ సప్పురేటివ్‌ ఒటైటిస్‌ మీడియా, క్రానిక్‌ సప్పు రేటివ్‌ ఒటైటిస్‌ మీడియా. చెవి ఇన్‌ఫెక్షన్లు సాధారణంగా జలుబు చేయడం వలన, మధ్య చెవిలో నీరు ఉండి పోవడం వలన (సరిగ్గా స్నానం చేయనప్పుడు), చల్లగాలిలో చిన్న పిల్లలను పడుకోబెట్టడం వలన వస్తాయి. కొన్నిసార్లు టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, పంటి నొప్పి వలన కూడా చెవిపోటు రావచ్చు. లక్షణాలు: చెవినొప్పి రాత్రిపూట ఎక్కువగా వస్తుంది. పాలు తాగలేరు. ఏడుస్తారు. చెవిలోపల ఎర్రబడి, నొప్పిగా ఉంటుంది. చాలాసార్లు నొప్పి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు జ్వరం రావచ్చును. మీజిల్స్‌, డిఫ్తీరియా వ్యాధు లతోపాటు చెవి బాధలు రావచ్చును. మెడ దగ్గర సర్వైకల్‌ గ్రంథులు పెద్దవవుతాయి.

తలనొప్పి, గొంతు నొప్పి ఉండ వచ్చును. అక్యూట్‌ కేసుల్లో తరువాత చెవినుండి చీము కారవచ్చును. సరైన సమయంలో తగిన చికిత్స చేస్తే ఒటైటిస్‌ మీడియాను పూర్తిగా నయం చేయవచ్చును. క్రానిక్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌లో చెవుడు వస్తుంది. స్థానికంగా నొప్పి ఉండదు. చెవిలో చీము ఉండదు. జలుబు చేసినప్పుడు, వాతావ రణం చల్లగా ఉన్నప్పుడు చెవిలో వినికిడి తగ్గు తుంది. చెవిలో శబ్దాలు వస్తాయి. గుటక వేస్తే చెవిలో శబ్దం వస్తుంది. మాట్లాడుతూ ఉంటే ప్రతి ధ్వని వినిపిస్తుంది. కొన్నిసార్లు చెవి లోపల దురదగా ఉంటుంది. కొంతమందిలో చెవిలో నీరు ఎండిపోయినట్లు ఉంటుంది. కుటుంబంలో పెద్దవారికి ఇటువంటి సమస్య ఉంటే, వారికి కూడా కొంత కాలం తరు వాత పూర్తిగా చెవుడు వస్తుంది. ఈ రోగుల చెవు లను ద్రవరూపంలోని మందులతో శుభ్రం చేయ కూడదు. కొన్నిసార్లు అది ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా కలుగజేస్తుంది.

హోమియో చికిత్స అక్యూట్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌లో చెవిపోటు ముఖ్యమైన వ్యాధి లక్షణం కనుక ఎకొనైట్‌, బెల్ల డోనా, జెల్సీమియమ్‌, పల్సటిల్లా, కామో మిల్లా, బ్రయోనియాలాంటి మందులను వాటి రోగ లక్షనా లననుసరించి ఉపయోగించవచ్చు. క్రానిక్‌ కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌లో కాన్‌స్టిట్యూ షనల్‌ మందులను వాడితే చెవిటితనాన్ని తగ్గించవచ్చు. అక్యూట్‌ సప్పురేటివ్‌ ఒటైటిస్‌లో చెవిలో చీమును శుభ్రం చేసి దూదిపెట్టాలి. హెపార్‌ సల్ఫ్‌, ఫ్లోరిక్‌యాసిడ్‌, మెర్కూరియస్‌, కాల్కేరియా సల్ఫ్‌, ఆర్సనిక్‌ ఆల్బ్‌ మొదలైన మందులు వాడి నయం చేయవచ్చును. క్రానిక్‌ సప్పురేటివ్‌ ఒటైటిస్‌లో హెపార్‌ సల్ఫ్‌, కాలిమూర్‌, ఫ్లోరిక్‌ యాసిడ్‌, నైట్రిక్‌ యాసిడ్‌, మెజీరియమ్‌ మొదలైనవి ఉపయోగ పడుతాయి.

ఔషధాలు కాల్కేరియా కార్బ్‌ : స్కార్లెట్‌ ఫీవర్‌ తరువాత వచ్చే సప్పురేటివ్‌ ఒటైటిస్‌లో ఉపయోగపడు తుంది. మెడదగ్గర లింఫ్‌ గ్రంథులు పెద్దవవుతాయి. వీరు లావుగా బొద్దుగా ఉంటారు. చెవిలో వినికిడి తగ్గు తుంది. చల్లగాలి పడదు.

