హజ్రత్‌ అబూబకర్‌ దానశీలత

MASZID
MASZID

మహాప్రవక్త(స) తన అనుచరుల సుగుణసంపత్తిని ప్రశంసిస్తూ ”నా అనుచరులు (సహాబీలు) నక్షత్రాలు వంటివారు. వారిలో ఎవరికి విధేయించినా (అనుసరించినా) మీరు సన్మార్గం పొందుతారుఅని చెప్పారు. హజ్రత్‌ అబూబకర్‌ (రజి) అరేబియాలోని ఖురైష్‌ ప్రజలందరిలో ఎంతో సద్గుణ సంపన్నులు. అబద్ధానికి ఆమడదూరంలో ఉండేవారు. మాటకు కట్టుబడి ఉండే వాగ్దానపాలకుడు. అజ్ఞానకాలం నుంచే మద్యపానాన్ని ఆయన దరికి రానిచ్చేవారు కాదు. పురుషుల్లో అందరికంటే ముందు ఆయనే ఇస్లాం స్వీకరించాలి. దైవప్రవక్త(స) ఒకరోజు రాత్రి దైవదూత జిబ్రీల్‌ అలైహిస్సలాంతో పాటు సప్తాకాశాలు పర్యటించి వచ్చారు. దాన్నే ‘మేరాజ్‌యాత్ర అంటారు. దైవప్రవక్త(స) మరునాడు ఉదయం కాబాలయం వెళ్లి మేరాజ్‌ యాత్ర గురించి చెప్పడం ప్రారంభించారు. అవిశ్వాసులు ఆ సంఘటన విని ఆయన్ని హేళన చెయ్యడం ప్రారంభించారు. కాస్సేపటికి హజ్రత్‌ అబూబకర్‌ (రజి) కూడా కాబాలయానికి వచ్చారు. కాబా వెలుపల మేరాజ్‌ వార్త గురించి వింతగా చెప్పుకుంటున్న కొందరు ఆయన్ని చూడగానే ”అబూబకర్‌! విన్నావా నీ ప్రియమిత్రుడు ఏమంటున్నాడో? రాత్రి ఆయన బైతుల్‌ మఖ్దిస్‌కు పోయి ఆ రాత్రికే అంతదూరం నుంచి తిరిగొచ్చాడట! అన్నారు. ”అయితే ఆయన చెప్పింది ముమ్మాటికీ నిజమే. అందులో నాకెలాంటి అనుమానం లేదుఅన్నారు హజ్రత్‌ అబూబకర్‌! దేవ్ఞడు నీకు ”సిద్దీఖ్‌ (సత్యసంధుడు) అనే బిరుదు ప్రదానం చేశాడు అని చెప్పారు.
హజ్రత్‌ అబూబకర్‌ (రజి) దైవమార్గంలో తన సర్వస్వాన్ని ధారపోయడానికి సైతం వెనుదీయని గొప్ప దానశీలురు. ఇస్లాం స్వీకరించే నాటికి ఆయన దగ్గర నలభై దిర్హంల పైకం ఉండేది. అ పైకాన్నంతా ధర్మవికాసం కోసం దైవప్రవక్త(స)కు సమర్పించుకున్నారు. దైవప్రవక్త(స) ఒకసారి ఆయన దానశీలతను ప్రశంసిస్తూ ”నేను అందరి ఉపకారాన్ని తీర్చాను. కాని అబూబకర్‌ ఉపకారం ఇంకా మిగిలి ఉంది. దానికి ప్రళయదినాన దేవ్ఞడు బదులు తీరుస్తాడు. అబూబకర్‌ (రజి) ధనం వల్ల నాకెంత ప్రయోజనం చేకూరిందో ఇతరుల ధనం వల్ల నాకంత ప్రయోజనం చేకూరలేదుఅన్నారు.
హజ్రత్‌ అబూబకర్‌ (రజి) దానశీలత ఎంతో గొప్పది. అలాంటి త్యాగాన్ని ఎవరూ చేయలేదంటే అది అతిశయోక్తి కాదు. హజ్రత్‌ అబూబకర్‌(రజి) దైవమార్గంలో ధనత్యాగం చేసే విషయంలో అందరికంటే ముందుండేవారు. తబూక్‌ దండయాత్ర కోసం దైవప్రవక్త విరాళాలు అందజేయవలసినదిగా అనుచరులకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు అనేకమంది వారివారి తాహతును బట్టి భారీ విరాళాలు అందజేశారు. హజ్రత్‌ ఉమర్‌ ”నేనీ విషయంలో అబూబకర్‌ని మించి పోవాలని నిర్ణయించుకొని నాయావదాస్తిలో అర్థభాగం తీసుకొని వచ్చాను. దైవప్రవక్త(స) అది చూసి ”భార్యాపిల్లల కోసం ఏమైనా మిగిల్చావా లేదా? అని అడగ్గా ”వాళ్లకోసం సగం వదలిపెట్టాను అన్నారు. ఆ తరువాత హజ్రత్‌ అబూబకర్‌ (రజి) ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి తెచ్చి ప్రవక్త(స) పాదాల చెంత పోశారు. దైవప్రవక్త హజ్రత్‌ ఉమర్‌ను అడిగినట్లే అడగ్గా, దానికాయన ”భార్యాప్లిలల కోసం దేవ్ఞడు, దైవప్రవక్త (స) చాలుఅని అన్నారు. అందుకు హజ్రత్‌ ఉమర్‌ (రజి) నేనే అసాధారణ దాతృత్వం చూసి నేనిక ఎప్పుడూ ఏవిషయంలో కూడా అబూబకర్‌ని మించిపోలేదుఅని అన్నారు. ఇదండీ ఆనాటి ప్రవక్త (స) అనుచరుల దాననిరతి.

  • షేఖ్‌ అబ్దుల్‌ హఖ్‌

తాజా క్రీడావార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/