పొంచిఉన్న ఆపదలు

ఆపదలు చెప్పిరావు. పెద్దవారికైనా అంతే, పిల్లలకైనా అంతే. ఆపదలు ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో, ఎక్కడ వస్తాయో తెలియదు. సాయిబాబా విషయంలో అలా కాదు. తన బిడ్డలకు ఎప్పుడు ఆపదలు వచ్చినా, ఆపదలు రావటానికి పొంచి వున్నా, తాను సిద్థంగా వుండేవాడు. సాయి భౌతికంగా షిర్డిలో వుండే కార్యాన్ని నడిపేవాడు.

చిట్టిచెల్లెలు
శాంతకర్వాండేకర్‌ బాలికగా వున్నప్పుడు తల్లిదండ్రులతో సాయిబాబా దర్శనానికి వచ్చింది. ఒకరోజున శాంత మారుతీ మందిరానికి ఎదురుగా వున్న బావిలో పడ్డది. వెంటనే శాంత ‘బాబా, బాబా’ అని కేకలు పెట్టింది. ఆ బావిలో పడి అడుగుల లోతులో నీరున్నది. అదే సమయంలో కాకాసాహెబ్‌దీక్షిత్‌, బుట్టి అనే భక్తులతో మాట్లాడుతున్నాడు. సాయి తన హస్తాన్ని హఠాత్తుగా చాచి, ఆయన పక్కన వున్న నీటి కుండపై కొన్ని క్షణాలు ఉంచి, తిరిగి మామూలుగా ఆ చేతిని పెట్టుకున్నారు. శాంత కేకలు విన్న ఆ చుట్టుపక్కల వారు బావిలోనికి తొంగిచూసారు. ఆ పాప సగము వరకే నీటిలో మునిగి వుండటం చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ పాప నీటిలో మునగకుండా సాయిబాబా తన హస్తంతో ఆపేచేశారని తెల్సిందా చిన్నబాలిక. ద్వారకామాయిలో సాయి సన్నిధిలో ఉన్న దీక్షత్‌, బుట్టీలకు సాయి విచిత్ర చేష్టకు అర్థం అప్పుడు తెలిసింది. తాను సాయిబాబా సోదరినని ఆ పాప తెల్పేది పెద్దదై. ఇల్లాలయిన తర్వాత, తన భర్తతోపాటు సాయి సమాధిని దర్శించే ఈ సోదరి, స్వప్నంలోనే కాకుండా భౌతికంగా కూడా సాయిబాబా దర్శనాన్ని పొందినట్లు ఆమె చెప్పేది. సాయిబాబాకు ఈమె ఒక్కతే సోదరి కాదు. చంద్రాబాయి చోర్కరు, బయజాబాయి..ఇలా ఎందరో ఉన్నారు సాయికి. అయితే శాంతకర్వాండేకర్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఈమె సాయికి చిట్టిచెల్లెలు. చిన్నవయసులోనే సాయికి సోదరి అయింది.

విలువెత్తు గొయ్యి
ఒక చిన్నపిల్లవాడు షిరిడీలో, ఇంటి కోసం తవ్విన పునాదిలో పడ్డాడు. ఇది 5 అడుగుల లోతు ఉన్నది. నీటితో నిండి వున్నది. అతడు పడడం ఎవ్వరూ చూడలేదు. ఆ చిన్నపిల్లవానికి ఈత రానేరాదు. ఆ పిల్లవాడు మెల్లగా పైకి వస్తున్నాడు. అయితే ఆదృశ్యాన్ని చాలామంది చూచారు. ఎలాపైకి వచ్చావు? అని ఆ పిల్లవానిని ప్రశ్నించసాగారు. ఆ పిల్లవాడు ‘సాయిబాబా’ నీటిలోనే మెట్లు చూపించాడు. పైకి వచ్చాను అన్నాడు. అయితే అది ఎలా సంభవం? కాని అందరూ చూచిన దృశ్యాన్ని ఎవరు కాదనగలరు? సాయిబాబా తన చిన్నారులను కాపాడుతూనే ఉంటాడు అనూహ్యరీతులలో.

రాళ్లగుట్ట – పూలబుట్ట :  శాంతారాం బల్వంత్‌నాచ్నేకర్‌ కుమారుడు హరేశ్వర్‌. ఆ పని బాలుడిని సాయినాధ్‌ అని పిలిచేవారు తల్లిదండ్రులు, ఇతరులు అతడు మూడుసంవత్సరాల వయస్సున్నప్పుడు మిద్దెపై ఆడుకొనుచూ, కిందనున్న రాళ్లపై పడ్డాడు. నాచ్నే ఆ దృశ్యాన్ని చూచి పరుగెత్తుకుంటూపోయి పిల్లవాని శరీరాన్ని పరీక్షించాడు. ఆ పిల్లవాడు ‘అప్పా, ఏలభయపడెదవు? బాబా నన్ను పట్టుకొనెను అన్నాడు. అది సత్యమే. ఆ రాళ్లగుడ్డి పూలబుట్ట అయితీరుతుంది. ఇంకా సాయి సహాయహస్తం ఉండనే వున్నది.

కుమ్మరి కొలిమిలో పసిబిడ్డ
ఒకసారి సాయిబాబా హఠాత్తుగా ధునిలో చేయి పెట్టి నిశ్చంతగా వున్నాడు. దానిని మాధవుడు చూచాడు శ్యామా సాయి చేతిని వెనుకకు లాగివేశాడు. ‘దేవా’! ఏమి చేసితివి? అని అన్నాడు. ఒక కమ్మరి స్త్రీ చంటి బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి దగ్గర పనిచేస్తోంది. ఆమె భర్త ఆమెను పిలవగా, పరధ్యానంలో ఉన్న ఆమె తన ఒడిలో నున్న బిడ్డసంగతి మర్చిపోయింది. బిడ్డ కొలిమిలో పడ్డాడు. ఆ బిడ్డను కొలిమి నుండి బయటకు లాగాను. నా చేయి కాలితే ఫర్వాలేదు. బిడ్డప్రాణాలు దక్కాయి అన్నారు సాయి. కొంతకాలం తర్వాత ఆ కమ్మరి దంపతులు వచ్చి తమ బిడ్డను అగ్ని నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అది సాయి రక్ష.

-యం.పి.సాయినాధ్‌