కర్ణుడు పుట్టుకే ఒక విచిత్రం

ఆధ్యాత్మిక చింతన

The birth of Karna
The birth of Karna

తనకు మేలు చేసిన వారికి, ప్రత్యుపకారం చేయలేకున్నా వారి వెన్నంటి తుదివరకూ వరిపట్ల కృతజ్ఞతా భావంతో మెలిగే ‘స్వామిభక్తి పరాయణులలో, మహాభారతయోధుడు కర్ణుడు అగ్రగణ్యుడు. ఆయన పుట్టుకే ఒక విచిత్రం.

దుర్వాససేవలతో ఆయన అనుగ్రహంతో ఇచ్చిన వరాన్ని పరిశీలించే ప్రయత్నంలో సాక్షాత్తు సూర్యభగవానుని ప్రార్థించి కన్యగా ఉన్న కుంతి, ఆయన ప్రసాదంగా లభించిన పుత్రుని లోకనిందకు భయపడి. పెట్టెలో పసిబాలుడైన కర్ణుని ఉంచి, నీటిలో వదలి వేసింది.

సహజ కవచకుండాలాలతో ప్రకాశించే ఆబాలుడని, అందుకుని సూతుడు, తన భార్యరాధకిచ్చి పెంచునుగా, రాధేయుడిగా కర్ణుడు పెరిగి పెద్దవాడై అస్త్రశస్త్రని విద్యాపారంగతుడై, భీమార్జులతో పోటీపడగల వీరుడిగా రూపొంది అపారమైన దానగుణంతో, దానకర్ణుడనే మహానుభావ్ఞడిగా పేరుపొందాడు.

ఎంత గొప్పవాడైనా అనేక శాపాలకుగురై తాను నేర్చిన విద్యలకు, సాఫల్యం పొందలేకపోయాడు. పరశురాముడి ఆగ్రహానికి బలై, యుద్ధసమయంలో, తన అస్త్రశస్త్రవిద్యలు మరచిపోయేలా ఆయనచే శాపం పొందాడు కర్ణుడు.

నిజం చెప్పాలంటే పాండవ్ఞలలో ధర్మరాజుకన్నా ముందే, కుంతీపుత్రుడైన కర్ణుడే అగ్రజుడు.

కానీ కుంతి ఈ విషయం దాచినందుకు ఆయన క్షత్రియుడైనా, సూతపుత్రుడిగా ఎన్నో అవమానాలకు గురై, కౌరవపక్షపాతిగా, దుష్టచతుష్టయంలో ఒకరుగా మసలవలసి వచ్చింది.

కారవపాండవ్ఞల మధ్య జరిగిన విలువిద్యాప్రదర్శనలో, అర్జునునితో తలపడేవేళ, కౌరవపెద్దలచే తిరస్కరింపబడి, సూతపుత్రుడిగా అవమానించబడ్డ కర్ణుడిని రారాజు దుర్యోధనుడు, అతని ప్రజ్ఞాపాటవాలను గ్రహించి అంగరాజపట్టాభి షిక్తుడిని గావించాడు.

తనను ఆవిధంగా ఆదరించిన దుర్యోధనుని, ఆత్మీయుడిగా స్నేహితుడిగా, ఆజన్మాంతం ఆయన వెంటే సహాయంగా, ఉండ నిశ్చయించాడు కర్ణుడు. పాండవ్ఞలనే ప్రత్యర్ణు లుగా తలచి పోరుకు సిద్ధపడ్డాడు.

మహావీరుడైన కర్ణుని ఓడించాలని ఎన్నో పన్నాగాలు పన్ని చివరకు కర్ణుని కవచకుండలా లను, ఇండ్రునికి దానంగా ఇచ్చే ఏర్పాటు గావించారు.

శ్రీకృష్ణుని సహా పాండవ్ఞలు. పుట్టుకతోనే తల్లి ప్రేమకు దూరమై పాండవ్ఞల ను విడనాడి, దుర్యోధన మైత్రికై అసువ్ఞలు అర్పించిన మహాభారత మహామహాడు కర్ణుడే అంటే అతిశయోక్తి కాదు.

అర్జునుని తప్ప మిగిలిన నలుగురినీ పోరులో విడిచిపెడతానని, తాను మర ణిస్తే పాండవ్ఞలు అయిదుగురు అర్జునునితో సహాఉంటారని లేదా అర్జునుడి సంహరిస్తే తనతో పంచ పాండవ్ఞలు ఉంటారని కుంతికి మాట ఇచ్చిన మాతృభక్తుడు కర్ణుడు.

పంచమవేదంగా ప్రసిద్ధమైన మహాభారతగాధతో కర్ణ చరితం అనిర్వచనీయం. అపూర్వం. ఎన్ని మంచి గుణాలున్నా దుష్టసాంగత్యం ప్రమాదకరం అని కర్ణగాధ నిరూపిస్తుంది.

  • యం.వి.రమణకుమారి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/