పాపాలను పుణ్యాలుగా మార్చివేస్తాడు

Masjid

సాధారణంగా మనుషులు చిన్న, పెద్ద పొరపాట్లు, తప్పులు చేస్తుంటారు. అయితే వారి పాపాల పట్ల పశ్చాత్తాప హృదయంతో, పాప మన్నింపు కోసం దేవుణ్ణి వేడుకుంటే ఆయన తప్పక క్షమిస్తాడు. దివ్యఖుర్‌ఆన్‌ 20వ అధ్యాయం 82వ పవిత్రవాక్యంలో ”పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసి, ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్నవారిని నేను అమితంగా క్షమిస్తానుఅని దైవం అంటున్నాడు. ఎవరైనా సరే దేవ్ఞని క్షమాభిక్షకు నోచుకోవా లంటే నాలుగు అర్హతలు సంపాదించాలి.

  1. అవిశ్వాస వైఖరి నుంచి, బహుదైవారాధన నుంచి, పాపకార్యాల నుంచి పశ్చాత్తాపం చెందాలి.
  2. ఒక్కడైన అల్లాహ్‌ను విశ్వసించాలి.
  3. సదాచరణ చేయాలి.
  4. జీవితాంతం రుజుమార్గంపై పయనించాలి.

దైవ విధేయునిగానే తనువుచాలించాలి. రుజుమార్గంలో తడబాటు పనికిరాదు. ఒకవేళ అదేగనక జరిగితే దేవ్ఞని క్షమాభిక్షకు బదులు శిక్ష లభిస్తుంది.
ఇంకొక చోట”పాపకార్యాల తర్వాత ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్‌ పుణ్యాలుగా మార్చివేస్తాడు నిష్కల్మషమైన మనస్సుతో పశ్చాత్తాపం చెందితే ఆ పాపం కూడా క్షమించబడుతుంది. ఒకడు వందమందిని హత్యచేసిన తర్వాత మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందగా అల్లాహ్‌ అతన్ని కూడా క్షమించి వదలిపెట్టాడని హదీసులో ఉంది. (సహీహ్‌ ముస్లిం, తౌబా ప్రకరణం) దీనిభావం ఏమిటంటే దేవ్ఞడు అతని జీవితంలో పరివర్తనను తీసుకువస్తాడు. ఇస్లాంకు పూర్వం అతను పాపాలు చేసేవాడు. ఇప్పుడతడు పుణ్యకార్యాలు చేస్తాడు. పూర్వం బహుదైవారాధన చేసేవాడు. ఇప్పుడు ఏకదైవారాధన చేస్తాడు. పూర్వం అవిశ్వాసులతో కలిసి ముస్లింలను పీడించేవాడు. ఇప్పుడు ముస్లిముల తరుఫున అవిశ్వాసులను ప్రతిఘటిస్తాడు. మరో అర్థం ఏమిటంటే అల్లాహ్‌ అతని పాపాలను పుణ్యాలుగా మార్చివేస్తాడు. హదీసు ద్వారా కూడా సమర్థన లభిస్తోంది.

దైవప్రవక్త (స) ఇలా చెప్పారు:
‘అందరికన్నా చివర్లో స్వర్గంలో ప్రవేశించేదెవరో, అందరికన్నా ఆఖరిలో నరకం నుంచి తీయబడే వాడెవడో నాకు తెలుసు. ప్రళయదినాన అతని చిన్నచిన్న పాపాలు సమర్పించబడతాయి. అతని పెద్ద పాపాలు ప్రక్కన పెట్టబడతాయి. నువ్ఞ్వ ఫలానా రోజుల్లో ఫలానా పాపకార్యాలు చేశావా? అని అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అతడు ”అవ్ఞనని ఒప్పుకుంటాడు. ఎందుకంటే వాటిని త్రోసి పుచ్చే శక్తి ఉండదు అతనికి. అదీగాక, తన పెద్దపాపాలు కూడా హాజరు పరుచబడవచ్చన్న భయం అతన్ని పీడిస్తూ ఉంటుంది. అంతలోనే, పో. నువ్ఞ్వ చేసిన ఒక్కోపాపానికి బదులుగా ఒక్కోపుణ్యం ఇవ్వబడిందిఅని అతనితో అనబడుతుంది. దేవ్ఞని ఈ ఔదార్యాన్ని చూసి, ”నేను చేసిన దురాగతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి కూడా నాకిక్కడ కానరాడం లేదని అంటాడు.
హజ్రత్‌ అబూహురైనా (రజి) కథనం- ”ఒకరోజు నేను నబవీ మస్జిద్‌లో రాత్రి నమాజు (ఇషా (నమాజు) తర్వాత ఇంటికిపోగా ఒకామె తలుపుతట్టింది. విషయమేమని అడగ్గా ఆమె ‘నా వల్ల వ్యభిచారం జరిగింది. అక్రమ గర్భం దాల్చాను. పిల్లవాడు పుడ్తె అతన్ని చంపేశాను. మరిప్పుడు నా పాప క్షమాపణకు ఏదైనా దారి ఉందంటారా?అనడిగింది. నేను ఏమాత్రం లేదని చెప్పాను. నామాటలు విని ఆమె రోదిస్తూ వెళ్ళిపోయింది. మరునాడు దైవ ప్రవక్త (స)కు విషయం వివరించాను. దానికాయన ”నీవ్ఞ చాలా తప్పుడు సమాధానమిచ్చావ్ఞ. నీవీ సూక్తి చదువలేదా అని ఖుర్‌ఆన్‌ సూక్తి విన్పించారు. మరల ఆమెను వెతికి ఈ శుభవార్త చెప్పాను. ఇది విని వెంటనే ఆమె దేవ్ఞనికి సాష్టాంగపడి దేవ్ఞనికి కృతజ్ఞత తెలిపింది. పశ్చాత్తాపంతో తన దగ్గరున్న ఒక బానిసకు స్వేచ్ఛనిచ్చింది.

  • షేఖ్‌ అబ్దుల్‌ హఖ్‌

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/