ఉత్కృష్టమైన మానవ జన్మ

ఆధ్యాత్మిక చింతన

Lord Hanuma
Lord Hanuma

మానవ జన్మ ఉత్కృష్టమైనదని, ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మానవజన్మ పొందడం దుర్లభం అని మహాత్ములు అంటారు.

పశుపక్ష్యాదులకు లేని విచక్షణా జ్ఞానం, బుద్ధి, మనిషికి భగవంతుడు ప్రసాదించాడని చాటి చెపుతారు.

అసలు భగవంతుని పొందడటానికి ఆయనను చేరుకోవడానికి మానవజన్మ ద్వారానే సాధ్యమని ఎక్కువ మంది నమ్మకం కూడా. కానీ భగవంతుని సృష్టిలో ఏ ఒక్క జీవి అల్పమైనది కాదు. అలాగే ఏ జీవి ఉన్నతమైనది కాదు.

ఆ జీవి చేసుకున్న పూర్వజన్మల కర్మను బట్టి అలాగే ఆ జీవి ప్రస్తుత జన్మలో చేసే కర్మలను బట్టి ఆయా జీవ్ఞల జీవితానికి సార్ధకత ధన్యత సంభవిస్తాయి.

నిజానికి 84 లక్షల యోనులలో జన్మ పొందిన ప్రతి జీవి. జీవితానికి ఒక అర్ధం పరమార్ధం ఉన్నాయి.

భగవంతుడు వివిధ జీవ్ఞలలో తానే ఉన్నానని అనేక సందర్భాలలో చాటి చెప్పాడు. అటువంటప్పుడు ఒక జీవి ఉన్నతమైనది.

ఒక జీవి అధమమైనది అన్న ప్రశ్నే ఉదయించకూడదు గదా! గీతోపదేశం చేస్తూ భగవంతుడు అర్జునుడితో ఈ విధంగా అన్నాడు.

అన్ని రూపాలలో నేను సంచరిస్తూ ఉంటానని భగవంతుని ఉవాచ. వినాయకుని వాహనమైన మూషికము, విష్ణుమూర్తిని తన భుజస్కంధాలపై మోసేటి గరుత్మంతుడు, ఈశ్వరుని ఆనందంగా ఊరేగించే నందీశ్వరుడు, శనీశ్వరునకు వాహనమైన వాయసము మొదలగు వాటిని అల్పజీవ్ఞలు అనగలమా?

ఒక కారడవిలో ఆలనాపాలనా లేక పడి ఉన్న శివలింగానికి తమ తమ భక్తి శ్రద్ధ, శక్తికొలది పూజించి ఈశ్వరుడు పెట్టిన పరీక్షలో గెలుపొంది సాయుజ్యము పొందిన శ్రీకాళము, హస్తి ఎంతటి ధన్యజీవ్ఞలు. అవి మానవ్ఞలు కావే.

వానరోత్తముడైన ఆంజనేయుడి శౌర్య పరాక్రమాలకు భయకంపితులకు అభయమిచ్చే దయకు తన స్వామి అయిన శ్రీరామచంద్రమూర్తి యందుగల అచంచలమైన వినయవిధేయతలకు భక్తి విశ్వాసాలకు సాటికలదా.

మరి హనుమంతుడు మానవ్ఞడు కాదే. రావణునితో యుద్ధకాలంలో శ్రీరాముడు సేతువ్ఞ నిర్మించినపుడు తన భక్తికి గుర్తుగా ఇసుకలో పొర్లి, ఆ ఇసుకను సేతువ్ఞపై జల్ల సాగిన ఉడుతా భక్తికి విలువ కట్టగలమా?

శ్రీరాముడు అపారమైన ప్రేమతో ఉడుత వీపు నిమిరి ఆయన హస్త ముద్రికలు దాని వీపు పైన ఉంచిన సంగతి లోకవిధితమే గదా!

అంతకు ముందు కాలంలో రావణుడు సీతను అపహరించుకుపోయే వేళ అతనిని అడ్డగించి అతనితో పోరు సలిపినది జటాయువ్ఞ. జటాయువ్ఞ ఒక పక్షి అయినా అంతటి మహాకార్యం చేసింది.

అలాగేనే రావణుడు చేసిన దుష్కార్యాన్ని అతడు సీతను తీసుకెళ్లిన దిక్కును చెప్పినది ఆ పక్షియే కదా! పురాణాలలో అనేక ఘోరమైన తపస్సులు చేసి భగవంతుని మెప్పించి ఆయన పొందిన వారంతా మానవ్ఞలే కాదు గదా.

నిజానికి భగవంతునిపై అవ్యాజమైన ప్రేమ నిష్కపటమైన భక్తి, ఆరాధన పశుపక్ష్యాదులకు ఉన్నట్లు మానవ్ఞలకు ఉండదేమో.

అందుకే సదా భగంతుడు వాటిని కాపాడుతూ ఉంటాడు. భగవంతుని ఆరాధించటానికి పొందడానికి మనస్సు, తపన , ప్రయత్నం ముఖ్యం కానీ జన్మ ముఖ్యం కాదు. అది మానవ్ఞజన్మకావచ్చు. మరేదైనా జన్మ కావచ్చు.

  • ఉలాపు బాలకేశవులు

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com