డిమెన్షియా

Patient
Patient

డిమెన్షియా

మనిషంటేనే జ్ఞాపకాల గని. జ్ఞాపకాలే లేకపోతే మనిషికీ మట్టికీ తేడా లేదు. మనమెవరమో, ఎక్కడికి వెళుతున్నామో, ఏం చేస్తున్నామో గుర్తులేకపోతే జీవితం నిరర్ధకంగా పరిణమిస్తుంది. మతిమరుపు సమస్య మాత్రమే కాదు, మన భావాలు, భాష, ఏకాగ్రత, నిర్ణయ సామర్ధ్యం వంటి వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. డిమెన్షియా ముప్పు కారకాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వృద్ధాప్యం. కుటుంబంలో ఎవరైనా డిమెన్షియా బాధితులు ఉండటం. వీటిని మనం ఎలాగూ మార్చలేం. కాని మన అలవాట్లను, జీవనశైలిని మార్చుకోవటం ద్వారా దీన్ని దూరంగా ఉంచుకునే ఆవకాశం లేకపోలేదు. శారీరక ఆరోగ్యానికి సమతులాహారం తీసుకోవాలన్నది తెలిసిందే.
కానీ మెదడుకు మేలు చేసే ఆహారం గురించే మనం అంతగా పట్టించుకోము. మెదడు సరిగా పనిచేయటానికి మంచి కొవ్ఞ్వలు, తేలికైన ప్రొటీన్లు, విటమిన్లు ఖనిజాలు ఎంతో అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పుధాన్యాలు అధికంగా తీసుకోవటం మేధస్సుకు ఎంతో మేలు చేస్తుంది. సంతృప్త కొవ్ఞ్వలు ఎక్కువగా తీసుకునేవారికి డిమెన్షియా వచ్చే ముప్పు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి కాబట్టి వెన్నకు బదులుగా పొద్దు తిరుగుడు, ఆలివ్‌ నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసానికి బదులు తేలికైన ప్రొటీన్లతో కూడిన చికెన్‌, చేపలవంటివి తీసుకోవటం మంచిది. బాదం వంటి వాటిల్లోని ఆరోగ్యకరమైన కొవ్ఞ్వలు సైతం మెదడు పోషణకు తోడ్పడతాయి.

అధిక రక్తపోటు, మధుమేహం రెండూ డిమెన్షియాకు పెద్ద ముప్పు. మధుమేహులకు డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధ్య వయసులో అధిక రక్తపోటు సైతం దీని ముప్పును పెంచుతుంది. కాబట్టి వీటికి సరైన చికిత్స తీసుకోవటం ఆహార, వ్యాయామ నియమాలు పాటించటం ద్వారా డిమెన్షియా ముప్పునూ నివారించుకోవచ్చు. మితిమీరి మద్యం తాగటం వల్ల అధిక రక్తపోటు, పక్షవాతం, కాలేయ జబ్బులు మాత్రమే కాదు. డిమెన్షియా కూడా రావొచ్చు. మద్యం అధికంగా తాగితే మెదడు క్షీణించే అవకాశముంది. ఇది ముందుగానే మతిమరుపునకు దారి తీయవచ్చు. దీర్ఘకాల మద్యం అలవాటుతో మేధోసామర్ధ్యం క్షీణిస్తున్నట్లు. తికమక పడటం వంటివి తలెత్తుతున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

కాబట్టి మద్యం అలవాటు కలవారు మితిమీరకుండా ఉంటే మంచిది. సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటి వాటి పొగలో ఎన్నో హానికారక రసాయనాలుంటాయి. ఇవి మెదడుకూ హాని చేస్తాయి. పొగతాగేవారికి డిమెన్షియా ముప్పు పెరుగుతున్నట్లు అధ్యయనాలు పేర్కొండుటం దీనికి నిదర్శనం. పొగ మానేస్తే డిమెన్షియా ముప్పు తగ్గటం మంచి విషయం. కాబట్టి వీలైనంత త్వరగా ఆ అలవాటును మానుకోవడం మంచిది. వ్యాయామం మూలంగా మెదడు సైతం బలం పుంజుకుంటుంది. వ్యాయామం చేసినపుడు గుండె, కండరాలల్లోకి రక్తం,

దాంతో పాటు ఆక్సిజన్‌ బాగా అందుతుంది. ఇది డిమెన్షియా ముప్పు తగ్గటానికి తోడ్పడుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడయింది. కాబట్టే క్రమం తప్పకుండా రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేస్తే మతిమరుపు బారిన పడకుండా చూసుకోవచ్చు. శరీరానికే కాదు మెదడుకూ వ్యాయామం అవసరమే. ఎంతసేపు సోఫాలో కూలబడి టీవి చూడటం, ల్యాప్‌టాప్‌ వంటివి ముందేసుకుని అంతర్జాలంలో విహరిస్తే మెదడు సోమరిగా తయారవ్ఞతుంది. డిమెన్షియా ముప్పూ పెరుగుతుంది. అదే ఆలోచనలకు పదునుపెట్టే పనులతో మెదడు కణాలు, వాటి మధ్య అనుసంధానాలు మెరగవ్ఞతాయి అందువల్ల పదకేళీలు పూరించటం, చదరంగం ఆడటం వంటి హాబీలను అలవరచుకోవటం మంచిది.

ఒంటరితనం మూలంగా మెదడు బీటా అమిలాయిడ్‌ ప్రోటీన్‌ పోగు పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వీలైనప్పుడూ నలుగురితో కలవటం, బంధువ్ఞల ఇంటికి వెళ్లి రావటం వంటివి అలవాటు చేసుకోవాలి. ఇది మనసునూ ఉల్లాసపరుస్తుంది.