అరటి గుజ్జుతో

banana
banana

అరటి గుజ్జుతో

ఆరోగ్యం రోజూ ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి శక్తి వస్తుందని అందరికీ తెలుసు. దీన్ని కేవలం తినడం కోసమే కాకుండా చర్మసౌందర్య సాధనంగా కూడా వాడుకుంటే మంచి ఫలితాలుంటాయి.

అవేమిటో చూద్దాం. ్య పచ్చిపాలలో అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకుని పదినిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే చర్మం మృదువ్ఞగా ఉంటుంది. ్య రెండు అరటిపండ్లు, కొంచెం కీరాముక్క, పుల్లటి పెరుగు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుని తలకి పట్టించుకుంటే తలలోని చుండ్రుపోయి కురులు మెత్తగా, ఆరోగ్యంగా ఉంటాయి. ్య అరటిపండు గుజ్జు, కర్బూజ పండుగుజ్జు, శనగపిండి సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి మోచేతులకు, మోకాళ్లకు పట్టించి పదినిమిషాల తర్వాత స్క్రబ్‌ చేస్తే దళసరి చర్మం మెత్తగా మారుతుంది. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే ఫలితం బాగుంటుంది.