కాలపరిమితి లేని కృప

ఆధ్యాత్మిక చింతన

Shirdi sai baba
Shirdi sai baba

సాయిబాబా షిరిడీకి చేరిన తరువాత మరెక్కడకు పోలేదు. ఎప్పుడైనా దగ్గర దగ్గరలో నున్న రెండు గ్రామాలలో ఉన్న భక్తుల గృహాలకు వెళ్లేవారు.

ఆ భక్తుల గృహాలలో సాయిబాబా రాత్రిపూట నిద్రించే వారు కాదు.

ఆ భక్తుల గృహాలలో కొన్ని గంటలు గడిపి, తిరిగి తన నివాసమైన షిర్డి చేరేవారు.

కాశ్మీరులో స్వామి హల్‌ ధర్‌ జీ మహారాజ్‌ అనే పేరుతో ప్రసిద్ధిగాంచిన మహనీయుడుండేవాడు.

హల్‌ధర్‌ మ హారాజ్‌ బుఢ్‌ముల్లా అనే గ్రామానికి ఒకసారి వచ్చారు. ఆ గ్రామం, ఆ గ్రామ పరిసరాలు ఆయనను ఎంతో ఆకర్షించాయి.

అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉన్నది వాతావరణం. ఆయన అక్కడనే నివాసం ఏర్పరచుకొనదలచారు.

ఒక ఇంటికి వెళ్లారు ఆయన. ఆయనను అందరూ గుర్తిస్తారు కదా.

ఆ గృహణిని అడిగారు ‘నేను ఇక్కడనే నివాసం చేయదలచుకున్నాను అని ఆమెతో చెప్పారు.

ఆ గృహణి పేరు శ్రీమతి శ్రీద్వేడ్‌. ఆమె భర్త మరణించారు.

ఆమెకు ఎనిమిది మంది సంతానం. అయిదుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు.

ఆస్తిపాస్తులు లేవు. కుటుంబాన్ని ఆమె అతి కష్టం మీద పోషించుకురాసాగింది. ఆమె ఈ విషయాన్నే ఆ మహనీయునకు వివరంగా చెప్పింది.

‘తల్లీ నీకు ఉన్నది ఎనిమిది మంది సంతానమే అనుకోకు, నేను నీ తొమ్మిదవ సంతానంగా భావించు అని ఆమెకు చెప్పారు.

ఆమె ఆ మహనీయుని మాటను కాదనలేకపోయింది. ఆ మహనీయుడు అక్కడనే నివసించసాగాడు.

ఆమెకు, ఆమె కుటుంబానికి ఆయన భారం కాలేదు. ఆ ఇంట ఆయన అడుగుపెట్టటమే మహాభాగ్యము అనిపించింది.

రాను రాను ఆ కుటుంబానికి. ఆ కుటుంబంలో సిరిసంపదలు, సుఖసంతోషాలు పెరగనారంభించాయి. అందరకు ఆయన గురువు అయ్యారు.

అందరూ సంపన్నులయ్యారు. కాలం గడుస్తోంది.ఒకసారి ఆయన ఆ కుటుంబం వారితో సంపదలు శాశ్వతం కాదు అన్నారు.

ఆయన మహాసమాధి చెందారు. ఆయన స్మారక చిహ్నంగా పాదుకలు, ఒక ఫొటో, శాలువా మిగిలిపోయాయి ఆ కుటుంబం వారికి.

ఒకనాటి రాత్రి న కుటుంబ పెద్ద స్వప్నంలో కనిపించి, వెంటనే ‘ఈ భవనాన్ని వదలి దూరంగా వెళ్లిపొండి అని ఆదేశం ఇచ్చారు.

ఆ కుటుంబంలో 17 మంది పెద్దవారే కాక, చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

వెంటనే వారు అతి ముఖ్యమైన వస్తువులను పట్టుకుని ఆ భవనాన్ని విడిచి 22 కిలోమీటర్ల దూరంలో గ్రామంలో తలదాచుకున్నారు.

తెల్లవారగనే తెలిసింది. గ్రామాలను దుండగులు ముట్టడించి వస్తువులను ఆభరణాలను దోచుకుని, గృహాలను అగ్నికి ఆహుతి చేశారని.

స్వామి హల్‌ధర్‌జీ మహారాజ్‌ మహాసమాధి చెందినా, తమ లీలలను చూపించారు.

ఒకనాటి సుసంపన్నులు, చేతిలో కాణీ లేని బికారులయ్యారు. ఇలా జరుగుతుందని ఆ మహనీయుడు ముందుగానే చెప్పాడు.

కొంతకాలం తరువాత ఆ కుటుంబం సుసంపన్నమవసాగింది. ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి కుమార్తె వివాహం చేస్తున్నాడు.

విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆకాశం కారుమేఘములతో నిండిపోయింది. ఇంకో క్షణంలో భారీ వర్షం కురుస్తుందనిపించింది.

వెంటనే స్వామి హల్‌ధర్‌జీ మహారాజ్‌ చిత్రాన్ని ఇంటిలో నుండి తెచ్చి బయటకు తెచ్చి, ఆకాశంవైపు చూపారు. వర్షం కురువలేదు. ఇలా ఎన్నో లీలలు పాదుకలు, చిత్రం చూపింది.

మహనీయుల కృప మరణించరు. నమ్మకంతో పాటు కృప పెరుగుతుంది.

  • యం.పి.సాయినాథ్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/