హెపార్‌సల్ఫ్‌ : చాలా సున్నితమైన వారుగా ఉంటారు. చల్లగాలిని భరించలేరు. జలుబు, గొంతునొప్పి, దిబ్బడ, చెవిలోపోటు, చీము కారడం ఉంటాయి. చెవిలో చీము పచ్చగా, దుర్వాసనతో వస్తుంది. చర్మంపైన చిన్న కురుపులు వస్తాయి.

సైలీషియా : చెవిలో చీము, వినికిడి తగ్గడం, చెవిలో కార్టిలేజ్‌లు దెబ్బ తినడం, ఎక్కువ చెమ టలు పడతాయి. చల్లగాలిని భరించలేరు. మల బద్ధకం ఎక్కువ.
పిరికితనం, చురుకుగా ఉండక పోవడం, సర్వైకల్‌ గ్రంథులు పెద్దవి కావడం ఉంటుంది.

మెర్కూరియస్‌ : చెవిపోటు మధ్య రాత్రి ఎక్కువ వుతుంది. చెవిలో చీము మంటగా ఉంటుంది. లాలా జలం ఎక్కువగా ఊరుతుంది. చెమటలు ఎక్కువగా ఉంటాయి.

గ్రాఫైటిస్‌ : చెవిలో చీము పసుపు పచ్చగా, చిక్కగా కారుతుంది. చెవిదగ్గర ఎగ్జిమా మచ్చలు ఉంటాయి. దురద, మలబద్ధకం ఉంటాయి.

సల్ఫర్‌ : చెవి వ్యాధులు చాలా మొండిగా తయా రవుతాయి. ఏ మందులు సరిగ్గా పని చేయనప్పుడు సల్ఫర్‌ను వాడవచ్చును. ఈ పిల్లలు స్నానం చేయ డానికి జంకుతారు. చర్మం పొడగా మారుతుంది. శుభ్రత ఉండదు. మలబద్ధకం ఉంటుంది. వినికిడి తగ్గుతుంది.

బెల్లడోనా : అక్యూట్‌ ఒటైటిస్‌కు ముఖ్యమైన మందు. చెవిలోపల ఎర్రబడుతుంది. తీవ్రమైన చెవి పోటు అకస్మాత్తుగా వస్తూపోతూ ఉంటుంది. రాత్రి పూట ఎక్కువవుతుంది. వేడిమి వలన ఉపశమనంగా ఉంటుంది.

ఎకొనైట్‌ : చెవిపోటుకు మొట్టమొదటి మందు ఇది. చాలా తీవ్రమైన నొప్పి. వాతావరణం మార్పు వలన, చల్లగాలికి ఎక్కువవుతుంది. ఇది షార్ట్‌ యాక్టింగ్‌ ఔషధం.

పల్సటిల్లా : చెవి వేడిగా మారి, ఎర్రబడి, నొప్పిగా ఉంటుంది. పచ్చని, చిక్కటి చీము చెవిలోనుండి కారు తుంది. జలుబు, తలనొప్పి, జ్వరం ఉండ వచ్చు. చెవి వినికిడి తగ్గుతుంది. చెవిలో శబ్దాలు వస్తాయి. దిబ్బడ వేస్తుంది. చెవిలో దురద వస్తుంది.

కామోమిల్లా : చిన్న పిల్లలలో చెవిపోటు వేడిమి వలన ఎక్కువవుతుంది. చెంపలు ఎర్రబడుతాయి. రెస్ట్‌లెస్‌గా ఉంటారు. భయంగా ఉంటారు. చల్ల గాలికి, రాత్రిపూట ఎక్కువ వుతుంది.

కాలిమూర్‌ : మధ్య చెవిలో యూస్టేషియన్‌ నాళం లో వచ్చే కాటరల్‌ ఇన్‌ఫ్లమేషన్‌కు ఇది ముఖ్యమైన మందు. వినికిడి తగ్గుతుంది. చెవిలో శబ్దం వస్తుంది. చెవి చుట్టూ ఎగ్జిమా వస్తుంది. పైన పేర్కొన విధంగా హోమియో మందు లను వాటివాటి రోగ లక్షణాలను బట్టి చికిత్స చేసిన ప్పుడు 90 శాతం చెవికి సంబంధించిన వ్యాధు లను దుష్ఫలితాలు లేకుండా నయం చేయవచ్చు. 50 శాతం చెవి వినికిడి లోపాలను ఎలాంటి శస్త్ర చికిత్సలు అవసరం లేకుండా నయం చేయడానికి అవకాశం ఉంటుంది.