ఆంక్షలు లేని ఆహారం

KID

ఆంక్షలు లేని ఆహారం

గర్భిణిగా ఉండగా కోరిన ఆహారాన్ని తినే అవకాశం ఉంటుంది. కానీ ప్రసవం అయిన తర్వాత ఒక్కసారిగా ఆహారంపై ఆంక్షలు మొదలవ్ఞతాయి. అది తినొద్దు, ఇది తినొద్దని తెలిసినవారు తలా ఒక సలహా చెబుతారు. అంతవరకు మనకు అనుమానం లేకపోయినా, ప్రమాదం ఏమి జరగకపోయినా వాళ్లు చెప్పగానే అలా జరుగుతుందేమోనన్న అనుమానం మనసులో మొదలవ్ఞతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాలింతలకి ఈ పరిస్థితి ఎదురవ్ఞతుంది. కారణం తీసుకునే ఆహారంపై వారికి ఉండే అపనమ్మకాలే. అవేమిటో చూద్దాం. పాలిచ్చే తల్లులు పెరుగు, నారింజ, నిమ్మ వంటి పండ్ల రసాలు తీసుకోవడం వల్ల బిడ్డకు జలుబు చేస్తుందని చాలా మందిలో నమ్మకం. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. బిడ్డ కొత్త వాతావరణానికి అలవాడు పడే క్రమంలో జలుబు రావడానికి ఆస్కారం ఉంది. వాస్తవానికి పండ్లు, పండ్లరసాలు తీసుకోవడం వల్ల తల్లిపాలలో విటమిన్‌’సి స్థాయిలో తగినంతగా ఉంటాయి. ఫలితంగా బిడ్డకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. రాజ్‌మా శనగపప్పు మొలకలు వంటి వాటిని పాలిచ్చే తల్లులు తినడం వల్ల బిడ్డకు కడుపునొప్పి వస్తుందని చాలా మంది అను కొంటారు. అందువల్లే వీటితో చేసిన పదార్థాలని బాలింతలకి దూరంగా ఉంచుతారు. ఈ నమ్మకంలో ఏ మాత్రం వాస్తవం లేదు. బాలింతలకి చక్కని పోషకాహారం అంటే ఈ రకం తృణధాన్యాలతో చేసిన పదార్థాలే. వీటిల్లో మాంసకృత్తులు, జింక్‌, ఇనుము పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బిడ్డకు కడుపునొప్పి, ఉబ్బరం వస్తాయనడం సరికాదు. కాబట్టి నిస్సందేహంగా పప్పుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవచ్చు. అలాగే బాలింతలు చల్లని నీటిని తాకకూడదని, వేడివేడి నీటిని తాగిస్తారు. ఇక్కడ వేడినీళ్లు, చన్నీళ్లు అని కాదు. ఆ నీరు పరిశుభ్రంగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. నీటిని కాచి వడకట్టి చల్లార్చి తాగినా ఏం కాదు. వేడినీటినే తాగాలనేది ఒక అపనమ్మకం మాత్రమే. అలాగే నీటిని అతిగా తాగడం వల్ల పాలు పలుచన అవ్ఞతాయని, అతిగా తాగొద్దని పెద్దలు సలహాలు ఇస్తుంటారు. ఇందులో కూడా నిజం లేదు. ఆపైన నీరు మూత్రం రూపంలో బయటకు పోతుంది. అంతేకానీ తల్లి నీటిని తాగడం వల్ల బిడ్డకు అందే పాలపై ఎటువంటి ప్రభావం ఉండదు. పూర్వపు రోజుల్లో అమ్మాయిలకి చాలా చిన్నవయసులో పెళ్లిళ్లు అయ్యేవి. ఆ వయసులోనే వారు పిల్లలకు జన్మనిచ్చేవారు. ఫలితంగా తీవ్రమైన పోషకాహార లేమి. ఆ సమయంలో నెయ్యిని ఆహా రంలో చేర్చడం వల్ల కొంత వరకు శరీరానికి మేలు జరిగేది.