సాటి వారికి సహాయం

ఆధ్యాతిక చింతన

The Mahaabharatam

ఆశ్రయం ఇచ్చాక వెళ్లి పొమ్మనడం మహా పాపమని తర్కించుకుంటుంది సుధేష్ట. నిస్స
హాయురాలైన తోటి మహిళ శరణువేడితే సరేనంది. అదే పెను ముప్పులా పరిణమిస్తుందని ఆమె ఊహించలేదు. స్త్రీ అంటే కరుణ, స్త్రీ అంటే ప్రేమ, స్త్రీ అంటే జాలి. దయ. ఏ యుగంలోనైనా ఇంతే. మహిళల మనసు నిత్యమూ ప్రవహించే జీవనది.

ఇందుకు ఉదాహరణ మహాభారతం కాలం నాటి సుధేష్ట. కష్టాల్ల ఉన్న ద్రౌపదికి ఆశ్రయమిస్తుంది. మత్స్యదేశాధిపతి విరటుడు భోగలాలసుడు. బావమరిది సంపాదించి పెట్టిన రాజ్యాన్ని ఏలుతూ ఆనందపడేవాడు. అతడి భార్య సుధేష్ట. ఉత్తమ ఇల్లాలు. అరణ్యవాసం ముగించుకున్న పాండవ్ఞలు యేడాదిపాటు అజ్ఞాతంలో గడపాలి. రహస్యజీవనానికి మత్స్యదేశమే మేలని విరటుని కొలువ్ఞలో చేరిపోతారు.

ద్రౌపది రాణివాస స్త్రీలకు పూలమాలలు కట్టివ్వడం, మహారాణి సుధేష్టాదేవికి కేశసంరక్షణ చేయబూనుతుంది. ద్రౌపదిని చూడగానే సుధేష్ట విస్మయానికి లోనవ్ఞతుంది. పరిచారికగా పని చేసేందుకు వచ్చిన ఈమె సామాన్య స్త్రీ కాదని అంచనావేస్తుంది. తన భర్త చపలచిత్తుడు. ఈ దాసి అందచందాలు చూసి కట్టుతప్పుతాడేమోని ఆమెకు పని ఇవ్వడానికి భయపడుతుంది. ఇన్ని ఆలోచనలు ముప్పిరిగొంటున్నప్పటికీ సాయంకోరి వచ్చిన పిల్ల కష్టాల్లో ఉంది.

మానవతకే పెద్ద పీట వేయాలని భావిస్తుంది సుధేష్ట. ఆమె అనుకున్న ఆపద భర్త వల్ల కాక సోదరుని వల్ల ముంచుకొస్తుంది. సుధేష్ట తోబుట్టువ్ఞ కీచకుడు హఠాత్తుగా రంగప్రవేశం చేస్తాడు. ఒకానొకరోజు సోదరి మందిరానికి వచ్చిన సింహబలుడు ద్రౌపది రూపలావణ్యాలకు మోహవశుడవ్ఞతాడు. సోదరి దగ్గర మనసులో మాట బయటపెడతాడు.

సుధేష్ట హృదయం దుఃఖసంకులమవ్ఞతుంది. తోబుట్టువ్ఞ ఎంతటి దుర్మార్గుడో ఆమెకు తెలియంది కాదు. నాటి నుండి మెకి కంటి మీద కునుకుండదు. సైరంధ్రిని ఎలా రక్షించాలో తెలియక మనసు కష్టపెట్టుకుంటుంది. అంతఃపురమే ద్రౌపదికి అవమానాల వేదికవ్ఞతుంది.

కీచకుడు లజ్జావిహీనుడై వెంటపడుతుంటే తనను తాను కాపాడుకోవడం ఆమెకి శక్తికి మించిన పనవ్ఞతుంది. కీచకుణ్ణి ఎలా నిలువరించాలో తెలియక కుమిలిపోతుంది.

ఈమె పరిస్థితి ఇలా ఉంటే సుధేష్ణ స్థితి ఇంకా దారుణం. సోదరుని మాట కాదంటే తనను తన కుటుంబాన్ని నాశనం చేస్తాడని తెలుసు. అయినప్పటికీ మూర్ఖుడైన కీచకుడి మనసు మార్చేందుకు శతధా ప్రయత్నిస్తుంది. మంచిమాటలు చెప్పి దారికి తెద్దామనుకుంటుంది.

ఫలితం కనిపించదు. కీచకునికి చెప్పలేక, ద్రౌపదిని కాని పనులకు నియోగించలేక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతుంది.

ద్రౌపది మారువేషాల్లో ఉన్న భర్తలకు చెబుతుంది. అంతా కలసి సింహబలుడి మదం అణచేందుకు వీలును బట్టి బరిలోకి దింపుతారు. నర్తనశాలకి కీచకుణ్ణి రప్పిస్తారు. భీముడు ఆ కాముకుని ఊపిరి తీస్తాడు.

తనకు ఆశ్రయం ఇవ్వాలన్న మంచి తలంపే సుధేష్టకు కడగండ్లు తెచ్చి పెట్టాయని ద్రౌపదికి తెలుసు.

అందుకే అజ్ఞాతవాసం ముగిశాక ఆమె ముద్దుల కూతురు ఉత్తరను సుభద్రార్జునుల పుత్రుడు అభిమన్య కుమారునికిచిచ వివాహం జరిపిస్తుంది.

సాటి వారికి సాయం చేస్తే చివరికి సంతోషమే దక్కితీరుతుంది. సుధేష్ట జీవితమిచ్చే సందేశమిదే.

