అన్నం పెడితే మంచిది

Shirdi Sai Baba

సాయిబాబా ‘ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో…నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతిచెందును అంటారు. శ్రీ శివకేశన్‌స్వామి సాయిసన్నిదిలో ఉండటానికి నిశ్చయించుకున్నారు. ఆయన షిరిడీ చేరారు. అప్పటిలో స్వామీజీకి రోజు గడవటానికి నాటుగు అణాలు సరిపోయేవి. అంటే ఆయన ఎవరిని యాచించలేదు. ఎవరైనను స్వయంగా ఎంత డబ్బు ఇచ్చినను తీసుకొనేవారు. ఆడబ్బు కనీసం నాల్గు అణాలు ఉంటే ఆరోజుకు సరిపోయేది. అన్ని రోజులలోను నాలుగు అణాలు దొరకవ్ఞ. అంత దక్షిణ లభించని రోజులలో ఒక బన్ను తిని టీ త్రాగేవారు. అంతడబ్బు కూడా దొరకని రోజులలో ఆయన లేండీబాగ్‌లోని బావినీరు త్రాగి కాలం గడిపేవారు ఎట్టి పరిస్థితులలోను ఇతరులను యాచించకూడదనే నియమం అమలుచేసేవారు.

ఆకలికి తట్టుకోలేని పరిస్థితులలో ‘బాబా! నాకు ఆస్తి పాస్తులు వద్దు ఆకలిబాధ తీరటానికి అన్నమైనా పెట్టించు. లేదా ఆకలినైనా లేకుండా చేయి అని సాయినే ప్రార్ధించేవారు. భక్తులను పరిక్షించటం ఒక కార్యక్రమంగా సత్పురుషులకు,సద్గురువ్ఞలకు ఉంటుంది. ఒకసారి ఆయన ఆకలికి తట్టుకోలేక పోయారు. తనకు ఉన్న కొద్దిపాటి వస్తువ్ఞలను మూటకట్టుకుని బయలుదేరారు. ఆయన షిరిడివిడిచి ఇంకెక్కడికైనా పోదామనే ఉద్దేశ్యంతో ఉన్నారు షిరిడీ పొలిమేరలు దాటారు. ఒక చెట్టుక్రింద చేరి సేదతీర్చుకుందామనుకుని, మూటను ఒక చెట్టుకొమ్మకు కట్టి,ఆ క్రింద నడుంవాల్చారు,కునుకు పట్టింది. మెలకువ వచ్చింది. చెట్టువైపు చూడగా ఒకసాయిబాబా పటం చెట్టుకు వ్రేలాడుతూ కనిపించింది. నిద్రపోకముందు లేని ఆసాయి చిత్తరువ్ఞ, తాను నిద్రించిన తరువాత ఎలావచ్చింది అని ఆలోచించారాయన.

బావి ఎదురుగా కనబడితే వెళ్లి చూచాడాయన. చేతికి అందుబాటులో ఉన్నాయినీళ్లు. వెంటనే మూటను విప్పి చెంబుతో నీరు త్రాగవచ్చును అనుకున్నారు. మూటను విప్పారు. చెంబులేదు. ఏమయింది? మరల ఆలోచించారాయన, షిరిడీ దాటి వెడితే కనీసం త్రాగునీరు కూడా దొరకదు సుమా అని సాయితెలియచేస్తున్నారనుకొని, షిరిడీకి ప్రయాణమయ్యారు స్వామీజీ.
అప్పటినుండి షిరిడీని విడిచి వెళ్లలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్వామీజీకి ప్రతినిత్యము షిరిడీ సంస్థానం నుండి సాయిబాబాకు నివేదింపబడిన ప్రసాదం వచ్చేది.
ఇక వస్త్రవిషయం:
ఒకసారి స్వామీజీకి ఉన్నవస్త్రాలు అరిగిపోయాయి, చిరిగిపోయాయి. కేవలం ఒకే ఒక వస్త్రం మిగిలింది. ఆవస్త్రములను శుభ్రపరచుకొనవలెననిన,వేరొక వస్త్రంను ధరింపవలెను. ఆయనకు రెండవ వస్త్రమేలేదు. సాయిని ప్రార్ధించాడాయన. లేండీబాగుకు పోయారు. అక్కడ ఆయన ఆధ్యానంలో ఎవరో అపరిచితవ్యక్తి నూతన వస్త్రంలను తనకు బహుకరించినట్లు అనుభూతికలిగింది. అదేసమయంలో లేండీబాగులో ఎవరో ధ్యానంచేయుచున్నారు. ఆవ్యక్తికి ధ్యానంలో సాయిబాబా సాక్షాత్కరించి, రెండునూతన వస్త్రంలను (ఎదురుగా ధ్యానం చేయుచున్న శివకేశన్‌స్వామీజీకి) బహుకరింపమని సాయి ఆదేశించారు. ఆనూతన వ్యక్తి వెంటనే రెండు వస్త్రంలుకొని తెచ్చి, శివకేశన్‌స్వామీజీకి బహుకరించి, తనధ్యాన వృత్తాంతాన్ని, స్వామీజీకి చెప్పారు. స్వామీజీ సాయికి కృతజ్ఞతలు చెప్పారు.

-యం.పి.సాయినాధ్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/