చింతించాల్సిన పనిలేదు..

JESUS STORIES
JESUS STORIES

‘కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా పరిశుద్ధ నామమునుబట్టి రోషము కలిగినవాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించెదను..ఇశ్రాయేలీయులవిూద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాణ్ముఖుడనై యుండను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు (యెహె 39:25-29). దేవ్ఞడి నామం రోషం గలది. ఆయన తన ఘనమైన నామం బట్టి మనల్ని పాపం నుంచి, బలహీనతల నుంచి బయటికి తీసుకుని వస్తాడు. తనను వెంబడించే కృపను అనుగ్రహిస్తాడు.

చాలాకాలంగా మన ప్రార్థనకు సమాధానం రాకుండా ఉండవచ్చు. దేవ్ఞడు మనవిషయంలో మౌనంగా ఉన్నాడనుకుంటాం. కానీ ఆయన నిరంతరం మనతో మాట్లాడుతూనే వ్ఞంటాడు. ఆయన స్వరాన్ని మనం గ్రహించాలి. సరే మనం ఎప్పుడూ బలహీనులమే. ఏది చేయాలనుకుంటామో దాన్ని చేయలేం. ఏది చేయకూడదని అనుకుంటామో దాన్నే చేస్తుంటాం. ఇలాగని ఇదే మన బలహీనత అని సరిపెట్టుకుని, ఆ బురదలోనే జీవించాల్సిన అవసరం లేదు. దేవ్ఞడు లోకాన్ని, సాతాను జయించాడు. ఆయన పునరుత్థాన శక్తి వల్ల మనం దేనినైనా జయించగలం. దేవ్ఞడిని వెంబడించాలని, ఆయన కోసం జీవించాలని, ఆయనలో వృద్ధి చెందాలనే తపన, ఆసక్తి ఉంటే దేవ్ఞడు తప్పనిసరిగా సాయం చేస్తాడు. దేవ్ఞడిని వెంబడిస్తూ, విశ్వాసంలో జీవిస్తూ ప్రస్తుతం వెనుకంజలో ఉంటే, లేదా పూర్తిగా దేవ్ఞడిలో లేకుండా లోకంలో పడిపోయి వ్ఞంటే చింతించా ల్సిన అవసరం లేదు. తిరిగి ఆయనవైపు మనసు ను తిప్పితే ఆయన మనల్ని సమకూరుస్తాడు. అంతేకాదు పైన చెప్పినట్లుగా తన రోషంగల నామం బట్టి మనపై తన ఆత్మను కుమ్మరిస్తాడు. పాపమనే చెరలో నుండి దేవ్ఞడు బయటికి రప్పిస్తాడు. తనను వెంబడించే కృపను అనుగ్రహి స్తాడు. కాబట్టి ఇకనైనా దేవ్ఞడిని ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తా అదే దేవ్ఞడు మననుంచి కోరుతున్నాడు.

  • పి.వాణీపుష్ప