వ్యాయామానికీ చిట్కాలు

Exercise
Exercise

వ్యాయామానికీ చిట్కాలు

వ్యాయామం రక్తంలో ఉండే విఎల్‌డిఎల్‌, ఎల్‌డిఎల్‌ కొవ్ఞ్వ పదార్థాలను, ట్రైగ్లిజరైడ్స్‌ కొవ్ఞ్వను తగ్గిస్తుంది. హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ పరిమాణాన్ని పెంచుతుంది. ఈ రెండు ప్రక్రియలు గుండెకు మంచిది. వ్యాయామం వలన గుండె వేగం, రక్తపోటు తగ్గుతాయి. గుండె పనిచేసే తీరు మెరుగుపడుతుంది. మానసిక లాభాలు వి వ్యాయామం వలన శరీరంలో సామాన్యంగా విడుదలయ్యే ఎండార్ఫిన్స్‌ అధిక పరిమాణంలో విడుదలవ్ఞతాయి. ఇవి హార్మోన్లు. ఇవి మెదడుపై పనిచేసి మనిషికి మానసిక తృప్తి, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యంగా ఉన్నామనే అనుభూతిని కలిగిస్తాయి.

వ్యాయామం వలన కలిగే కదలికలు, కండలు పెరగడం మొదలైన వాటి వలన జీవన సరళి ఉత్తమంగా మారి, టైప్‌-2 మధుమేహ వ్యాధి గ్రస్తులకు చక్కెర నియంత్రణలో ఎంతో తోడ్పడుతుంది. వీరికి ఆందోళన తగ్గి, మానసిక, శారీరక ఒత్తిళ్లను తట్టుకునే శక్తి వస్తుంది. ముందు జాగ్రత్తలు వి ఏ విధమైన వ్యాయామమైనా లేదా ఏదో ఒక రకమైన వ్యాయామమైనా టైప్‌-2 వారికి సురక్షితమే. కాని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎందుకంటే టైప్‌-2 వ్యాధిగ్రస్తులు సంవత్సరాల తరబడి దేహ పరిశ్రమలేని కూర్చుని చేసే పనులు చేస్తుంటారు. వి అందువలన వారి దేహ పరిస్థితి సవ్యంగా ఉండదు. 35సంవత్సరాలు పైబడినవారు గట్టి వ్యాయామ ప్రక్రియలు మొదలెట్టాలంటే వైద్యపరీక్షలు.

కార్డియాక్‌ స్ట్రెస్‌ టెస్ట్‌ చేయించు కోవాలి. వైద్యపరీక్షల్లో, ఈ కింది అంశాలను పాటించాలి. వి షుగర్‌ నియంత్రణ తెలుసుకోవడం వి రక్తప్రసరణ వ్యవస్థ పరీక్ష. దీనిలో బిపి, ఇసిజి, ఎక్సర్‌సైజ్‌ ఇసిజి అవసరం. వి వర్కింగ్‌ కెపాసిటీని నిర్ణయించడం. దీనిలో ఒక పద్ధతిలో వ్యాయామాలు పెంచుకుంటూ, దానికి అనుగుణంగా నాడి, ప్రాణవాయువ్ఞ వినియోగాన్ని తెలుసుకుంటారు. నాడీమండల పరీక్ష ఆఫ్థాల్మాస్కోపిక్‌ పరీక్ష. దీనిలో కంటి రెటీనా తెరలో రక్తనాళాల వ్యాధులు ఉన్నా, వ్యాధులు ఉండవచ్చుననే అనుమానం ఉన్నా పరీక్ష చేస్తారు.

చాలామంది టైప్‌-2 షుగర్‌ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిర్థారణకు ముందు చాలాకాలం నుంచి జబ్బు ఉంటుంది. అందుకే కొత్తగా వీరిని కనుగొన్నా వారికి బిపి, న్యూరోపతి, రెటీనోపతి, నెఫ్రోపతి, ఉన్నాయేమో పరీక్షించాలి. వి మరో ముఖ్య విషయం వీరికి ఛాతీలో నొప్పి లేకుండానే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ ఉండటం సాధారణం. చక్కెర స్థాయి నియంత్రణలో లేని వారికి, చక్కెర కాంప్లికేషన్లు ఉన్నవారికి గట్టి వ్యాయామాలు పనికిరావు.

పాదాల్లో స్పర్శ, రక్తప్రసరణ ఎలా ఉంది? అని గమనించాలి. అటువంటి లోపాలు ఉన్నవారికి పాదాలకు ఒత్తిడి, గాయాలు కలిగించని వ్యాయామాలు సిఫార్సు చేయాలి. వీరికి సురక్షితమైన, సరైన పాదరక్షలు కావాలి. వి బిపి, రెటీనా పొర వ్యాధులున్న వారు బరువ్ఞలు లేపటం, స్విమ్మింగ్‌, సైకిలింగ్‌, జాగింగ్‌ మొదలైనవి చేయకూడదు.