భవసాగరాన్ని దాటించు భగవన్నామం

ఆధ్యాత్మిక చింతన

Lord Hanuma
Lord Hanuma

ఆశామోహాలనే రెండు చేతులతో భవసాగరాన్ని దాటడానికి య్రత్నిస్తు అష్టకష్టాల పాలవు తున్నాం. కానీ భగవన్నామమనే నావను ఆశ్రయించిన సులభంగా తరించవచ్చు అనే వివేకం మనలో ఉదయించకపోవటం వల్ల భవసాగరంలో మునిగిపోతున్నాం. ఒక సారి ఓ వ్యక్తి, విభీషణుడి వద్దకు వచ్చి నేను లంకా నగరం నుంచి భారత దేశానికి వెళ్లాలనుకుం టున్నాను.

సముద్రం దాటుటానికి ఏదైనా ఉపాయం చూపండీ అంటే, అప్పుడు విభీషణుడు అతని అంగవస్త్రానికి చివర ఒక వస్తును ముడివేసి, అతనితో ఇప్పుడు నీవు నిశ్చంతగా సము ద్రంమీద నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు.

కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ముడిని విప్పి చూడవద్దు అని హెచ్చరించాడు. ఆ వ్యక్తి విభీషణుడి మాటపై విస్వాసం ఉంచి సముద్రంపై నడక ప్రారంభించాడు.

నేలమీద నడిచినంత సులభంగా నడిచి వెళుతున్నాడు. అలాకొంత దూరం వెళ్లాక అంగవస్త్రం చివర ఏమి కట్టాడో తెలుసుకోవాలనే కుతూహలంతో ముడివిప్పి చేశాడు.

ఆకు మీద ‘శ్రీరామ అని రాసిఉంది. దానిని చూసిన వెంటనే ‘ఓహో!ఇంతేనా! అని అనుకున్నాడు.

అలా అనుకున్న మరుక్షణం అతను నీటిలో మునిగి పోయాడు. భగవన్నామంపై విశ్వాసం ఉంటే సాగరంలో నావపై ప్రయాణించినంత సునాయాసంగా భవసాగరాన్నిదాటవచ్చు అదే పై సారంశం.

భగవన్నామాన్ని భజించమంటూ ‘సర్వదా సర్వభావేన నిశ్చింతైః భగవానేవభజనీయ . ఓ మానవులారా భగవంతుని పట్ల విశ్వాసాన్ని సడలనీయకుండా చింతలన్నీ వీడి ఆయనను భజించండి. అని హితువు పలికారు.

భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగినప్పుడు అనన్య ప్రేమ జనిస్తుంది. అప్పుడు భగవంతని స్మరించకుండా ఒక్క క్షణమైన ఉండలేం.

అలాంటి స్థితి ఎలా అభిస్తుంది. అంటే ‘అఖండ భక్తి ద్వారా అనన్యభక్తి సిద్దిస్తుంది. అని నారదమహర్షి వివరించారు.


భగవన్మామ స్మరణను భంగం కలిగించు వాటిని వదిలి నిరంతరం భగవంతుని స్మరించుట అనన్య భక్తి లక్షణం అలాంటి స్థితి పొందిన ఓ కాకి కథను శ్రీ రామకృష్ణులు ఇలా ఓ సారి శ్రీ రామలక్ష్మణులు పరిపాపనది తీరాన నడుస్తూ వెళుతున్నారు.

అప్పుడు లక్ష్మణుని దృష్టి ఓ కాకిమీద పడింది. ఆ కాకి దాహం తీర్చుకోవటానికి నది దగ్గరకు వెళ్లి నీటిని తాగకుండా తిరిగివస్తుంది. ఆ కాకి మళ్లీ మళ్లీ అలాగే చేస్తుంది. ఆ కాకి వింత చర్యను చూసి లక్ష్మఫుడు ‘ అన్నయ్య! అదేమిటి ఆ కాకి దాహం తీర్చు కోడానికి నది దగ్గరకు వెళుతోంది.

కానీ నీటిని తాగకుండా వెనుకకు వస్తుంది? అని రామున్ణి అడిగాడు అప్పుడు శ్రీరాముడు ‘లక్ష్మణా! ఆ కాకి రేయింబవళ్లు రామ నామాన్ని జపిస్తుంది.

నీళ్లు తాగుతున్నప్పుడు రామనామ జనం ఎక్కడ ఆగిపోతుందోనని దాని భయం అని కాకి అనన్యభక్తి గురించి వివరించాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/