శివప్రసన్న మంత్రం

lord shiva
lord shiva


శివమంత్ర మహిమశివుడు కరుణామయుడు. ఈ కరుణతోనే తన భక్తుడైన త్రిపురాసురునికి అనేక వరాలను ఇచ్చాడు. ఆవ రాల ప్రభావం తో త్రిపురాసురుడు దేవతల మీదకు దాడికి వెళ్లారు. వీళ్లధాటికి తట్టుకోలేక దేవతలు విష్ణువును శరణుజొచ్చారు. సంహరించడం ఒక్క శివునికే సాధ్యమని చెప్పడంతో దేవతలు శివుడిని శరణువేడారు. శివుడు నరనారాయణులను ఉద్దేశించి ఇలా అన్నాడు. శ్రీహరీ, నాకు దేవతల ఉద్దేశం అర్థమయ్యింది. కాని వారు నా భక్తుడు. వేదధర్మాన్ని అనుసరిస్తున్నారు. వారిని మీరు కపటంగా ధర్మభ్రష్టుడిని చేశారు. వారిని సంహరిం చడానికి నాకు మనసు రావడం లేదు. కనుక మీరే వారిని సంహరించండి అన్నాడు. ఈ మాటలకు దేవతలంతా బెంబేలెత్తి పోయారు.
అప్పుడు బ్రహ్మ! శంకరా అందరినీ రక్షించాల్సిన నీవే ఇలా అంటే ఎలా? ఇందుకు నీవే తగుదువు. శంకరుడు బ్రహ్మ మాటలువిని నేను వారిమీదకు యుద్దానికి వెళ్లాలంటే నాకు సైన్యమేది? నాకు రథం లేదు. దనర్బా ణాలు లేవు. ఇవన్నీ వున్నా యోగిని నేను. బలవం తులైన అసురు లను నేనెలా సంహరించగలను? అని మళ్లీ మాయగా మాట్లాడాడు. ఈసారి దేవతలు మాయలో పడలేదు. దేవా! నీవు సర్వసమర్థుడివని మాకు తెలుసు. ఇవేవీ లేకుండానే నీవు దుష్టశిక్షణ చేయగలవు. కానీ మాకు కూడా ఇందులో సేవాభాగ్యాన్ని ఇవ్వాలనే ఇలా మాట్లాడు తున్నావు. నీకు పరికరాలన్నీ మేము ఏర్పాటు చేస్తాము అని అంటుండగా పార్వతీదేవి ప్రత్యక్షమై స్వామీ! కుమారస్వామి క్రీడలు చూడండి ఎంత ముద్దుగా వున్నాయో అంది. శంకరుడు కుమార స్వామిని ఆడిస్తూ ఏమీ మాట్లాడకుండా కైలాస గుహలోనికి వెళ్లిపో యాడు.
దేవతలంతా కైలాసగుహ దగ్గర గట్టిగా స్తోత్రం చేస్తూ కూర్చున్నారు. వీరివల్ల స్వామికి భంగం కలుగుతుందని కుంభోద రుడు అనే గణనాయకుడు దేవతలని కర్రలతో చితకబాదాడు.
ఇక కశ్యపులు మొదలైన మునులు, ఇంద్రాది దేవతలు మేమేం చేస్తే శివుడు ప్రసన్నుడై దుష్టశిక్షణ చేస్తాడో చెప్పు అని విష్ణువును వేడారు. విష్ణువు దేవతలారా! శంకరుడు ప్రసన్నుడవ్వాలంటే ఓం నమశ్శివాయ శుభం శుభం కురుకురు శివాయ నమఓమ్‌ అనే మం త్రాన్ని జపించండి అన్నాడు. దేవతలంతా ఈ మంత్రాన్ని కోటిసార్లు జపించి శివుని స్తుతించారు.
శంకరునికి దేవతలపై జాలి కలిగి వెంటనే హంసలా అక్కడకు వచ్చి దేవతలారా! మీరు వెనుక రథాది పరికరాల్ని చేకూరుస్తామని మాటి చ్చారు. ఆ విధంగా ఏర్పాటు చేయండి.
నేను యుద్దంచేసి రాక్షస సంహారం చేస్తాను అన్నాడు. విశ్వకర్మ సంకల్పంతో ఒక అద్భుత రథం తయారయ్యింది. ఆ రథం సర్వలోకాల సారంతో నిండివుంది. శివరథం ఆ రథానికి సూర్యుడు దక్షిణచక్రం, చంద్రుడు ఉత్తరచక్రం. కుడి చక్రానికి పన్నెండు మంది ఆదిత్యులు ఆకులు గానూ, ఎడమ చక్రానికి చంద్రుడి పదహారు కళలూ ఆకులు గానూ, నక్షత్రాలు అలం కారాలుగానూ, కుడిఎడమ చక్రాలు రెండింటికీ ఆరు ఋతువులూ అంచులుగా వున్నాయి.