శుక్రాచార్యుడి శాపం

ఆధ్యాత్మిక చింతన

shukracharya
shukracharya

పురోహితుడైన శుక్రాచార్యుని అండదండలతో దండుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. ఒకరోజు దండుడు శుక్రాచార్యుల ఆశ్రమానికి వెళ్లాడు.

శుక్రాచార్యుని కుమార్తె అరజను చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు, తన కోరికను వెలిబుచ్చాడు.

అరజ ఓర్పుతో ‘ రాజా! నేను పుణ్యకర్మలు చేస్తూ ఉంే శుక్రాచార్యుని పుత్రికను. నా పేరు అరజ.

నా తండ్రి నీకు గురువు నీవు నన్ను కోరుకుంటున్నట్లయితే ధర్మసమ్మతంగా నా తండ్రి వద్దకు పోయి అడుగు, నా తండ్రిని యాచించు,

అతడు తప్పక నన్ను నీకు ఇవ్వగలడు అని చెప్పింది.

కామపరవశుడైన ఆ దండుడు ఆమెను కౌగిలించుకుని బలాత్కారంగా అనుభవించాడు. పాపకృత్యాన్ని చేసి తన నగరానికి వెళ్లిపోయాడు.

కొంతసేపటికి శుక్రాచార్యుడు ఆకలితో బాధపడుతూ శిష్యులతో కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.

దీనురాలై ఏడుస్తున్న అరజను చూశాడు. విషయాన్ని తెలుసుకున్నాడు.

ఇక్కడ ఉండే స్థావర జంగమాలు సమస్త ప్రాణులు ఏడు రాత్రులు ధూళి వర్షం పడి మరణించుగాక! అని శపించాడు. అరజను చూసి ‘ఓ దుర్బుద్ధి గలదానా!

పవిత్రురాలవ్ఞ అయ్యే వరకు నువ్ఞ్వ ఈ ఆశ్రమంలోనే నిశ్చల ధ్యానం చేసుకొంటూ నివసించు అని అన్నాడు.

పుణ్యకర్మలు చేసేవాడు శుక్రాచార్యడు. పాపకార్యం చేసిన వాడు దండుడు అతని శిష్యుడే.

పుణ్యకర్మలు నిత్యమూ చేసే శుక్రాచార్యులను చూసి, ఆయన చేసిన బోధలను విని, ఆయన అండదండలతో రాజ్యమును దండుడు బాగా పాలించాడు. సుస్థిరపాలన, సుపరిపాలన ప్రజలకు అందించాడేమోగాని తాను బాగుపడ్డట్లు కనపడడు.


అందమైన స్త్రీని చూడటం, ఆశపడటం ప్రకృతి సహజమైన విషయం కావచ్చు. కానీ ఆమె తన గురుపుత్రిక అని తెలుసు, ఆమె ఇచ్చిన సలహా కూడా ఎంతో బాగా ఉంది.

కొంత ఆలోచించి, తనను తాను నియంత్రిచుకుని ఆమె సలహాను పాటించి ఉండినట్లయితే తన కోరిక తీరి ఉండేది. గురుకృప కలిగి ఉండేది.

కానీ దండుడు ఆమె సలహాను పెడచెవిన పెట్టాడు. తొందరపడ్డాడు. దండనార్హుడయ్యాడు. శుక్రాచార్యుడు పుణ్యకర్మలు చేసేవాడు

, వృద్ధుడు, గురువ్ఞ, లోకానుభవమున్నవాడు. యువకుడు, శిష్యుడు తొందరపడితే దాన్ని కొంత అర్ధం చేసుకోవచ్చు.

కానీ శుక్రాచార్యుడు అంత తొందరపడి, కోపానికి వశుడై, తనను తాను నియంత్రించుకోలేక శాపం పెట్టటమేమిటి? \

తప్పు చేసిన వాడు దండుడు, శాపఫలితాన్ని ఆనుభవించిన వారు ఆయన పుత్రులు, సైనికులు, వాహనాలు, స్థావర జంగమాలు, ఆ ప్రాంతంలోని మొత్తం ప్రకృతి.

ఇదేమి న్యాయం? ఇదెక్కడి ధర్మం? వీరేమి ఆచార్యులు? శుక్రాచార్యుడు తన పుత్రిక అరజను ‘దుర్బుద్ధి గల దానా అని అంటూ ఆమెను శపిస్తాడు.

ఆమె చేసిన తప్పేమిటి? ఇలా మనం మన వివేకాన్ని వినియోగించి ప్రశ్నించాలనే వాల్మీకి మహర్షి జరిగిన దాన్ని జరిగినట్లు గ్రంథస్థం చేశాడేమో!

ప్రశ్నించటం నేర్చుకొన్న తర్వాతనే ఆధ్యాత్మిక శిఖరానికి చేర్చగలిగే ప్రశ్నోపనిషత్తు మనకు బాగా అర్ధమవుతుంది,

ఉపయోగపడుతుంది. గుడ్డి విశ్వాసం మనలను అడుగు లేని గుంతలోకి నెట్టుతుంది. బయట పడలేము.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/