సద్గురువుల రక్షణ

Shirdi Sai Baba
Shirdi Sai Baba

సద్గురువుల చేష్టలు, మాటలు సర్వసామాన్యంగా ఎవరికీ అర్థం కావ్ఞ. వారి మాటలకు హద్దులు లేనట్లే వారిచేష్టలకూ హద్దుఉండదు. ఇంకా వారిచ్చే రక్షణకూ హద్దు ఉండదు. అక్కర్‌ కోటమహారాజ్‌, గజానన్‌ మహారాజ్‌, సాయిబాబాలను దత్తాత్రయం అంటారు. అక్కర్‌కోట మహారాజ్‌ బ్రహ్మాండ సంభూతుడని, గజాననులవారు విష్వాంశ సంభూతుడని, సాయిబాబా రుద్రాంశ సంభూతుడని, అంటారు. వీరు మువ్ఞ్వరు సమకాలీనులే. ఈ ముగ్గురు స్వతంత్ర సిద్ధికై తోడ్పడినారు. తోడ్పడ్డారు అంటే వారి మాటలను బట్టి, చేష్టలను బట్టి గ్రహించాల్సి ఉంటుంది. అక్కల్‌ కోట మహారాజ్‌ అక్కల్‌ కోటలో ఉండేవారు.

ఆ స్వామి దగ్గరలో నున్న అడవికి వెళ్ళి ఆముదపు కొమ్మలను తెచ్చి వాటితోను, తన దుప్పటి నుండి తీసిన దారపు పోగులతోను ఆడుకుంటుండే వారు. దీనికి అర్థం ఎవరికీ తెలిసేదికాదు. అర్థం ఏమిటని అడగటానికి కూడా భక్తులు సాహసించరు. ఎవరో ఒకరు ధైర్యంగా అడిగారు – ఆ చేష్టలకు అర్థం ఏమిటని ? నేను సైన్యాన్ని తయారుచేస్తున్నాను అని జవాబు ఇచ్చారు. ఒక్కొక్కప్పుడు ఆయన కోటలో వేలాడదీయబడిన పెద్ద ఫిరంగి గొట్టాలలో తలదూర్చి ఆడుకుంటుండే వారు.

కొంతకాలం తరువాత ఆయన మాటలకు చేష్టలకు అర్థం కొంతవరకు అయింది. అప్పుడు బ్రిటీష్‌ సామ్రాజ్య విస్తరణను అరికట్టడానికి సిపాయిల తిరుగుబాటు జరిగింది. కొందరు రాజ్యాధి పతులు సైన్యాన్ని ప్రోగుచేసి, ఆంగ్లేయులతో తలపడటం కూడా జరిగింది. దీనిని బట్టి అక్కర్‌ కోట మహారాజ్‌ మాటలను, చేష్టలను అర్థం చేసుకోవటం కొంతవరకు జరిగింది. ఉపాసనీమహారాజ్‌ సోదరుడు బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి. ఈయన ఒకసారి షిరిడీ వెళ్ళాడు.

తమ్ముడయిన ఉపాసనీ ఆచూకీ తెలుసుకునేందుకు ఆ సమయంలో సాయిబాబా తాను ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో ఉన్నానని చెప్పారు. గజానన్‌ మహారాజ్‌ ఒకసారి బాలగంగాధర్‌ తిలక్‌ నిర్వహించిన సభలో పాల్గొన్నాడు.
గజానన్‌ మహారాజ్‌ తిలక్‌కు కుడి భుజంగా పనిచేసే కపర్దే అనే వ్యక్తికి ఎట్టి ఆపదలు బ్రిటీష్‌ వారి నుండి రాకుండా కాపాడేవారు. గజానన్‌ మహారాజ్‌ తన మహా సమాధి అనంతరం, కపర్దే కుటుంబాన్ని షిరిడీకి చేరమని సూచన ఇచ్చారు.

ఇక కపర్దే కుటుంబాన్ని రక్షించే భారం సాయి తన భుజస్కంధాలపై వేసుకున్నారు. కపర్దే షిరిడీలో, సాయి సన్నిదిలో ఉన్న సమయంలో బ్రిటీష్‌ ప్రభుత్వం సి.ఐ.డి ని షిరిడీకి పంపింది. నదేకర్‌ అనే పేరుతో షిరిడీకి చేరాడు ఆ సి.ఐ.డి. ఆధ్యాత్మిక వేత్తల మనస్సులను హత్తుకునేటట్లు ప్రవర్తించాడు. అతడు సి.ఐ. డి అని గుర్తించలేకపో యారెవరు. ఆ సి.ఐ.డి షిరిడీలో ఉన్న సమయంలో కపర్దేతోనే సాయి గవర్నర్‌ బల్లెంతో వచ్చాడని, తాను (సాయి) త్రిశూలంతో తరిమివేశానని చెప్పారు. సాయి మహాసమాధీ అనంతరం ఉపాసనీ మహారాజ్‌ను కలవటానికి మహాత్మాగాంధీ వెళ్ళారు.

  • యం.పి.సాయినాధ్‌

తాజా నాడి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/