ఉలవలతో ఆరోగ్యమేలు

ఉలవలతో పసందైన వంటలు- రుచి: వెరైటీ వంటకాలు ‘చెలి’ పాఠకులకు ప్రత్యేకం

Health benefits with Horsegram
Health benefits with Horsegram

ఉలవలు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. ముఖ్యంగా కిడ్నీవ్యాధులతో బాధపడేవారికి ఉలవలు చాలామంచిది. ఉలవల చారు చేసుకుని భోజనంలో తింటే కిడ్నిలోని రాళ్లు పడిపోతాయి.

స్వస్థత లభిస్తుందని అంటారు. అంతేకాదు ఉలవలతో పలు ఆరోగ్యమేలులున్నాయి. ఇలాంటి ఉలవలతో పలు వెరైటీ వంటల్ని చేసుకోవచ్చు. అవి ఏమిటో మీరే చదవండి..

ఉలవల పొంగనాలు

కావలసిన పదార్థాలు: ఉలవలు-ముప్పావు కప్పు, ఇడ్లీ పిండి- 2 కప్పులు
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిచ్చి-2 కరివేపాకు -4 రెబ్బలు
నూనె – వేగించడానికి సరిపడా

తయారచేసే విధానం: ఉలవల్ని ఒక రాత్రంతా నానబెట్టి ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. పాన్‌లో ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగువేగించాలి.

ఇప్పుడు ఇడ్లీపిండిలో రుబ్చిన ఉలవల మిశ్రమంతో పాటు తాలింపు మిశ్రమ వేసి బాగా కలిపి గుంతపొంగనాలు చేసుకోవాలి. ఏదైనా రోటీ పచ్చడితో పొంగనాలు వేడివేడిగా తింటే బాగుంటాయి.

ఉలవల పచ్చడి

కావలసిన పదార్థాలు: ఉలవలు -2 టేబుల్‌
స్పూన్లు, ఎండుమిర్చి-6
మినప్పప్పు – ఒక టీ స్పూను, ఆవాలు – అరటి స్పూను,
వెల్లుల్లి రెబ్బలు – 2, చింతపండు- ఉసిరికాయంత, కరివేపాకు – 4 రెబ్బలు
పచ్చికొబరి తురుము – ఒక కప్పు- రుచికి తగినంత
నీరు- పావుకప్పు

తయారుచేసే విధానం: ఉలవల్ని దోరగా వేగించి పక్కనుంచాలి. అదే పాన్‌లో ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, మినప్పప్పు కూడా వేగించాలి.

తర్వాత మిక్సీలో పచ్చికొబ్బరి తురుము, వేగిన ఉలవలు, ఎండుమిర్చి, వెల్లులి, ఆవాలు, చింతపండు, కరివేపాకు వేసి నీరు చిలకరిస్తూ ముద్దగా నూరుకోవాలి. వేడివేడి అన్నంతో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

ఉలవల పరాటాలు

కావలసిన పదార్థాలు: రాజ్మా- ఒక కప్పు, ఉలవలు-అరకప్పు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి తరుగు=1 టేబుల్‌ స్పూను, జీలకర్ర, ధనయాల పొడి,
ఆమ్‌చూర్‌, గరం మసాల పొడి, మిరియాల పొడి- అరటీ తగినంత, గోధుమపిండి – ఒక కప్పు,
నూనె- 2 టేబుల్‌ స్పూన్లు

తయారుచేసే విధానం: రాజ్మా, ఉలవలు 8 గంటలపాటు నానబెట్టి కుక్కర్లో ఉడికించాలి. చల్లబడ్డాక మిక్సీలో బరకగా రుబ్బుకుని పక్కనుంచాలి.

కొద్ది నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేగించాలి. ఆమ్‌చూర్‌, గరం మసాల, కారం, ఉప్పు మిరియాల పొడితో పాటు రుబ్బిన మిశ్రమం కూడా వేసి బాగా కలిపి దించేయాలి.

ఇప్పుడు తడిపి ముద్ద చేసిన పిండిని కొంతకొంత తీసుకుని పరాటాలు ఒత్తి, మధ్యలో తగినంత ఉలవల మిశ్రమం పెట్టి దగ్గరగా మడవాలి.

మళ్లీ నెమ్మదిగా పరాటాలు ఒత్తి పెనంపై ఎండు వైపులా నూనెతో కాల్చుకోవాలి. బలవర్ధకమైన ఈ పరాటాలను రైతాతో వేడీ వేడిగా తినండి.

ఉలవల వేపుడు

కావలసిన పదార్థాలు: ఉలవలు – ఒక కప్పు, ఎండుమిర్చి-3, ఆవాలు – ఒక టీ స్పూను, ఉప్పు – ఉచికి తగినంత, నూనె -2 టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు – 4 రెబ్బలు, పచ్చికొబ్బరి తురుము, ఉల్లి తరుగు- అరకప్పు చొప్పున, జీలకర్ర, కారం- అరటీ స్పూను చొప్పున, పసుపు-పావ్ఞ టీ స్పూను

తయారు చేసేవిధానం: ఉలవల్ని 6 గంటలపాటు నానబెట్టి తగినంత నీరు, కొద్దిగా ఉప్పు చేర్చి కుక్కర్లో 5 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత నీరు వడకట్టాలి.

ఇప్పుడు కొబ్బరి తురుము, ఉల్లితరుగు, జీలకర్ర, కారం, పసుపు కలిపి బరకగా దంచుకోవాలి.

కడాయిలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేగించి కొబ్బరి మిశ్రమం కలపాలి.

రెండు నిమిషాల తర్వాత ఉడికించిన ఉలవలతో పాటు కొద్దిగా వడకట్టిన నీరు చల్లి చిన్నమంటపై మూతపెట్టి మగ్గించాలి. నీరు ఆవిరై ఉలవలు పొడిపొడిగా అయ్యాక దించేయాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/