వెంట్రుకలు పెరగకుండా..

MOKKUBADI
DEVUNI MOKKUBADI

వెంట్రుకలు పెరగకుండా..

ప్రతి మనిషి తాను సంపాదించిన విద్య, ధనం, అధికారం శాశ్వతం అనుకుంటాడు. అది కేవలం జీవించడానికి మాత్రమే. ఈ లోకంలో మనకు శాశ్వతమైనది ఏమీలేవ్ఞ. భార్యాబిడ్డలు మనం సంపాదించిన ధనం ఇవేమీ మన వెంట వచ్చేవి కావ్ఞ. కేవలం పాపపుణ్యాలు మాత్రమే. మనం సంపాదించిన సంపాదన, అధికారం ఇవి అశాశ్వతం అని తెలిసి కూడ మనిషి తనకు వచ్చిన ఆదాయంతో సరిపెట్టుకోక ఎక్కువ మొత్తంలో ధనం కూడబెట్టాలన్న ఉద్దేశ్యంతో అనేక అడ్డదారులను తొక్కుతున్నాడు.

మనం పుట్టినపుడు ఏమీ లేకుండా వస్తాం. చనిపోయిన తర్వాత వెంట తీసుకుని పోయేది కూడా ఏదీ లేదు. ఎప్పుడయితే మనిషి ఈలోకంలో సంపాదించినదంతా అశాశ్వతమని తెలుసుకుంటాడో మనిషి దుర్గుణాలు వదిలి నీతిమార్గంలో నడుస్తాడు. జీవిని ఈశ్వరునిగా ఎంచి చుట్టూ ఉన్న నిరుపేదలకు, అభాగ్యులకు, నిస్సహాయులకు సేవ చేయుటకు సిద్ధపడతాడు.

పూర్తిగా బంధాలను తెంచుకోకుండా తామరాకు మీద నీటిబొట్టు వలె అంటీ అంటనట్లుగా ఉంటాడు. శాశ్వతమైనవి ఏమిటో తెలుసుకుంటాడు. అట్టి అశ్వాశతమైన వాటి గురించి మహనీయులు ఎప్పుడూ ఆశించలేదు. అట్టివారిలో శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరమణ మహర్షి ఇంకెందరో మహానుభావ్ఞలు. సంసార జీవితం చేస్తూ మన ధ్యాస సృష్టికర్తయిన ఆ భగవంతుని మీదనే ఉండాలని చెప్పిన మహానుభావుడు శ్రీరామకృష్ణ పరమహంస పూర్తిగా బంధాలను తెంచుకోకుండా తామరాకు మీద నీటిబొట్టు వలె అంటీ అంటనట్లుగా ఉంటాడు, శాశ్వతమైనవి ఏమిటో తెలుసుకుంటాడు.

ఎప్పుడయితే మనం ప్రాపంచిక విషయాల పట్ల మక్కువ తగ్గించుకొని మహాత్ముల బోధనలతో జ్ఞానాన్ని పొంది వారి బాటలో నడిచి ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో తెలుసుకొంటామో మానవ జన్మను సార్థకం చేసుకోగలం. అపుడే మనిషి జనన, మరణ చక్రాల నుండి విముక్తి కాగలుగుతాడు.

– నాగలక్ష్మి