సంఘంలో అందరూ సమానమే..

JESUS
JESUS

సంఘంలో అందరూ సమానమే..

నేను సిటీబస్సులో ప్రయాణిస్తున్నాను. నాపక్కన ఒక ముస్లిం యువతి కూర్చుంది. ఒక బస్టాప్‌ నుంచి మరో ముస్లిం మహిళ ఎక్కింది. ఆమెను చూడగానే నాపక్కన ఉన్న యువతి ఆ మహిళను పిలిచి, ‘ఆంటి కాస్త సర్దుకోరా నన్ను అంటూ ఆమెను తన పక్కన కూర్చోపెట్టుకుంది. సరే నేను కూడా సర్దుకున్నాను.

ఆమె ఎవరో ఈ యువతికి తెలియదు. తరువాతి బస్టాప్‌లో ఆ మహిళ దిగిపోయింది. మరో మహిళ ఎక్కింది. ఆమె వద్ద చంటిపిల్లాడు ఉన్నాడు. కానీ ఈ యువతికి మాత్రం ఆమెకు కాస్త చోటు ఇద్దామనే ఆలోచన రాలేదు. నేను చూసి, ‘కాస్త సర్దుకుని, ఆమెను కూర్చోనివ్వండి అన్నాను. తన వర్గానికి చెందిన మహిళ రాగానే ముస్లిం యువతి చోటు ఇచ్చింది. కానీ ఒక చంటిపిల్లాడితో తన పక్కనే నిలబడ్డా, సర్దుకుని, కూర్చోని ఆమెకు సీటు ఇద్దామనే ఆలోచన రాలేదు. ఎందుకని? మన మతానికి చెందినవారని, మన ప్రాంతానికి చెందిన వారనే భావన వల్ల. ప్రతివారికి మతాభిమానం, కులాభిమానం, ప్రాంతీయాభిమానం,

భాషాభిమానం తప్పనిసరిగా ఉంటాయి. ‘మనమారే అనే భావన మనసు అగాధంలో ఒక అభిమానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇది తప్పు కాదు. కానీ దీనితోపాటు కాస్త మానవత్వం, మానవీయత అనేది కూడా ఉండాలి కదా! యేసుప్రభువు అందరికీ వర్షాన్ని ఇస్తున్నాడు. అందరికీ గాలిని, నీటిని, వెలుగును, ప్రకృతి సంపదను అనుభవించే స్వేచ్ఛను ఇచ్చాడు. అయితే తనను వెంబడించేవారికి దేవ్ఞడు మరిన్ని ప్రత్యేక వనరులను సమకూరుస్తాడు. ‘నా తండ్రి చేత ఆశీర్వదింపబడినవారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని విూకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, విూరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు-ప్రభువా, యెప్పుడు నీవ్ఞ ఆకలిగొనయుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవ్ఞ దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుటయైనను,

చెరసాలలో ఉండుటయైనను చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు-మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి విూరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా విూతో చెప్పుచున్నానని వారితో అనును (మత్త 25:34-40). అల్పులైనవారికి, నిస్సహాయులకు, మన సాయం అవసరమైన వారికి సాయం చేస్తే, అది దేవ్ఞడికి సాయం చేసినట్లే అవ్ఞతుంది.

కాబట్టి దానధర్మాలు అనేవి పేరుప్రఖ్యాతలను పొందేందుకు కాదు. లేదా మనకెంతో మంచి గుణం ఉందని ఇతరులు గుర్తించి, మనల్ని గొప్పగా భావించాలని కాదు. కుడిచేత్తో సాయం చేస్తే, అది ఎడమచేతికి కూడా తెలియకుండా ఉండేంత రహస్యంగా మన సాయం ఉండాలి. సంఘాల్లో మేం అంత డబ్బు ఇచ్చాం, పేదలకు సాయం చేస్తున్నాం, చర్చిలలో ఫర్నిచర్‌ను కొనిచ్చాం అంటూ గొప్పగా చెప్పుకునేవారున్నారు. కొందరైతే వాటిపై తమ పేర్లను కూడా రాసి ఇస్తారు. దేవుడు ఏమో రహస్యంగా చేయమంటే మనం మాత్రం అందరూ గుర్తించాలని చేస్తాం. ఇది దేవ్ఞడి ఆజ్ఞను తృణీకరించమే అవ్ఞతుంది. దేవ్ఞడి మెప్పుకోసం మన దానధర్మాలు ఉండాలే తప్ప ఇతరుల మెప్పుకోసం కాదు. పేదలు సంఘానికి వస్తే వారిని ఎవరూ గుర్తించరు. వారిని ఒక పలకరింపుతో వదిలేస్తారు. ధనవంతులు, గొప్పహోదాలో ఉన్నవారు వస్తే, వారితో మాట్లాడటమే తమ స్టేటస్‌గా భావించేవారున్నారు. యాకోబు పత్రికలోని సత్యాలను మనం విస్మరిస్తున్నాం. పదవ్ఞలు, హోదాలు, డబ్బు ఏవి ఉన్నా అవన్నీ సంఘం బయటే తేడాలు. సంఘంలో అందరూ సమానమే. దేవ్ఞడి సన్నిధిలో బేధమేమీ లేదు. ఇలాంటి భావనతో దేవ్ఞడిని సేవిస్తూ, మానవీయత భావంతో ముందుకు పయనిద్దాం.

– పి.వాణీపుష్ప