ప్రశంస, విమర్శ

ఆధ్యాత్మిక చింతన

Praise-criticism
Praise-criticism

ప్రశంస అంటే పొగడ్త, విమర్శ అంటే తెగడ్త. ఒక వ్యక్తిలో ఉన్న సుగుణాలను ఎత్తి చూపుతూ పొగడవచ్చు, లేని సద్గుణాలను ఉన్నట్టు చెప్పీ పొగడవచ్చు. మనలో ఎక్కువమందికి పొగడ్తలంటే చాలా ఇష్టం. ఎవరైనా మనల్ని పొగిడితే పొంగిపోతాం.

వారిని మిత్రులుగా, శ్రేయోభిలాషులుగా మనం భావిస్తాం. అయితే కొంతమంది మహనీయులకు ఎలాంటి పొగడ్తలు గిట్టేవి కాదట.

రష్యన్‌ రచయిత టోల్ స్టాయ్ పొగడ్తని అపకారిగా భావించి దానిని దగ్గరకు రానిచ్చేవాడు కాడట.

(పుట 8-టోల్ స్టాయ్), మతం-సాహిత్యం-మిక్కిలినేని అక్కయ్య-అరవింద పబ్లిషర్స్‌-విజయవాడ) వినోబాభావే తనకొచ్చిన ఉత్తరాలనన్నింటినీ జాగ్రత్తగా పెడుతుంటేవారు.

ఒకసారి ఆయన ఒక ఉత్తరాన్ని చదివి దాన్ని వెంటనే చింపిపారేశారు. అప్పుడు శ్రీకమలనయన్‌ బజాజ్‌ ఆయన పక్కనే ఉన్నారు. జరిగింది చూసి ఆయన ఆశ్చర్యచకితులైనారు.

కుతూహలాన్ని ఆయన ఆపుకోలేక చింపిన ఉత్తరం ముక్కలను ఒక క్రమపద్ధతిలో అమర్చి విషయాన్ని చదివి ఆశ్చర్యపోయారు.

మీకు సమానమైన ఉన్నత మనస్కుడిని మరొకరిని నేనింతవరకు చూసి ఉండలేదు అంటూ ఇంకా ఇలాంటి పొగడ్తలే ఉన్నాయి ఆ లేఖలో.

దాన్ని రాసింది ఎవరో ఒక సాధారణ వ్యక్తి కాదు. సాక్షాత్తూ జాతిపిత గాంధీజియే మీరు ఈ ఉత్తరాన్ని ఎందుకు చింపేసారు? అని ప్రశ్నించాడు బజాజ్‌. వినోబాజీ చిరునవ్ఞ్వతో ‘ఈ ఉత్తరం నాకు ఎంత మాత్రం ఉపయోగం లేనిది.

బాపూజీ ఎంతో పెద్ద మనసుతో నాలోని సుగుణాలను చూశారు. కానీ నాలో ఎన్నో లోపాలున్నాయి. ఆయనకేం తెలుసు? ఆత్మస్తుతి నాకు బొత్తిగా గిట్టదు.

ఎవరైనా నాలోపాలను ఎత్తి చూపారనుకో వారెప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటాను అన్నాడు.

(శ్రీరామకృష్ణప్రభ జూన్‌ 2015 పుట 37) ఇక గాంధీజీ ‘నన్ను పొగిడే మిత్రుల నుంచి కంటే తెగిడే మిత్రుల నుంచి ఎక్కువ లాభపడ్డానని అంటాడు.

నన్ను తిట్టేవాళ్లకన్న మెచ్చుకునే వాళ్లు మాటలు వింటే నాకు ఎక్కువ ఏడుపు వస్తుంది అని అనేవారు. (పుట 269-మ్యూజింగ్స్‌ చలం దూషించే వారినే మిత్రులుగా భావించాలి.

వారి మధ్యన ఉంటేనే అని రమణమహర్షి అంటారు (పుట 49) రమణాశ్రమ లేఖలు.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/