ఆశ్రయం ఇచ్చాక వెళ్లి పొమ్మనడం మహా పాపమని తర్కించుకుంటుంది సుధేష్ట. నిస్స
హాయురాలైన తోటి మహిళ శరణువేడితే సరేనంది.

అదే పెను ముప్పులా పరిణమిస్తుందని ఆమె ఊహించలేదు. స్త్రీ అంటే కరుణ, స్త్రీ అంటే ప్రేమ, స్త్రీ అంటే జాలి. దయ. ఏ యుగంలోనైనా ఇంతే.

మహిళల మనసు నిత్యమూ ప్రవహించే జీవనది. ఇందుకు ఉదాహరణ మహాభారతం కాలం నాటి సుధేష్ట. కష్టాల్ల ఉన్న ద్రౌపదికి ఆశ్రయమిస్తుంది. మత్స్యదేశాధిపతి విరటుడు భోగలాలసుడు.

బావమరిది సంపాదించి పెట్టిన రాజ్యాన్ని ఏలుతూ ఆనందపడేవాడు.

అతడి భార్య సుధేష్ట. ఉత్తమ ఇల్లాలు. అరణ్యవాసం ముగించుకున్న పాండవ్ఞలు యేడాదిపాటు అజ్ఞాతంలో గడపాలి. రహస్యజీవనానికి మత్స్యదేశమే మేలని విరటుని కొలువ్ఞలో చేరిపోతారు.

ద్రౌపది రాణివాస స్త్రీలకు పూలమాలలు కట్టివ్వడం, మహారాణి సుధేష్టాదేవికి కేశసంరక్షణ చేయబూనుతుంది.

ద్రౌపదిని చూడగానే సుధేష్ట విస్మయానికి లోనవ్ఞతుంది. పరిచారికగా పని చేసేందుకు వచ్చిన ఈమె సామాన్య స్త్రీ కాదని అంచనావేస్తుంది.

తన భర్త చపలచిత్తుడు. ఈ దాసి అందచందాలు చూసి కట్టుతప్పుతాడేమోని ఆమెకు పని ఇవ్వడానికి భయపడుతుంది. ఇన్ని ఆలోచనలు ముప్పిరిగొంటున్నప్పటికీ సాయంకోరి వచ్చిన పిల్ల కష్టాల్లో ఉంది. మానవతకే పెద్ద పీట వేయాలని భావిస్తుంది సుధేష్ట.

ఆమె అనుకున్న ఆపద భర్త వల్ల కాక సోదరుని వల్ల ముంచుకొస్తుంది. సుధేష్ట తోబుట్టువ్ఞ కీచకుడు హఠాత్తుగా రంగప్రవేశం చేస్తాడు.

ఒకానొకరోజు సోదరి మందిరానికి వచ్చిన సింహబలుడు ద్రౌపది రూపలావణ్యాలకు మోహవశుడవ్ఞతాడు.

సోదరి దగ్గర మనసులో మాట బయటపెడతాడు. సుధేష్ట హృదయం దుఃఖసంకులమవ్ఞతుంది.

తోబుట్టువ్ఞ ఎంతటి దుర్మార్గుడో ఆమెకు తెలియంది కాదు. నాటి నుండి మెకి కంటి మీద కునుకుండదు. సైరంధ్రిని ఎలా రక్షించాలో తెలియక మనసు కష్టపెట్టుకుంటుంది.

అంతఃపురమే ద్రౌపదికి అవమానాల వేదికవ్ఞతుంది. కీచకుడు లజ్జావిహీనుడై వెంటపడుతుంటే తనను తాను కాపాడుకోవడం ఆమెకి శక్తికి మించిన పనవ్ఞతుంది.

కీచకుణ్ణి ఎలా నిలువరించాలో తెలియక కుమిలిపోతుంది. ఈమె పరిస్థితి ఇలా ఉంటే సుధేష్ణ స్థితి ఇంకా దారుణం.

సోదరుని మాట కాదంటే తనను తన కుటుంబాన్ని నాశనం చేస్తాడని తెలుసు. అయినప్పటికీ మూర్ఖుడైన కీచకుడి మనసు మార్చేందుకు శతధా ప్రయత్నిస్తుంది.

మంచిమాటలు చెప్పి దారికి తెద్దామనుకుంటుంది. ఫలితం కనిపించదు. కీచకునికి చెప్పలేక, ద్రౌపదిని కాని పనులకు నియోగించలేక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతుంది.

ద్రౌపది మారువేషాల్లో ఉన్న భర్తలకు చెబుతుంది. అంతా కలసి సింహబలుడి మదం అణచేందుకు వీలును బట్టి బరిలోకి దింపుతారు.

నర్తనశాలకి కీచకుణ్ణి రప్పిస్తారు. భీముడు ఆ కాముకుని ఊపిరి తీస్తాడు. తనకు ఆశ్రయం ఇవ్వాలన్న మంచి తలంపే సుధేష్టకు కడగండ్లు తెచ్చి పెట్టాయని ద్రౌపదికి తెలుసు.

అందుకే అజ్ఞాతవాసం ముగిశాక ఆమె ముద్దుల కూతురు ఉత్తరను సుభద్రార్జునుల పుత్రుడు అభిమన్య కుమారునికిచిచ వివాహం జరిపిస్తుంది.

సాటి వారికి సాయం చేస్తే చివరికి సంతోషమే దక్కితీరుతుంది. సుధేష్ట జీవితమిచ్చే సందేశమిదే.

  • ఉలాపు బాలకేశవులు

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/