వెతలే వెలుగులు

The Sun Rises

”నిందాస్తుతులు నిజజీవితానికి నిత్యాభరణాలు. నింద తెలియని బ్రతుకులో అందం లేదు. కీర్తి గల వానికి స్తుతులు చుట్టాలే. నిజస్తుతి వాస్తవానికి వీనులకు విందే. కాని అసత్యపు పొగడ్తలు విందులుగా గోచరించినా అవి విషాలే.వంచనకు అలవాటు పడిన వారు ఇతరులలో మంచిని చూడలేరు. మంచి చెడులు మనిషి మనస్సుకు తేలికగా దొరకవ్ఞ. మంచివారిలో కొంత చెడు లేకపోలేదు. చెడ్డవారిలో కొంత మంచి ఉండకపోదు. నీలో మంచిని అందరూ చూడలేరు. మంచివాడే మంచిని చూడగలడు. కొందరు మంచిని గ్రహించలేకపోయినా చెడును మాత్రం గ్రహించరు. మరికొందరు చెడును గ్రహించడమే జీవితధ్యేయంగా పెట్టుకొని ఉంటారు. చెడ్డవారు చెడినవారే గనుక చెడుమాటలు, చెడు చేష్టలకే పరిమితులు. వారికి పెద్ద, చిన్న తారతమ్యము తెలియదు. పరులను బాధించడములో వారికి పరమాన్నం లభించినట్లు ఉంటుంది.
సాధకులు నిందలను చూసి కృంగిపోకూడదు. వందనీయులను కూడా నిందలు వదలవ్ఞ. గొర్రెల మందకు గౌరవమేమిటో తెలియదు.
నీవ్ఞ పెరుగుతున్నావంటే నీతో పాటు, నీ చుట్టూ పెరుగుతూ ఉంటాయి. అది సహజం. వాటి మధ్య నీవ్ఞ చెదిరిపోతేనే అసహజం. నిందలను సవాళ్లుగా స్వీకరించాలి. నిన్ను పెంచేందుకే నిందలు నిలిచి వ్ఞన్నాయి. తన శిష్యుల సహాయంతో బుద్ధుడు ఒక స్త్రీని హత్యచేసినట్లు వదంతులు వ్యాప్తిచేశారు కొందరు నీచులు. చాలామంది వ్యతిరేకులు బుద్ధుని విమర్శించారు. శిష్యుడైన ఆనందుడు బుద్ధుని సమీపించి ”మనం ఈ ఊరు వదలి మరొక ఊరికి వెళ్దాము అన్నాడు.
‘మరి ఆ ఊరిలో కూడా నిందిస్తే ఏం చేద్దాం? అన్నాడు గౌతమబుద్ధుడు.”ఇంకొక ఊరికి వెళ్దాం అన్నాడు ఆనందుడు.
”ఆనందా! అయితే మనం ఉండేందుకు ఈ దేశంలో స్థలం దొరకదు. ఓర్పుతో జీవించు. ఈ నిందలు కాలంలో కరిగిపోతాయి అంటాడు బుద్ధుడు. ఈ ప్రపంచంలో దోషము లేనివారు ఉండరు. మనదోషాలు మనకు గోచరించవ్ఞ. అందుచేత అవి ఆంతర్యంలో పటిష్టంగా స్థిరపడి ఉంటాయి. ఇతరులు మనల్ని దూషించినపుడు మనలోని దోషాలేవో మనకు తెలిసి వస్తయి. వెంటనే కాలికి అంటిన బురదను కడిగినట్లు దోషాలను నివృత్తి చేసుకోవచ్చు. ఒకవేళ నిర్దోషులైన మనల్ని ఇతరులు దూషిస్తే ఎలా? అనే శంక నీకు రావచ్చు. అప్పుడూ మంచిదే. లేని దోషాలను ఇతరులు మనకు చూపడం వల్ల మున్ముందు అవి రాకుండా మనం జాగ్రత్తపడే అవకాశం వారు కల్పించారు.

కనుక వారు అభినందనీయులే. క్షమను వృద్ధి చేసేందుకు క్షామం వస్తుంది. ఆపదలు అభివృద్ధికి పునాదులు. బాధలే బ్రతుకును తీర్చిదిద్దే బోధలు. ఈనాటి వెతలే ఓనాటి వెలుగుల తోరణాలు. ప్రతికూల పరిస్థితులను కూడా అవగాహనతో అనుకూలంగా మార్చుకొనువారే ధన్యజీవ్ఞలు. తాత్త్వికుడైన ఒక మహాశయు ని భార్య గయ్యాళి. భర్తను తిట్టడము ఆమె నిత్యకృత్యాలలో ముఖ్య కార్యము. ఒకరోజు ఆమెకు ఆరోగ్యం బాగలేక భర్తను తిట్టడమనే కార్యక్ర మాన్ని సాగించలేకపోయింది. స్నేహితుల మధ్య ఉన్న ఆ మహాశయుడు విషాదముగా గోచరిస్తున్నం దుకు కారణమేమిటని స్నేహితులు ప్రశ్నించారు. అనారోగ్యం కారణంగా తనను భార్య తిట్టలేదని, తన బాధకు కారణమది యేనని అతడు చెబుతాడు.
‘దానిని సంతోషించక బాధపడతావెందు కు?అన్నారు స్నేహితులు.”ఆమె తిడుతూ ఉంటే నేను సహనాన్ని వృద్ధి చేసుకొనే అవకాశం కలుగుతూ ఉండేది. ఈరోజు నాకు ఆ భాగ్యం కలుగలేదు. అందుకే దుఃఖిస్తున్నాను అంటాడు తాత్త్వికుడు.

ఇవే బతుకు లో ప్రతిబింబించదగిన నిత్యసత్యాలు. బాహ్మపరిస్థితులు ప్రతికూలమైనా వాటిని ఆతంర్యంలో అనుకూలంగా మలచుకోగలిగినవారే బ్రతుకు విలువ తెలిసినవారు. వారే ప్రపంచంలో బలవంతులు. మన అభివృద్ధికి ప్రతికూ లాలు అవసరమని నా అభిప్రాయం కాదు. ప్రతికూలాలను అవరోధాలుగా భావించక అనుకూలాలుగా మార్చుకోవాలి అనేదే అభిమంతం. ”పరిస్థితులు బలహీనుల్ని పరిపాలిస్తాయి. బలవంతులకు పనిముట్లుగా సహకరిస్తాయి అంటాడు ఆలివర్‌ గోల్డ్‌ స్మిత్‌ అనడం- వినడం-విస్మరించడం గాకుండా బ్రతుకులో వాటిని కనడం మన ప్రధాన కర్తవ్యం కావాలి. ఇదే సాధన, రోదనను, వేదనను రూపుమాపే ఆరాధన.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/