గురువులు.. నాడు, నేడు

ఆధ్యాత్మిక చింతన

Rama krishna paramahamsa
Rama krishna paramahamsa

నేటి గురువులను గూర్చి ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చు. నాటి గురువులను గూర్చి గ్రంథాలను అధ్యయనం చేసి గ్రహించవచ్చు.

ఈనాటి గురువులు గురుభక్తిని గూర్చి, శుశ్రూష (సేవలను) గేర్చి దాన ధర్మాల విశిష్టతను గూర్చి ధారాళంగా వినిపిస్తారు వారి ప్రవచనాలా ద్వారా, అశుగ్రహ భాష ణల ద్వారా, ఇంకేముంది, ఎందరెందరో ఆకర్షింపబడతారు. వారికి శిష్యులవుతారు. భక్తులౌతారు సేవకులవుతారు, దాతలై తన్యులవుతారు.

భూమిని నివ్గఆరు ఆశ్రమ నిర్మాణానికి, గోశా లలకు, వంటశాలలకు, భోజన శాలలకు ఎకరాల స్థలాన్ని దాన మిచ్చి, శిలాఫల కాలపై వారి పేర్లను చెక్కించుకొని, పేపర్లలో ప్రకటించుకొని సంతృప్తి చెందుతారు. మరికొందరు ధనికులేమో వజ్ర కిరీటాలను, వెండి బంగారు ఆభరణాను పొంది సంతుష్టులవుతారు.

ఇక ధనం లేనివాళ్లు, అంతోఇంతో ఉన్నవాళ్లు, ఉన్నది కాస్తా ఆశ్రమానికి రాసిచ్చి శేష జీవితాన్ని హాయిగా ఆశ్రమంలో చేతనైన సేవలు చేస్తూ గడపాలని ఆశిస్తారు. పాదమార్థిక చింతనతో ప్రాణం విడువాలని కోరు కొంటారు.

లౌకిక విషయాలకు స్వస్తి పలకాలని, ఆధ్యాత్మిక పథంలో పురోగమించాలని కలలు కంటారు. అయతే అలాంటి వారికి నేటి గురవులు రకరకాల ఆశ్రమ నిర్వహణా బాధ్యతలు అప్పగించి సేవకు మించినది ఏదీ లేదని బోధిస్తారు.

ఇక గురువుమాటే వేదంకదా! గురువే బ్రహ్మ, విష్ణువు, శివుడు, గురువే పరబ్రహ్మ- ఇక ఆయన ఎలాంటి సేవలు చేయమంటే వాటిని చచ్చేవరకు ఈ శిష్యులు చేస్తూ పోతూ ఉండాల్సిందే. అవి ఆశ్రమ ప్రాంతాన్ని శుభ్రం చేయటం కావచ్చు.

ఎంగిలి ఇస్తర్లను ఎత్తివేయడం కావచ్చు. మూత్ర శాలలను కడగటం కావచ్చు. క్రయ విక్రయాలను చూడటం కావచ్చు. మరొకటి ఏదైనా కావచ్చు. వీటిలో అంతా లౌకికమే తప్ప ఆధ్యాత్మకం ఏముందో, ఎక్కడుందో, ఎట్లుందో ఈ శిష్యులు అడగరాదు, ఆ గురువులు చెప్పరు.

కేవలం ఇలాంటి పనులు (సేవలు అని ఘనంగా పేర్కొంటూ ఉంటాం) ఆధ్యాత్మక ఔన్నత్యాన్ని ఇవ్వగలిగితే లక్షంగా ఇంట్లోనే ఉంటూ వాటిని చేయవచ్చు. ఇక ఆశ్రమంలో ఉండే ప్రయోజనమేమి?

అక్కడ మన ఇంటి గోల మాత్రమే, ఇక్కడ? అక్కడ మన ఆదాయ, వ్యయాల లెక్కనే, మరి ఇక్కడ? ఇతరులకు చేసే సేవవల్ల అహంకారం నశిస్తుందని, స్వార్థం తగ్గుతుందని బోధించటం, భావించటం మంచిదే.

కానీ జీవిత మంతా, ఇరవై నాలుగు గంటలూ 24/7/360 ఆలా ఎటిఎం గదులు వద్ద రాసినట్లు) సేవల్లోనే మునిగి తేలుతూ, అప్పుడ ప్పుడూ అహంకారాన్ని ప్రదర్శిస్తూ గడిపితే ఎలా?

లేని భయాన్ని నటిస్తూ జీవిస్తే ఎలా? ఆధ్యాత్మిక అభివృద్ధి సాధ్య మా? సేవలను గూర్చి పరోప కారాన్ని గూర్తి శ్రీరామకృష్ణ పరమహంస ది హిందూ పార్ట్‌రోట్‌ ప్రతికాధిపతితో అనిన మాటను గమనిద్దాం.

కొందరుకు భోజనం పెట్టుట, రోగులకు చికిత్స చేయుట, రోడ్లు వేయించుట బావులు త్రివ్వించుట- ఇంతేకదా లోకోపకార మనగా నీ అభిప్రాయము? ఇవి మంచి పనులే ఎవరును కాదనరు కాని ఈ మహావిశ్వమంతో పోల్చి చూచినచో, ఇవి ఏ పాటివి? క్షామదేవత నోటి నుండి ఎందరను నీవు రక్షింపగలవు?

