అత్యవసర వైద్య సహాయం ఎందుకు?

TREATMENT
TREATMENT

అత్యవసర వైద్య సహాయం ఎందుకు?

వైద్యరంగంలో అత్యవసర వైద్య సహాయం లేదా ఎమర్జెన్సీ మెడిసిన్‌ అనేది ఒక ముఖ్యమైన విభా గం. రోగుల పరిస్థితిని అంచనా వేయడం, నిర్వ హణ, చికిత్స, ఊహించని విధంగా కలిగే అనా రోగ్యాలు, ప్రమాదాలు మొదలైన వాటిని నివా రించడం ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. ఎవరి కైనా సరే అర్ధరాత్రీ, అపరాత్రీ అని లేకుండా వైద్య సహాయం అవసరం కావచ్చు. ఈ కారణంగా ఆ రోగులకు 24 గంటలపాటూ తక్షణ వైద్య సేవలం దించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ మెడిసిన్‌ బాధ్యతలు అతి ప్రమాదకర స్థితిలో ఉన్న రోగి పరిస్థితిని అంచనా వేయడం, అవసరమైన చికిత్స చేసి పంప డం మొదటి బాధ్యత. పాలనా సంబంధ వ్యవహా రాలు చూడటం, పరిశోధన, అత్యవసర వైద్య సేవల గురించిన బోధన రెండవ బాధ్యత. ఆసు పత్రిలో ఇన్‌పేషెంట్‌గా కానీ, లేదా ఔట్‌ పేషెంట్‌గా కాని రోగికి తదుపరి చికిత్సల గురిం చిన సూచన లు చేయడం మూడవ బాధ్యత.

ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్ల విషయంలో అత్య వసర పరిస్థితి ఎదురైనప్పుడు అవసరమైన వైద్య సేవలు అందించడం, రోగిని ఆసుపత్రిలో చేర్పించ డానికి ముందు అవసరమైన అత్యవసర వైద్యసేవా వ్యవస్థను ఏర్పాటు చేయడం అయి దవ బాధ్యత. ఎమర్జెన్సీ మెడిసిన్‌ అంటే రోగికి తక్షణమే అవస రమైన వైద్య సేవలందించి, మృత్యువును లేదా మరే విధమైన లోపాలు కలుగకుండా నివారించడం. ఎమర్జెన్సీ మెడిసిన్‌లో అన్ని వేళలా అందు బాటులో ఉండి రోగి డిమాండ్‌ మేరకు అవసర మైన వైద్య సేవలందించాల్సి ఉంటుంది.

ఎమర్జెన్సీ మెడికల్‌ కేర్‌లో ప్రతి క్షణం ఎంతో అమూల్య మైనది. గత మూడు నాలుగు దశాబ్దా లుగా అత్య వసర ఆరోగ్య రక్షణ వ్యవస్థ (ఎమ ర్జెన్సీ హెల్త్‌ కేర్‌ సిస్టమ్‌-ఇహెచ్‌సిఎస్‌) ఎంతో అభివృద్ధి చెందింది. ఇహెచ్‌సిఎస్‌ను రెండు విధాలుగా విభజించ వచ్చు. ఒకటి ఆసుపత్రిలో రోగిని చేర్చడానికి ముందు, రెండవది రోగి ఆసుపత్రిలో చేరిన తరువాత. అత్యవసర వైద్య సేవలు (ఎమర్జెన్సీ మెడి కల్‌ సర్వీసెస్‌ – ఇఎంఎస్‌) నెపోలియన్‌ కాలంనాటి యుద్ధం అనుభవాలనుంచి ప్రారంభమైంది. యుద్ధంలో అతి తక్కువ స్థాయిలో గాయాలకు గురైన సైనికులకు అక్కడిక క్కడే అవసరమైన చికిత్స చేసి తిరిగి యుద్ధానికి పంపించే వారు. అప్పటినుంచి యుద్ధరంగంలో గాయాల పాలైన వారిని గుర్తించి, చికిత్స చేయడం అభివృద్ధి చెం దింది. యుద్ధాలలో గాయపడిన వారి వద్దకు వైద్య బృందం వేగంగా చేరుకోవడం, పరిస్థితిని అంచనా వేయడం, రోగి పరిస్థితిని నిలకడగా ఉండేలా చేయ డం, అన్ని సదుపాయాలున్న చోటికి రోగిని వెను వెంటనే తరలించడం మొదలైన అంశాలు ఇఎంఎస్‌ మరింతగా అభివృద్ధి చెందడానికి దోహ దపడ్డాయి.

1966 నాటికి రోగి ఆసుపత్రిలో చేరడానికి ముందు అవసరమైన అత్యవసర వైద్య సేవలు సైనిక రంగం లోనే కాకుండా, సాధారణ పౌరులకు కూడా అందు బాటులోకి వచ్చింది. రోగులు ఆసుపత్రిలో చేరడానికి ముందు వైద్య సేవలందించే వారు రోగి పరిస్థితిని తొలిసారిగా అంచనా వేసి, దానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా ఎమర్జెన్సీ విభాగాలకు వచ్చే రోగుల ప్రాణ రక్షణకు ఇఎంఎస్‌ విధానం ఎంతో ఉపకరించింది. ఈ విధానంలో రోగులకు సేవలందించే వారికి మానవ శరీర నిర్మాణ శాస్త్రం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. అలాగే చికిత్సాపరమైన శిక్షణను కూడా ఇస్తారు.