శిష్యునికి గురుపూజ

Greatness of Shirdi sai
Greatness of Shirdi sai

తన్ను తాను గురించిన వాడు గురువవుతాడు. తనను తాను ఇంకా గుర్తింలేకున్నవాడు ఇంకా శిష్యునిగానే మిగిలిపోతాడు. అయితే కొందరిలో గురుత్వం ఉన్నా, దానిని గుర్తించలేరు. ఇంకా శిష్యులమని భావించుకుంటుంటారు.
అది గురుపూర్ణిమ దినం. ప్రదేశం షిరిడీ గ్రామం. సాయిబాబాకు గురుపూజ చేయడానికి ఎందరో వచ్చారు. సాయి తన భక్తురాలైన చంద్రాబా§్‌ు బోర్కరును ఖండోబా ఆలయంలో ఉంటున్న ఉపాసనకీ గురుపూజ చేసిరమ్మని పంపారు. ఆమె శారీరక మానసిక దారుఢ్యం ఉన్న మహిళ. సాయిపై ఆమెకు పరిపూర్ణ నమ్మకం ఉన్న భక్తురాలు. ఖండోబా మందిరంలో ఉపాసనీ సాయిబాబా ఆదేశంపై ఉంటున్నాడు. ఉపాసనీని ఏమి చేయవద్దు అని ఆదేశం ఇచ్చి పంపాడు సాయి. ఆధ్యాత్మిక సాధనలను ఏమీ చేయడవద్దన్నారు సాయి ఆయనను. ఆహారం కూడా తీసుకోకుండా ఉండసాగాడు. ఉపాసనీ ఆ మందిరంలో చంద్రాబాయి బోర్కరు, మరియొక సాయి భక్తుడైన బాపుసాహెబ్‌ జోగ్‌తో ఖండోబా మందిరానికి పూజాసామగ్రితో బయలుదేరింది. ఉపాసనీ ఎప్పుడైనా స్నానం చేసేవాడు. ఖండోబా ఆలయం కంపుకొడుతోంది. ఆమె ఇవేమీ లెక్కచేయక ఉపాసనీ పాదాల వద్ద కూర్చున్నది. పూజ మొదలుపెట్టింది. ఉపాసనీ ఆశ్చర్యపోయాడు. ఆమె ఉపాసనీ పాదాలను తాకపోయింది పూజాక్రమంలో. ‘నా పాదాలను తాకవద్దు. వెళ్లిపో అన్నాడు ఉపాసనీ. సాయి తనకు ఇచ్చిన ఆజ్ఞను నిర్వర్తించడానికి వచ్చానని ఆమె చెప్పింది. ‘నాకు అవేమీ వద్దు. నా పాదాలు తాకవద్దు. వెళ్లు అంటూ కసురుకున్నాడు ఉపాసనీ. ‘కసిరినా సరే, కొట్టినా సరే. నేను సాయి ఆజ్ఞను పాటించవలసిందే అని స్పష్టంగా ఆమె చెప్పింది. ఉపాసనీకి కోపం వచ్చి పిడికిలి బిగించాడు. ఆమె కూడా స్వరం పెంచి ‘ఇవి మీ పాదాలే అనుకుంటున్నారా? ఈ పాదాలు శరీరం మీవేనా? మీ పాదాలు, శరీరం మాకే చెందుతాయి. ఈ ప్రపంచానికి చెందుతాయి. మీరేమి చెప్పినా వినను అన్నది ఆమె. ఉపాసనీ అడ్డంకులను పరిగణించకుండా, పూజ ముగించింది. ఆమె పాదాలపై పుష్పాలను ఉంచింది. నైవేద్యంగా పాలను సమర్పించింది. ఉపాసనీ శాంతించలేదు. ఆమె ఊరుకోలేదు. ‘మీరేమీ మాట్లాడవద్దు. మమ్మల్ని చేసేది చేయనీయండి. మీరు వద్దన్నా ఇలా జరగాల్సిందే. ఈ గురుపూర్ణిమనాడు సాయిబాబా నా చేత మీకు గురుపూజ ప్రారంభింపచేశారు. మారు వద్దంటే ఆగుతామా? అన్నది చంద్రాబాయిబోర్కరు.
ఉపాసనీ శ్రీసాయినాథుని ఉన్నత సృజన. ఉపాసనీ దేశాలకు సరియగు మార్గాన్ని నిర్దేశించగల మహాపురుషుడి పేరు తెచ్చుకున్నాడు. ఈ కారణం చేతనే మహాత్మాగాంధీ కూడా ఉపాసనీ మహారాజును సందర్శించారు. దేశభవిత్యం కోసం బాలగంగాధరతిలక్‌ షిరిడీలోని సాయిబాబాను, గజానన్‌మహారాజును కలవటం జరిగింది.
లక్షలాది ప్రజలకు గురువు అయిన ఉపాసనీ, సాయిబాబాను ఏనాడు విస్మరించలేదు.
ఉపాసనీ సాయి మహిమ్నాస్తోత్రం రచించారు. అందులో ‘నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని సాయినిధుని కీర్తిస్తారాయన. ఉపాసనీలోని గురుత్వానఇన సాయి చంద్రబాబోర్కరు ద్వారా తెలియజేశాడు.
– యం.పి.సాయినాథ్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/