పరిజ్ఞానం కన్నా ఆత్మజ్ఞానం మిన్న

Meditation

జార్ఖండ్‌కు చెందిన రామఘడ్‌ కైంట్‌ డబ్బే జీవితం, డబ్బే పరమావధిగా గడిచింది. ఇంట్లో కుటుంబసభ్యులను కూడా మరిచి డబ్బు వెంట పడ్డాడు. డబ్బుతోనే ఆనందం, సుఖం ఉంటుందని అనుకుని, భౌతిక సుఖంకోసం మెల్లమెల్లగా అన్ని వ్యసనాలకు అలవాటు పడ్డాడు. డబ్బు మదం కారణంగా మద్యం, ఇతర వ్యసనాలు, లోభం, క్రోధం, అహంకారం అతనిలో చోటు చేసుకున్నాయి. ఏ పదార్థాలు తినకూడదో అవన్నీ తినేవాడు. తాగేందుకే బతికి ఉన్నాననుకునేవాడు. అలాంటి వారి జీవితమే ఒక్కొక్కప్పుడు ఇతరులకు కనువిప్పగా మారుతుంది. అతడి దుర్వ్యసనాలు క్రమంగా దేవ్ఞనికి దూరం చేశాయి. అతను డబ్బే జీవిత పరమార్థంగా ఎన్నుకొని ఎంతో గడించినా సుఖశాంతులు లేవు. అందుకే తప్పుదారి తొక్కి జైలుపాలయ్యాడు. జైలులోకి వచ్చిన కొద్దిరోజులలోనే సుఖసాగరం, దుఃఖ కర్త, సుఖకర్త ఐన పరమపిత పరమాత్మ శివబాబా తన (శరణాగతిలోకి) అక్కున చేర్చుకున్నాడు. శివబాబా మురళిక్లాస్‌ చెప్పిన మొదటిరోజే తన చేతులలో బంధించిన అనుభూతిని పొందాడు. అతను తన అమ్మ, నాన్న, భార్య పిల్లలును నిజంగా ప్రేమించలేదన్న విషయం అర్థం చేసుకున్నాడు. ఈ దుఃఖమయ ప్రపంచంలో నిజమైన సుఖం భౌతిక పదార్థాలతో లభించదని, నిజమైన సుఖం ఆధ్యాత్మిక జ్ఞానంతోనే లభిస్తుందని తెలుసుకున్నాడు.
కలియుగ అంతం, సత్యయుగ ఆరంభం కాలం, సంగమయుగంలో స్వయంగా నిరాకారుడు, జ్ఞానసాగరుడు, పరమపిత పరమాత్మ, శివ, బ్రహ్మబాబా సాకార తనువ్ఞలో దివ్య అవతరణ దాల్చి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాడు.
అపవిత్రులను పవిత్రులుగా చేసేందుకు ఈ జ్ఞానాన్ని సహజ రాజయోగం ద్వారా మాత్రమే సుఖం,శాంతితో పూర్తి పునర్జన్మ లభించిందనే అనుభూతిని పొందాడు.
కామ, క్రోధ, లోభ, మోహ, అహం అన్నవే పెద్దజైలు లాంటివి. ఈ జైలులో ప్రపంచంలోని ప్రతి ఖైదీ దుఃఖంతో, అశాంతితో ఉన్నారు. తాను వికారమనే జైలులో స్వతంత్య్ర స్వేచ్ఛ సాధించేందుకు శివబాబా బోధనలు విన్నాడు.
చేయించేది-చేసేది పరమాత్ముడే కావ్ఞన ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచుకుని జైలు నుంచి విముక్తి పొందాడు.
నిజానికి తోటి ఖైదీలు ఏమని అర్థంచేసుకున్నారంటే, భయపెట్టడం, బెదిరించడం, దూషించడం వంటివి మాత్రమే గుర్తింపునిస్తాయి. ఆయన మనచేత మంచి పనులే చేయిస్తారు. తప్పుడు పనులు మాయ చేయిస్తుంది.
వారందరు నా పట్ల నమ్రతతో, ప్రేమగా మాట్లాడినవారే. తనకు ఇలాంటి గుర్తింపు రావడంలో మార్పును బేరీజు వేసుకోగలిగాడు. అతను తెలుసుకు న్నవి ఏమంటే… తప్పు చేయడం, తప్పు సరిదిద్దుకో వడం, మూర్ఖత్వం నుండి జ్ఞానం వైపుకు మారడంతోనే జ్ఞాని అవ్ఞతారు. భాషాజ్ఞానం కన్నా, పరిజ్ఞానం కన్నా, ఆత్మజ్ఞానం, ఆత్మప్రబోధం మిన్న.