ప్రపంచ యోగక్షేమమాలను కనుగొన గలవాడు పరమేశ్వరుడు ఒక్కడే. మనావుడు మొదట తన్ను ఉద్ధరించు కొనుటకూ ఈశ్వర సాక్షాత్కా రమునొంది, ఆయన యొద్ద నుండి ఇతరుల కు మేలు చేయుశక్తిని, అధికారమును పొందవలయును .

అహంకారమును పూర్తి విడచిపెట్టిన వాడుగాని లోకహితము చేయుటకై ఆనందమయమగు జగద్శీరి వలన అధికారమనొందజాలడు. (పుటలు 361.. 352.. శ్రీరామ కృష్ణ జీవిత చరిత్ర )

నేటి శిష్యులకు, వారి గురువులకు కూడా ఉపయో గపడే బోధ కావలసినంత ఉంది శ్రీరామకృష్ణుని ఈ మాటల్లో. ఇక ఆనా టి గురువులు ఎలా ఉండేవారో చరిత్రపుటలను తిష్టి చూద్దాం.

సత్యాన్వే షణలో బయలుదేరిన సిద్ధార్థుడు ఆలారకాలాముడనే విశిష్ట సన్యాసిని ఆశ్రయించాడు. తనకు తెలిసిన సంఖ్య సిద్ధాంత సూత్రాలను, ధ్యాన మార్గాన్ని సిద్ధార్థునికి బోధించి ఆలారకాలాముడు ఇలా అన్నాడు. (తనతో పాటు సమస్థాయిలో కూర్చుండబెట్టుకొని గౌరవించిన పిదప) సంతోషం మిత్రమా!

నేను దర్శించిన సత్యా న్నే మీరూ దర్శించారు. నాకు తెలిసిందే మీకు తెలుసు. నేనెలాగో మీరూ అలాగే రండి, మనమిద్దరం సన్యాసము సంతోషాన్ని నెలకొల్పుదాం.. (పుట 28.. బుద్ధదర్శనం- ఆంగ్లమూలం-నారద మహాదేవ.. అనువాదం అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి )

కానీ తాను చేరుకొన్న స్థితి సిద్ధార్థునిక సంతృప్తి నియ్య లేదు.

ఆ స్థితిలో సన్యాసుల సంఘాన్ని స్థాపించి ఇతరులను చూపించటం ఒక గుడ్డివాడిని మరొక గుడ్డివాడు నడిపించటంలాగే కనపడింది. ఆయనకు అలాకా కాలముని మాటలను వినియంగా తిరస్క రించి , సెలవు తీసుకొని వెళ్లిపోయాడు.

ఆ తర్వాత సిద్ధార్థుడు ఉద్ధక రామపుత్రడనే గురువును ఆశ్రయించాడు. మానసిక ఏకాగ్రత, శ్రద్ధతో ఆయన నుంచి నేర్చుకోవలసినదంతా నేర్చుకొన్నాడు. ఉద్ధక రామపుత్రుడు అతనితో ఇలా అన్నాడు. ‘మిత్రమా! మాకు మహదానందంగా ఉంది.

ఈ రామునికి తెలిసిన తత్వమంతా మీకు తెలుసు మీకు తెలిసిన తత్వమే ఈ రామునికి తెలుసు ఈ రాముడేమిటో మీరూ అదే. ఈ యతి సంఘానికి మీరు నాకయకత్వం వహించండి కానీ సిద్ధార్థునికి తాను పరమ సత్యాన్ని, అంతమసత్యాన్ని తెలుసుకొన్న,చేరుకొన్న భావన కలుగులేదు.

ఆ దశలో తానొక గురువు కావటానికై నాయకుడై ఇతరులను నడపటానికి మనస్సు ఒప్పలేదు. తనను తాను ఇంకా సంస్కరించుకొని పరి పూర్ణుడు కాదలిం చాడు.గురువుకు నమస్కరించి వెళ్లపోయాడు.

అలారకాలామునివలె, ఉద్ధక రామపుత్రుడు కూడా ఆయనను సంతోషంగా సాగనంపాడు. అతని ఆధ్యాత్మిక ప్రగతిని మనసారా కోరుకొంటూ అలా ఉండేంది

నాటి గురువు ల ధోరణి. మరినేడు? ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు శిష్యులు అలా జీవితాతం పడి ఉండవలసిందే .

వారి సేవలను ‘ శుశ్రూషను కొనసా గిస్తూ మీరు చేయవలసినది మరొకటుందనిగానీ, మీరు చేరుకోవలసిన ఉన్నత స్థితి మరొకటుందనిగానీ గురువులు చెప్పరు. శిష్యులు వారికై వారు తెలుసుకోలేదు.

గురువులు తమ ఆశ్రమ నిర్వహణా భారాన్ని శిష్యులపై మోపుతారు. శిష్యులు తమను ఉద్ధరించాల్సి బరువును గురువుల భుజస్కంధాలపై పెట్టి నిశ్చింతగా నిలబడిపోతారు.

ఎక్కడున్నవారు అక్కడే ఉద్దరేదాత్మనాత్మానం అను గీతాశ్లోకాన్ని అతి రమ్యంగా వల్లిస్తారు గానీ దాని భావాన్ని గ్రవాంచరు, ద్యానము, జ్ఞానముల ఆవశ్యకతను గుర్తించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/