భయంలేదు.. దేవుడున్నాడు

‘తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు’ (దానియేలు 11:32).

Meri Maata Manduram, Gundala

మనదేవుడు యూదాగోత్రపు సింహం. అద్వితీయ సత్యదేవుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే బిరుదులను ధరించినవాడు.

ఇలాంటి దేవుడిని కలిగివున్నమనం నిజంగా అన్నిసమయాల్లో బలవంతులంగా ఉన్నామా? కొన్నిసార్లు బలమైనవారిగా, మరికొన్నిసార్లు బలహీనులుగా, అనేకసార్లు భయపడేవారంగా ఉంటున్నాం అనేది సత్యదూరం కాదు. ఎందుకంటే మనల్ని భయపెట్టే సన్నివేశాలు నిత్యం జరుగుతూనే వ్ఞంటాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి ‘కరోనా వైరస్‌. చైనాలో ఆరంభమైన ఈ వైరస్‌దాటికి ఇప్పటికే వేలాదిమంది మరణించారు. లక్షలాదిమందిల వైరస్‌లక్షణాలతో బాధపడుతున్నారు. సహజంగానే మనలో కూడా భయం ఆవరించింది.

అయినా భయపడాల్సిన పనిలేదు. కీర్తన 91:10లో ‘నీకు అపాయమేమియు రాదు. ఏ తెగులును నీ గుడారమును సవిూపించదు అనే వాక్యం నిజంగా మనకు దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానం. అలాగని ఈ వాగ్దానం అందరిలో వర్తించదు. మనం దేవ్ఞనియందు భయభక్తులతో జీవిస్తూ, ఆయన ఆజ్ఞల్ని పాటించినప్పుడు తప్పకుండా దే వుడు మనల్ని కాపాడుతాడు అనడంలో సందేహం లేదు.

అసలు దేవుడు ఎందుకని ఈ తెగుల్ని అనుమతించాడు? మనం దేవ్ఞడిని వెంబడించడంలో వెనుకబడి ఉన్నాం. ప్రార్థనకు సరైన సమయాన్ని ఇవ్వకుండా, మన ప్రవర్తనలో దేవుడిని మెప్పించడంలో కూడా తప్పిపోతున్నామో! ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిది.

పాపం వలన వచ్చే జీతం మరణం అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప వల్ల మనకు నిత్యజీవాన్ని ప్రభువు దాచివ్ఞంచాడు. అంతేకాదు హెబ్రీ 8:12లో ‘నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొనని ప్రభువులవిచ్చుచున్నాడు.

ఈ మాటను జ్ఞాపకం చేసుకుని, మనం ఏయేవిషయాల్లో తప్పిపోయామో లేక పాపం చేస్తూ దేవు డిని, పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నామో ఒకసారి పరిశీలించుకుని, సరిచేసుకుని, ప్రభు
వు పాదసన్నిధిలో క్షమాపణ వేడుకుని, తిరిగి ఆయన అడుగుజాడల్లో పయనిద్దాం.

మనం జీవించినా, మరణించినా ప్రభువు కోసమే అనేవిధంగా మన ఆధ్యాత్మిక జీవనపోరాటాన్ని సాగిద్దాం.

  • పి. వాణీపుష్ప

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/