అల్పాహారంగా ఆపిల్‌

Apple as breakfast

కొంతమందికి వేళకు తినే సమయం ఉండదు. అలాగని పొట్టమాడ్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోషకాహారం తీసుకునేలా చూసుకోవాలి. యాపిల్‌ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. టిఫిన్‌ తినే సమయం లేనివారు ఒక యాపిల్‌ తినవచ్చు. ఆకలి తీరుతుంది.

ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువూ అదుపులో ఉంటుంది. ఆడవారికి పని ఒత్తిడి మామూలే. అలాంటప్పుడు డార్క్‌ చాక్లెట్‌ చిన్న ముక్కను చప్పరించవచ్చు. అల్పాహాయం తీసుకునేందుకు సమయం లేనప్పుడు ఒక రెండు బ్రెడ్‌ స్లైస్‌లు తిన్నా చాలు. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఒక అరటిపండు తీసుకున్నా మంచిదే. దాంతో పాటు గ్లాసు పాలు తాగితే మరీ మంచిది. సాయంత్రం పూట ఆకలి అనిపిస్తే సమోసా, బజ్జీల్లాంటివి తినే బదులు ఒక పండు లేదా క్యారెట్‌, కీరా ముక్కలు, నట్స్‌, గుమ్మడి తింటే పోషకాలు అందుతాయి. పొట్ట నిండినట్లుగా ఉంటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/