మెదడు చురుకుదనానికి అరటి పండు

  మెదడు చురుకుదనానికి అరటి పండు

banana's
banana

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పొటాషియం, ఇతర మినరల్స్‌ శరీరానికి ఎంతో అవసం. అరటిపండు తింటే బరువు తగ్గుతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ పండులో ట్రిప్టోఫాన్‌ అనే అమినో ఆమ్లం ఉంటుంది. ట్రిప్టొఫాన్‌ సెరటోనిన్‌ హార్మోన్‌గా మారుతుంది. మెదడులో సెరటోనిన్‌ హార్మోన్‌ స్థాయిలు తగ్గిపోతే మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది.

సెరటోనిన్‌ నిల్వలు తగ్గిపోవడానికి శారీరక లక్షణాలు, మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఒక అరటి పండు తింటే 3 గ్రాములు ఫైబర్‌, 100 క్యాలరీలు లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి అరటి పండు మంచి స్నాక్‌. అరటిపండు తింటే తొందరగా ఆకలి వేయదు.

రోజులు అవసరమైన 12 శాతం ఫైబర్‌ అరటిపండు తినడం వల్ల లభిస్తుంది. ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి ఎంతో అవసరం. మెదడు చురుగ్గా పనిచేసేందుకు దోహదపడతాయి. అరటిపండు తింటే శరీరంలో క్యాల్షియం నిలువలు పెరుగుతాయి. కాల్షియం ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది.