భగవంతుని సన్నిధికై పరితపించాలి

Devotee
Devotee

భగవంతుని గూర్చి పలువ్ఞరు పలుతీరులుగా చెబుతుంటారు. ఉన్నది ఒక్కడే దైవం. అయినా జిహ్వకోరుచి అన్నట్టుగా ఎవరికిష్టమొచ్చిన తీరులో వారు ఆ దైవం గురించి చెప్తారు. గుణాతీతుడు, నిరాకారుడు అయిన దైవం భక్తుల కోరిక మేరకు వారు కోరుతున్న రూపాల్లో వ్యక్తమవ్ఞతుంటాడు. ఆవ్యక్తుడైన భగవంతునికి రూపాన్ని, నామాన్ని కల్పించుకుని పూజించి తన్మయిడౌతాడు భక్తుడు. భగవంతుడు మనకు ఏమికావాలో అది మనం అడగకుండానే అన్నీ సమకూర్చాడు. అలాంటి దైవానికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. మనం మనశక్తిమేరకు మనవంతు బాధµ్యతగా దేవ్ఞనికి పూజారూపంలో మన హృదయాన్ని అర్పించాలి.
అది అర్చనం, సేవనం, కీర్తనంపుష్పం, పత్రం, తోయం. ఏదైనా అర్పించవచ్చు. ఏ పేరున పిలచినా పలుకుతాడు. తల్చినా తరలివస్తాడు. అది భగవంతుని లీలామాయ విశేషం. మన జీవితం ఎన్నో సమస్యలు ఇచ్చినా, అవన్నీ తొలగిపోవటానికి సరైన నిర్ణయం ఒక్కటి చాలు ఆలోచనలతో ముందడుగువేస్తే అపజయం అడ్డు తప్పుకుని విజయానికి దారిచూపిస్తుంది. దానికి కావలసింది నిస్వార్ధం. తాను ఒక్కడే బాగుపడాలన్న ఆలోచనలకాక, నలుగురు బాగుండాలని ఆలోచన కలిగుండడం, మనలో అంకితభావం, దైవభక్తి, క్రమశిక్షణ, వివేకం, పట్టుదల, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అహింసా అనే బీజాలు నాటితే అవి మొలకెత్తి భగవంతుడనే చైతన్యం వెల్లివిరుస్తుంది.
నేర్పుతో, సామర్ధ్యంతో, సహనంతో, సాహసంతో, తప్పించుకుని జీవితాన్ని ధర్మం, బ్రహం (మంచితనం, దైవం) మధ్య చేర్చినట్లయితే మంచికి విజయం చేకూర్చిపెడుతుంది. మానవ్ఞలు ఎల్లప్పుడు తమశక్తియుక్లును, మనోశక్తిని వినియోగించి, దుర్గుణాలను నిరోధించి, ధర్మం అనే గమ్యంతో దైవాన్ని చేరడానికి కృషి చేయాలి.
సర్వం ఈశ్వరమయంగా భావించి, తన పరబేధం లేకుండా అచంచలమైన ప్రేమతో భక్తిసామ్రాజ్యంలోకి అడుగుపెట్టాలి. భక్తిరసాన్ని భారతావనినంతా ప్రవహింపచేసి, భాగవన్నామృతాన్ని ఆశ్వాదిస్తూ, ఎవరికిష్టమైన దైవాన్ని, భక్తితో పూజించుకుని, విజయపరంపరతో, జీవితాలను మంచిమార్గాన నడుపుకుని భగవంతుని సన్నిధిని చేరుకోవాలి. మానవజన్మకు సార్ధకత చేకూర్చుకోవాలి.