వాలి సుగ్రీవుల కథ

మంచివాళ్లకు భగవంతుడి అనుగ్రహం

vali sugriva story

వాలి, సుగ్రీవులు కవల పిల్లలు. వాలి మహాబలశాలి. ఎవరైనా వాలితో ఎదురుగా యుద్ధం చేస్తే వారి బలంలో సగం హరించే వరం వాలికి అదనపు బలం.

వాలి, సుగ్రీవుడి భార్య తారను కూడా సంగ్రహించి సుగ్రీవుడిని తన్ని తరిమేసి కిష్కింధను పరిపాలిస్తూ హాయిగా ఉన్నాడు వాలి.

ఇటు అవమానభారం అటు భార్యావియోగంతో కుమిలిపోతూ సుగ్రీవుడు ఆంజనేయునితో కలిసి మంచిరోజుల కోసం ఎదురు చూడసాగాడు.

మంచివాళ్లకు భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది అనడానికి నిదర్శనంగా సీతాదేవిని అన్వేషిస్తూ బయలుదేరిన రామలక్ష్మణులతో సుగ్రీవుడికి స్నేహం ఏర్పడింది.

దయామయుడైన రఘురాములు సీతావియోగ బాధలో ఉండి కూడా ముందు తనతో మైత్రికి వచ్చిన సుగ్రీవుడి కష్టాలు తీర్చాలని నిర్ణయించుకుని అభయం ఇచ్చాడు. శ్రీరామచంద్రుడి అనుగ్రహం పొందిన సుగ్రీవుడు పరమానంతంతో వెళ్లి వాలిని యుద్ధానికి ఆహ్వానించారు.

తమ్ముడు అర్భకుడని వాలికి తెలుసు. అందుకే రెట్టించిన ఉత్సాహంతో యుద్ధానికి వచ్చాడు. అందుకే రెట్టించిన ఉత్సాహంతో యుద్ధానికి వచ్చాడు వాలి, సుగ్రీవులు భయంకరంగా పోట్లాడటం మొదలు పెట్టారు.

అయితే స్నేహితుడికి సాయంగా వాలిని సంహరిద్దామనుకున్న పరమాత్మకు ఆ ఇద్దరూ ఆకారంలో ఒకేలా ఉండడంతో వారిలో వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో అర్ధం కాలేదు. అందువలన మౌనంగా ఆ పోరాటం చూస్తూ ఉండిపోయాడు.

ఆ యుద్ధంలో సుగ్రీవుడికి చావు దెబ్బలు తగిలాయి. ఇంక పోరాడే శక్తిలేక పడిపోయాడు. వాలి, సుగ్రీవుడిని హేళనగా చూస్తూ సుగ్రీవుడి గుండెల మీద తన్ని, తమ్ముడివనే జాలితో చివరిసారిగా క్షమిస్తున్నాను.

మళ్లీ వచ్చావా చావు తప్పడు అని హెచ్చరించి వెళ్లిపోయాడు. దెబ్బలు తిని పడి ఉన్న సుగ్రీవుడి వంక కరుణారస నేత్రాలతో చూసాడు శ్రీరామచంద్రుడు. సుగ్రీవుడు దీనంగా రామచంద్రా! నువ్వు ఆడినమాట తప్పవని అంటారే.

అభయముద్ర అందించి మౌనంగా ఉండిపోయావే? అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సుగ్రీవా! ఆడినమాట తప్పడం రఘువంశంలో లేదు. ఆకారంలో అణుమ్తారం వ్యత్యాసం లేదు. మీ అన్నదమ్ముల్లో వాలి ఎవరో గ్రహించలేకపోయాను.

ఆంజనేయా వెళ్లి ఆ పుష్పమాల తెచ్చి సుగ్రీవుని కంఠాన అలంకరించు అన్నాడు శ్రీరాముడు. ఆజ్ఞ స్వామీ! అంటూ మాల తెచ్చి సుగ్రీవుడి కంఠంలో వేశాడు ఆంజనేయుడు.

సుగ్రీవా! లే ఇంక నీకు ఎదురు లేదు. వెళ్లు. వాలిని యుద్ధానికి పిలు అన్నాడు శ్రీరాముడు. మళ్లీనా అన్నాడు సుగ్రీవుడు భయంగా వాలి దెబ్బలు తలుచుకుంటూ. నీకేం భయం లేదు. రామబాణం నీకు అండగా ఉంది అన్నాడు శ్రీరాముడు స్థిరంగా. లేని శక్తినీ, ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ సుగ్రీవుడు. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు.

తమ్ముడిని ప్రాణాలతో విడిచి పెట్టకూడదనుకున్నాడు. ఇద్దరి మధ్య భయంకరంగా యుద్ధం ఆరంభమైంది. శ్రీరాముడు ఉపేక్ష అనవసరం అని భావించి చెట్టు చాటు నుండి వాలి మీద గురి చూసి బాణం విడిచాడు. రామబాణం శతకోటి కాంతులతో దూసుకెళ్లి వాలి గుండెలను చీల్చేసింది.

శ్రీరామునితో సుగ్రీవ మైత్రి అంతకుముందే తెలిసి ఉన్న వాలి రామచంద్రా! ధర్మస్వరూపుడివంటారే చెట్టు చాటు నుండి సాటి వీరుడిని వధించడం న్యాయమా తండ్రీ! అని ప్రశ్నించాడు. ‘

మృగయా వినోదం క్షత్రియ ధర్మం అనే ధర్మంతో నిన్ను చెట్టు చాటు నుండి వధించాను. నీకున్న వరం నీ అధర్మ ప్రవర్తన నా చేత అలా చేయించాయి అన్నాడు శ్రీరాముడు.

శ్రీరామచంద్రుని మనోహరమూర్తి దర్శనంతో జన్మధన్యమైనది అనే భావంతో తన కుమారుడైన అంగదుడిని రాముని సేవకునిగా అప్పగించి తృప్తిగా కన్నుమూశాడు వాలి. ఆడినమాట ప్రకారం సుగ్రీవుడిని రాజుని చేశాడు శ్రీరామచంద్రుడు.

  • వులాపు బాలకేశవులు

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/