పాపాల పాలవకు

PRAYER
PRAYER

పాపాల పాలవకు

సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్‌ మానవునికి శక్తియుక్తులను, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఇచ్చి ఇట్టే వదలిపెట్టలేదు. అతని మార్గదర్శనం కొరకు గొప్ప ఏర్పాట్లు చేశాడు. ప్రవక్తలను పంపాడు. గ్రంథాలను అవతరింపజేసి వారి ద్వారా మంచేదో, చెడేదో చాలా చక్కగా వివరించాడు. ఆయన రెండు మార్గాలను చూపాడు. ఒక మార్గం శ్రేయస్కరమైనది. ఇంకొక మార్గం హానికరమైనది. ఎవరైతే శ్రేయస్కర మార్గమైన దైవ విధేయతా మార్గాన్ని అవలంబిస్తారో వారు స్వర్గసౌఖ్యాలను అనుభవిస్తారు. మరెవరైతే హానికరమైన దైవ తిరస్కార మార్గమైన దుర్మార్గాన్ని అవలంబిస్తారో వారు భగభగమండే నరకాగ్నికి ఆహుతవ్ఞతారు. జీవితంలో మంచితో పాటు చెడు కూడా వస్తూ ఉంటుంది.

కాని నిజమైన విశ్వాసి మంచిని ఆస్వాదించి చెడు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆదం హవ్వాలు తప్పు చేయటం వల్లనే స్వర్గం నుండి బహిష్కరింపబడ్డారు. ఈ విషయం గురించి మనిషి ఎప్పడూ ఆలోచిస్తూ ఉండాలి. చివరికి షైతాన్‌ వారిని పెడత్రోవ పట్టించి స్వర్గం నుంచి బహిష్కరింప చేశాడు. అప్పుడు హజ్రత్‌ ఆదం కొన్ని మాటలు తన ప్రభువ్ఞ నుంచి నేర్చుకుని పశ్చాత్తాపం చెందారు. అల్లాహ్‌ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను. అల్లాహ్‌ వినేవాడు, చూచేవాడు. నాకు చెవ్ఞలిచ్చిన ప్రభువ్ఞ నా మాట వినకుండా ఉంటాడా? నాకు కండ్లనిచ్చిన ప్రభువు నేను చేసే పనులను చూడకుండా ఉంటాడా? అనే భావనను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఉదాహరణకు షాపింగ్‌మాల్‌లో సిసి కెమెరాలుంటే దొంగతనం చేయాలనుకునే దొంగకు కెమెరాల ద్వారా తనను చూస్తున్నారు అనే భయం అతనిలో చోటు చేసుకుంటే ఇక అతడు దొంగతనం చేయగలడు? కాబట్టి ఎవరిలోనయితే ”నన్ను సృష్టించి, పోషించి, పాలించే ప్రభువైన అల్లాహ్‌ ఎప్పుడూ నా వెంట ఉన్నాడు.

నా ప్రతిక్రియను చూస్తున్నాడు. నా ప్రతి మాటను వింటున్నాడు. నా చూపుల చౌర్యాన్ని గమనిస్తున్నాడు. నా హృదయంలోని వాటిని సైతం ఎరిగినవాడు అనే భావన ఉన్న వ్యక్తి పాపకార్యాలు ఎలా చేయగలుగుతాడు? దైవదూతలు రికార్డు తయారుచేస్తున్నారు. మనిషి చేసే ప్రతి పనిని, తను పలికే ప్రతి పలు కునూ దైవదూతలు వ్రాస్తున్నారు. రేపు ప్రళయ దినాన వీటిని బట్టి లెక్క తీసుకోబడుతుంది. ఆ తర్వాత స్వర్గమో, నరకమో ఖరారు చేయబడుతుంది. ఈ విషయాన్ని ప్రతివ్యక్తీ స్మరించు కుంటూ ఉండాలి. పాపం చేసే ముందు మృత్యువ్ఞను గుర్తుచేసుకోవాలి. పాపానికి పాల్పడే ముందు మరణాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే కూడా తలపెట్టబోయే పాపాల నుండి మనల్ని రక్షించుకోవచ్చు. ఎందుకంటే మరణం ఒక పచ్చినిజం. అది ఎక్కడ? ఎప్పుడు? ఎలా? సంభవిస్తుందో కూడా ఎవరికీ తెలియదు.

దాన్నుండి ఎవరూ తప్పించుకోలేరు. మన శరీరావయవాలు మనకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. ఒకవేళ మనం పాపాలకు పాల్పడితే రేపు ప్రళయం రోజు మన శరీర అవయవాలైన కాళ్లూ,చేతులు నోరు, చర్మం మొదలైనవి అల్లాహ్‌ ముందర సాక్ష్యమిస్తాయన్న సంగతి ఆలోచిస్తూ ఉండాలి. ఆ విధంగా వారు నరకాగ్నికి చాలా సమీపంలోకి రాగానే వారి చెవ్ఞలూ, వారి కళ్లూ, వారి చర్మాలు సైతం వారు చేస్తూ ఉండిన పనుల గురించి సాక్ష్యమిస్తాయి. ప్రళయం రోజున పాపాత్ములు పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. ఇహలోకంలో సృష్టికర్త అయిన అల్లాహ్‌ను ఆయన ప్రవక్తలను, గ్రంథాలను తిరస్కరించి తన ఇష్టం వచ్చినట్లు పాపాలమీద పాపాలు చేసే వ్యక్తి మరణ సమయంలో గానీ, ప్రళయదినానగానీ పశ్చాత్తాపంతో అల్లాహ్‌ను వేడుకుంటాడు. కాని ఏం లాభం? అల్లాహ్‌ ఆరోజు అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించడు.

పాపాలు శాపాలకు గురవ్ఞతాయి. పాపాల వలన మనిషి పరువ్ఞపోయి, నలుగురిలో నవ్ఞ్వల పాలవ్ఞతాడు. ఇంకా శాపానికి గురవ్ఞతాడు. ఈ శాపానికి రెండు కారణాలు అల్లాహ్‌ విధించిన వాటిని నెరవేర్చకుండా ఉండటం. నిషిద్ధ (హరాం) విషయాల వెంటపడటం. ధర్మం విషయంలో అతిశయిల్లటం. లేనిపోని వాటిని ధర్మంలో జొప్పించి, దాని రూపురేఖలు మార్చివేయటం.

– షేఖ్‌ అబ్దుల్‌ హఖ్‌