మంచి మనసులు

శ్రీ షిర్డీ సాయి మహిమలు

Shirdi sai baba
Shirdi sai baba

ఈ విశాల విశ్వమంతా కరుణను పొందటానికి అర్హమే. ఈ విషయమే సాయిబాబా పలు సందర్భాలలో చూపారు. కావేవీ కవితకు అనర్హం అన్నట్లు, కారెవరూ కరుణకు అనర్హులు. విజయకృష్ణగోస్వామి సాయిబాబా సమకాలికుడు.

సాయి మహారాష్ట్రలో ఉంటే, విజయకృష్ణగోస్వామి వంగరాష్ట్రంలో ముఖ్యంగా నివసించారు. విజయకృష్ణగోస్వామి తల్లిపేరు స్వర్ణమాయి.

ఆమె పేరులోనే బంగారం లేదు, మనసంతా బంగారమే. ఒకసారి ఆమె బయటకు వెళ్లింది. దారిలో ఆమె ఒక అనాధగా ఉన్న స్త్రీని చూసింది. ఆ అనాధ స్త్రీ గతంలో వేశ్యావృత్తిలో ఉండేది.

నేడు తిండికి బట్టకు కరువైన స్థితిలో ఉన్నది. అందరినీ యాచిస్తోంది దీనంగా. స్వర్ణమయాయి ఆ వేశ్య దుస్థితిని చూచింది. స్వర్ణమయి కంట నీరు కారసాగింది.

వెంటనే ఇంటికి వెళ్లింది. స్వర్ణమాయి ఒక చీరను, తాను ఆ పూట తినవలసిన ఆహారాన్ని, తన కుమారుడైన విజయ కృష్ణగోస్వామిచే ఆమెకు పంపించింది.

అయితే స్వర్ణమాయికి ఇంటి నిండా చీరలు లేవు. ఆమెకు ఉన్నవి ఒకటి, రెండు చీరలు మాత్రమే. ఇక ఆ పూట ఆమెకు అన్నం కూడా తినటానికి లేదు. ఈ పరిస్థితిని చూచిన విజయకృష్ణగోస్వామి తల్లిదయార్ద్ర హృదయానికి సంతసించాడు.

అది బీజం. విజయకృష్ణగోస్వామిలో పాతుకుపోయింది. విజయకృష్ణగోస్వామికి వివాహమయింది. ఆతని భార్య పేరు యోగమాయ. యోగమాయ, స్వర్ణమయి కలసిమెలసి పాడేవారు.

తాను కోడలునని, తాను అత్తననే భావం ఆ ఇద్దరిలో కనపడేది కాదు. ఒకసరి యోగమాయ కంటే ముందుగానే స్వర్ణమాయి, విజయకృష్ణగోస్వాములు భోజనం చేశారు.

యోగమాయ ఒక్కతే భోజానికి కూర్చున్నది. ఆమె పక్కనే అత్త, భర్తలు కూడా ఉన్నారు. అదే సమయంలో, తలుపు వద్ద ‘అమ్మా! ఆకలి అని ఎవరో కేకవేశారు.

ఆ కేకను ఆ ముగ్గురు విన్నారు. యోగమాయ తాను భుజించవలసిన అన్నాన్ని, ఆ బిచ్చగాడికి ఇచ్చివేసింది. దీనినంతా అత్త, భర్త గమనించారు.

‘నీవు తినకుండా బిచ్చగానికి ఇచ్చావా? అని అడిగింది అత్త కోడల్ని. ‘ఏం చేసేది? ఒక చేతితో ఆహారాన్ని ఇచ్చిన ఆ భగవానుడే, వేరొక చేతిని చాచి, అన్నం అడిగితే ఇవ్వకుండా నేనెలా ఉండగలను? అని వినయంగా సంజాయిషీ చెప్పింది అత్తగారికి. ఆ అత్తగారికి ఎంతో సంతోషం కలిగింది కోడలు చేసిన పనికి. బాల్యంలో విజయకృష్ణగోస్వామి కూడా అంతే.

పాఠశాలకు పోయేటప్పుడు చక్కని బట్టలతో వెళ్లేవాడు. దరిలో ఏ బాలుడైన బట్టలు లేకుండా కనిపిస్తే, తన బట్టలను ఇచ్చి ఇంటికి వచ్చేవాడు. తల్లికి ఈ విషయం చెప్పేవాడు. చిరిగిన బట్టలకు అతుకులు వేసి కుట్టుకుట్టి తల్లి ఇచ్చేది విజయకృష్ణగోస్వామికి. ‘నిన్ను శ్యామసుందరుడు కరుణిస్తాడు నాయనా! అనేది తల్లి. అవి మంచిమనసులు.

  • యం.పి. సాయినాథ్‌

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/