విమర్శనాత్మక దృష్టి

ఆధ్యాత్మిక చింతన

Gautam buddha
Gautam buddha

ఎంతగొప్ప వ్యక్తి చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా ఏవిషయాన్నీ గుడ్డిగా నమ్మవద్దనీ భగవంతుడిచ్చిన వివేకాన్ని, విచక్షణాజ్ఞానాన్ని వినియోగించమని, విమర్శనాత్మక దృష్టిని అవలంభించమని గౌతమబుద్ధుడు, రామకృష్ణపరమహంసలాంటివారు, నేటి వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతారు.

ఎందుకంటే అది సులభం. విమర్శించటం, వివేకాన్ని వినియోగించటం శ్రమతో కూడుకున్నపనులు. ఎన్నెన్నో గ్రంధాలను చదవాలి, ఎందరెందరో చెపిపన విషయాలను తెలుసుకోవాలి.

ఎవరు చెప్పింది తప్పో, ఎవరిది ఒప్పో పరీక్షించాలి.

తర్వాత అన్నిటికీ సిద్ధమై ఒక నిర్ణయానికి, ఒక నిశ్చితాభిప్రాయానికి రావాలి.

ఆ అభిప్రాయాన్ని వెలిబుచ్చితే లోకంతా మనల్ని నిందించవచ్చు. ఈ గొబవంతా మనకెందుకు అని వ్యాసుడు, వాల్మీకి, శంకరాచార్యుడు ఏమి చెబితే దాన్ని మంచిదంటాము,

వారేమి చేసింటే దాన్ని సత్కార్యమని భావిస్తాం. కానీ దాని నుంచి ప్రయోజనం లేదంటారు పెద్దలు.

బుద్ధి వికసించాలంటే బుద్ధిని వినియోగించాల్సిందే, నిష్పక్షపాతంగా విమర్శించాల్సిందే. ఆ వైఖరే చివరకు సత్యదర్శ నానికి దారితీస్తుంది.

లోకమంతా పొగిడే వేదవ్యా సుడిని వివేకానందస్వామి ఎంత గొప్పగా పొగడు తాడో అవసరమైన చోట అంతగా విమర్శిస్తాడు. ఆదిశంకరాచార్యుల వారిని ఎక్కడ ఎలా పొగడాలో అక్కడ పొగడి, అవసరమైన విషయంలో విమర్శిస్తాడు.

శ్రీకృష్ణపరమాత్ముడిని, శ్రీరాముడిని, పరశురాముడిని గూర్చి ఎంతో గొప్పగా చెప్పిన ఓషో కొన్ని విషయాల్లో వారిని నిర్ధాక్షిణ్యంగా విమర్శిస్తాడు. పరశురాముడంటే మనకెంతో గౌరవం, ఆయన మనకు ఆరాధ్యదైవం, అవతారా ల్లో ఒక అవతారం.

అధర్మాన్ని అంతమొందించి ధర్మాన్ని ప్రతిష్ఠించిన శ్రేష్ఠుడు. ఆయన చేసినదంతా సత్కార్యమే. కానీ ఈనాటి సజ్జనుడు, నిష్కళంక హిందువ్ఞ, దేశభక్తుడు అయిన వినోభాబావే పరశురాముడిని గూర్చి, ఆయన చేసిన పనులను గూర్చి ఏమంటో ఆయన చేసిన ‘గీతాప్రవచానాలు అనేగ్రంధంలో చదివి తెలుసుకుందాం. ‘

పరశురాముడు అహింసాపరుడే అయినప్పటికి హింసను అవలంభించి క్షత్రియుల నాశనానికి పూనుకొనెను.

క్షత్రియులను హింసావిధానం నుండి తప్పించుటకై అతడు స్వయంగా హింసాకాండకు దిగెను. ఇదంతయు అతని దృష్టిలో అహింసా ప్రయోగమే. కానీ అది ఫలించలేదు. ఇరువదియొక్కసార్లు అతడు క్షత్రియసంహారం చేసెను.

క్షత్రియులింకనూ మిగిలియే యుండిరి- హింసాప్రవృత్తిగల క్షత్రియవర్గమును నిర్మూలింప నెంచి చివరకు తాను ఆ వర్గములోనే చేరిపోయెను.

ఇక క్షత్రియవర్గం నశించుటెట్లు? హింసాబీజం స్థిరముగనే యుండెను. బీజమును స్థిరముగ నుంచి ఆకులను, కొమ్మలను కొట్టివేసినను చెట్టు మరలమరల చిగురించునే ఉండును.

పరశురా ముడు గొప్పవాే! కానీ అతడు చేసిన ప్రయోగం బహువిచిత్రమైనది. తాను క్షత్రియుడిగా మారి పృధ్విని క్షత్రియ రహితమును చేయదలచెను. తాను తన విూదనే ప్రయోగం ప్రారంభించి యుం డిన బాగుండెడిది.

ముందతడు తన శిరస్సును ఛేదించుకొని యుండవలసింది. కానీ నేను అతనికంటే మిక్కిలి బుద్ధిగలవాడనై అతని దోషము ను చూపుచున్నానని భావింపరాదు.

నేను బాలకు డను, కానీ నేనతని భుజములపై నిలిచి యున్నం దువలన సులువ్ఞగా ఎక్కువ దూరం చూడగలుగు చున్నాను)

(పుట 291-గీతాప్రవచనములు- వినోబాభావే) ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వినోబాభావే ఎంతో నమ్రతతో, ఆత్మవిశ్వాసంతో, సద్విమర్శ చేస్తున్నాడని తెలుస్తుంది.

పరశురాముడిని విమర్శించినంత మాత్రాన ఆయన హిందువ్ఞ కాకుండాపోతాడా?

వేదవ్యాసుడిని, ఆదిశంకరాచార్యుల వారిని విమర్శించినంతమాత్రాన వివేకానందుడు హిందు వ్ఞకాడా? అసలు హిందూమతంలో ఉండే గొప్ప సుగుణం అదే.

ఎవరైనా ఎంత అల్పజ్ఞులైనా, ఎంత అజ్ఞానులైనా ఏ విషయాన్నైనా విమర్శించ వచ్చు.

ఈ విమర్శలతో హిందూమతాని కున్న మెరుగు అధికమవ్ఞతుందిగానీ క్షీణించదు.

విమర్శ అన్నది అమూల్యమైన వజ్రం చుట్టూ పేరుకుపోయిన మట్టి నీ, మైలను తొలగించే ద్రావకం లాంటిది. మందు లాంటిది. అయితే ఆ విమర్శ నిష్పక్షపాతంగా ఉండాలి.

అలాంటి విమర్శనాత్మక దృష్టిని అలవరచు కోవాలి.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/