షుగర్‌ వ్యాధి గ్రస్తులకు మేలు చేసే ఆలివ్‌ ఆయిల్‌!

olive oil
olive oil

షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఆలివ్‌ ఆయిల్‌ ఎంతో మేలు చేస్తుంది. ఆలివ్‌ ఆయిల్‌లోని ఒక రసాయనానికి ఈ వ్యాధిని నివారించే లక్షణం ఉన్నట్లు పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడయింది. వ్యాధిపై పోరాడేందుకు ఈ రసాయనం పనిచేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఆలివ్‌ నుంచి సేకరించిన రసాయన పదార్థం ఒలెయురోపీన్‌ శరీరం మరింత ఎక్కువగా ఇన్సులిన్‌ స్రవించేలా చేస్తుందని అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌, స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. అయితే, ఇదే రసాయనం టైప్‌-2 మధుమేహంలో హానికరంగా ప్రవర్తించే అమైలిన్‌ ను నిర్విషీకరణ చేయడం ద్వారా తోడ్పడుతుందని తేల్చారు. ఈ అధ్యయనం ద్వారా ఆలివ్‌ ఉత్పత్తులతో ఒనగూరే శాస్త్రీయ ప్రయోజనాలపై అవగాహన పెరుగుతుందని పరిశోధకులు చెప్పారు.