ట్రయల్‌ లేబర్‌-2

PRAgNANT--
PRAgNANT–

ట్రయల్‌ లేబర్‌-2

గతవారం ట్రయల్‌ లేబర్‌కు కారణాలు, నివారణ చర్యలలో కన్నింటిని చదివాం. ఈవారం దీనికి సంబంధించిన జాగ్రత్తలను గమనిద్దాం. జాగ్రత్తలు: 1.కాన్పు సహజంగా అయ్యేటట్లు చుడాలి. – మెంబ్రెన్స్‌ త్వరగా రప్చర్‌ కాకుండా చూడడం ముఖ్యం. ఎనీమా ఇవ్వరాదు. రోగికి కదలకుండా బెడ్‌పై ఉంచి రోగి కండీషన్‌,గమనించాలి. – రోగికి నోటిద్వారా ఏమీ ఇవ్వరాదు. ఐ.వి. ఫ్లూయిడ్స్‌ ద్వారా మాత్రమే ఆహారాన్ని అందించాలి. – రోగికి నోప్పులు ఎక్కువ సేపు వస్తుండడం వల్ల మైల్డ్‌గా అనల్జిక్‌ మందుల్ని నొప్పి తీవ్రతని బట్టి వాడాల్సి వ్ఞంటుంది. – తరుచుగా జననేంద్రియ పరీక్ష చేయరాదు. దీని వల్ల ఇన్ఫేక్షన్స్‌ వచ్చే అవకాశముంది. – ఉదారపరీక్ష ,ఎక్స్‌రే, స్క్రానింగ్‌ పెల్విమెట్రీ ద్వారా ప్రసవ దశల్ని గమనించాలి. సర్విక్స్‌ విప్పారడాన్ని, షో, రోగిపల్స్‌,ఫీటల్‌ హార్ట్‌ బీట్స్‌, మూవ్‌మెంట్స్‌ని గమనించాలి. – ప్రసవ నోప్పులు సరిగా లేనపుడు ఆర్సిటోసిన్‌ డ్రిప్‌ ఇవ్వాల్సి వ్ఞంటుంది. – మెటర్నల్‌ ,ఫీటల్‌ కండీషన్‌ ఎప్పటికపుడు గమనిస్తుండాలి. – మెరిబ్రెన్స్‌ రప్చర్‌ అయిన తర్వాత పెల్విన్‌ కోలతల్ని పెల్విమెట్రీ ద్వారా మరోక సారి చెక్‌ చేయాలి. ఉమ్మనీరు రంగుని గమనించాలి. బోడ్డుతాడు జారకుండా చూడాలి. బిడ్డ తల ఏవిధంగా పెల్విక్‌ బ్రిమ్‌లోకి జారుతుందో గమనించాలి. సర్విక్స్‌ ఎంతమేర విప్పారి ఉందో గమనించాలి. – రోగికి మానసికంగా ధైర్యాన్ని కల్గించాలి. – ట్రయల్‌ లేబర్‌ ప్లాట్‌పెల్విస్‌ వ్ఞన్నవారిలో, పెల్విక్‌కంట్రాక్షన్స్‌ (మైల్డ్‌, మొడరేట్‌గా ఉన్నపుడు),సర్విక్స్‌ విప్పారి ఉన్నపుడు బిడ్డ తల భాగం క్రింది భాగంలో ఉన్నపుడు, ఎటువంటి అబ్‌నార్మల్‌ పోజిషన్‌లో లేనపుడు,ఫీటల్‌ డిస్ట్రెక్ట్‌ లేపుడు మాత్రమే చేస్తారు. దీనికి రోగి సహకారం, తోడ్పాటు ఎంతైనా అవసరం. – మెంబ్రెన్స్‌ రప్చర్‌ అయి సర్విక్స్‌ పూర్తిగా (10 సెం.మీ) విప్పారినపుడు 1/2 గంట- 1గంట వరకు వెయిట్‌ చేయడం మంచిది. – ట్రయల్‌ లేబర్‌ అనుకున్నట్లు కాక లేట్‌ అయినట్లయితే ఎ).30% మందిలో ఎప్సియూటమీ చేసి స్పాంటేనియస్‌ డెలీవరీ చేయడం బి). 30% మందిలో ఫోర్‌సెప్స్‌ లేదా వెంట్యూస్‌ ద్వారా డెలీవరీ చేయడం కష్టంతో పోర్‌సెప్స్‌ డెలీవరీ చేయరాదు. సి). 40% మందిలో మాత్రమే సిజేరియన్‌ చేస్తారు. – సిజేరియన్‌ హిస్టరెక్టమీ: ఇది ప్రసవానంతర రక్తస్రావం వల్ల యూట్రస్‌ ఎటోనీ (గర్భసంచి రీక్‌ గా ఉండడం),మాయ ప్రసవం కాకుండాలో అతుక్కోనిపోవడం, పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్‌ వ్ఞన్న, సర్విక్స్‌, జననేంద్రియాలకు గాయాలు కావడం,లిగమెంట్స్‌లో రక్తం గడ్డకట్టడం, గర్భసంచిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న, యూట్రస్‌ రప్చర్‌ బిడ్డలో అబ్‌నార్మాలీటీస్‌ వ్ఞన్న బిడ్డ చనిపోయి ఉన్నపుడు క్రానియో టమీ, సింఫైసిటోమీ చేయల్సి వ్ఞంటుంది. -రోగికి డీహైడ్రెషన్‌ లే కుండా చూడాలి. ఇన్ఫెక్షన్స్‌ వ్ఞంటే ఆంటిబయాటిక్స్‌ వాడాల్సి వ్ఞంటుంది. – సక్సెస్‌ఫుల్‌ ట్రయల్‌ వల్ల భవిష్యత్తులో గర్భిణీలో గర్భదారణలో ప్రసవ సమయంలో సిజేరియన్‌ వల్ల కలిగే ప్రాబ్లమ్స్‌ని ఆరికట్టవచ్చు.

– డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి