దేవుడిని తప్ప ఎవరినీ అడగవద్దు

jesus
jesus

దేవుడిని తప్ప ఎవరినీ అడగవద్దు

ఒక దైవసేవకుడు అద్భుతంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వేలాదిమంది భక్తులు ఆ సేవకుడి మీటింగ్‌కి హాజరయ్యారు. ఆయన వాక్యం ఎంత అద్భుతంగా ఉందంటే మాటలతో వర్ణించలేనిది. ఐదునిమిషాల్లో జీవితం మారిపోతుందేమో అన్నట్లుగా ఆయన ప్రసంగాలు వ్ఞంటాయి. టీవిలో ఆయన వాక్యం వస్తుంటే అందరూ తదేకంగా వింటుంటారు. కానీ ఆయన ప్రసంగం మధ్యమధ్యలో ‘మీ కానుకలు లేదా డొనేషన్స్‌ ఈ అకౌంటు నెంబరుకు పంపండి అంటూ బ్యాంకు పేరు, అకౌంటు నెంబరు, అకౌంటు బ్రాంచ్‌, స్థలం పేరు వ్ఞంటాయి. ‘మీరు దేవ్ఞడి విశ్వసిస్తే, దేవ్ఞడు మీకు, మీ కుటుంబసభ్యులకు అద్భుత దీవెనల్ని కుమ్మరిస్తాడు, దేవ్ఞడు ఎంత గొప్పవాడో… అంటూ వర్ణిస్తుంటారు. నాకు అంతుబట్టని ప్రశ్న ఒక్కటే! ఇంత అద్భుతమైన దేవ్ఞడు, ఆశ్చర్యకార్యాలు చేసే తండ్రి, సేవ కోసం డబ్బును ఇవ్వడా? దేవ్ఞడు భక్తులు ఇచ్చే కానుకలపై ఆధారపడి, తన సేవను జరిపించుకుంటాడా? ఖచ్చితంగా దేవ్ఞడు తన ప్రజలు ఇచ్చే కానుకల ద్వారా సేవను జరిపించుకుంటాడు. అలాగని ఏఒక్కరం సేవ కోసం మన నోరు తెరచి, డబ్బును కాని, కానుకలను అడగరాదు. వారిపై ఆధారపడకూడదు.
మనం దేవుడిపై ఆధారపడాలి. ఆయననే వేడుకోవాలి. ఒక సమావే శాన్ని నిర్వహిస్తున్నప్పుడు సంఘం బాధ్యతగా, మొదట ప్రార్థన చేయాలి. దేవ్ఞడి చిత్తాన్ని తెలుసుకోవాలి. అందుకు ఎంత బడ్జెట్‌ అవ్ఞతుందో అంచనా వేయాలి, ఒక ప్రణాళికను రూపొందించాలి. అప్పుడు ఆ ప్రణాళిక పట్టీని ప్రభువ్ఞ సన్నిధిలో వ్ఞంచి ప్రార్థన చేయాలి. ‘దేవా! నీ చిత్తప్రకారం ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నాం, దీనికోసం ఇంతమంది విశ్వాసులు హాజరవ్ఞతారని, అంచనా వేస్తున్నాం, వీరికి భోజనం లేదా, స్నాక్స్‌, పానియాలు, ఇతర అవసరాల కోసం ఇంత డబ్బు ఖర్చు అవ్ఞతుంది. మావద్ద అంత లేదు. కావ్ఞన నీవే మాకు సాయం చేయి, నీవ్ఞ చేయి విప్పి, నీ గుప్పిలి విప్పకపోతే, మేం ఏమీ చేయలేం తండ్రీ! అని వేడుకోవాలి. దేవ్ఞడు తప్పక సాయం చేస్తాడు అనే విశ్వాసాన్ని ఉంచాలి. ఆ సాయం కోసం మౌనంగా ఎదురుచూడాలి. డైరెక్టుగానో, ఇన్‌డైరెక్టుగానో మన అవసరాలు ఏ ఒక్కరికి తెలుపకూడదు.

మనం ప్రభువ్ఞను మాత్రమే వేడుకోవాలి. దేవ్ఞడి సాయంపై నూటికినూరుశాతం ఆధారపడాలి. ప్రభువే తన భక్తుల ద్వారా ప్రేరేపిస్తాడో, లేక మరో విధంగా సాయం చేస్తాడో అది మనకు అనవసరం. మన బాధ్యత, పని, కేవలం విశ్వాసంతో ప్రార్థన చేయాలి అంతే. ఇదే క్రీస్తు అనే బండపై ఆధారపడి చేసే పరిచర్యకు నిదర్శనం. దేవ్ఞడి పరిచర్యకోసం మీరు కానుకల్ని ఇవ్వండి, లేదా పలాన దైవసేవకుడు హాస్పటల్‌లో ఉన్నాడు, ఆ వైద్యఖర్చుల కోసం సాయం చేయండి అంటూ మనం నోరు తెరచి అడగరాదు. ‘దేవ్ఞడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును (2 కొరంధీ 9:7) అనే ఈ వాక్యాన్ని చెప్పి, భక్తుల నుంచి కానుకల్ని దండుకోవడం తప్పు. దేవ్ఞడు ఉత్సాహంగా ఇచ్చేవారిని తప్పక ప్రేమిస్తాడు. ఆయనే వారిని ప్రేరేపిస్తాడు. మనకు వాక్యం ఉందని, అన్ని సందర్భాల్లో దాన్ని ఉపయోగించి, మనం భిక్షగాళ్లుగా మారనక్కరలేదు. మన దేవ్ఞడు ఐశ్వర్యవంతుడు. ఆయన తన పనిని ఏ ఒక్కరి కానుకలపై ఆధారపడి చేయడు. ఆయనకు అవసరమైతే ప్రభువే వారికి భారం ఇస్తాడు, ప్రేరణ ఇస్తాడు, స్పష్టంగా ఆజ్ఞాపిస్తాడు. మనకోసం తన ప్రాణాలను ఇచ్చిన ప్రభువ్ఞకు మనకు కావాల్సింది ఇవ్వడా? మనం దేవ్ఞడికి సాయం చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవ్ఞతుంది. మనం అతితెలివిని ఉపయోగించనక్కరలేదు. మనదేశంలో బ్రదర్‌ భక్తసింగ్‌గారు దేవ్ఞడిపై ఆధారపడి, ఎంత గొప్ప పరిచర్య చేశారో మనకు తెలుసు.

ఆయన ఏ ఒక్కరిపై ఆధారపడ లేదు. డబ్బు కావాలని ధనికదేశాలకు ఉత్తరాలు రాలేదు. తన పరిచర్య గురించి ఏ ఒక్క రిపోర్టును కూడా రాసి, తెలుపలేదు. ఆ దైవజనుడు అంత గొప్ప పరిచర్యచేస్తే మనమేందుకు చేయలేం? ఆయన ప్రార్థనలో గడపడమే కాదు, అదే విశ్వాసంతో జీవించారు. దేవ్ఞడి చిత్తప్రకారం జీవించాడు. ‘దేవ్ఞడి చిత్తం, దేవ్ఞడి శక్తి లేదా బలం, దేవ్ఞడి మహిమ అనే సూత్రాన్ని అవలంభించాడు. నేడు అనేకులు ‘దేవ్ఞడి చిత్తం, నా శక్తి లేదా నా బలం, దేవ్ఞడి మహిమ అనేలా చేస్తున్నారు. ‘ఏ సేవకుడును ఇద్దరు యజమాను లను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించను, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును, విూరు దేవ్ఞనిని సిరిని సేవింపలేరని చెప్పెను (లూకా 16:13). దేవ్ఞడిని ప్రేమించేవారు డబ్బుపై మనసు ఉంచరు. ‘మాకోసం కాదుకదా, దేవ్ఞడి పరిచర్యకోసమే మేం అడుగుతున్నాం అని సమర్ధించుకునేవారు ఉన్నారు. దేవ్ఞడి పరిచర్య అంటే దేవ్ఞడే ఆ సాయం చేయాలి. ఆయనకు అవసరమైతే ఒక అన్యుడి ద్వారా నైనా సాయం చేయగలడు. లేదా సారెపతు ఊరిలో ఉన్న ఒక విధవరాలిలాగా అతి పేదవారి ద్వారానైనా సాయం చేస్తాడు. అది మన పనికాదు. అది దేవ్ఞడి పని.

మన పని విశ్వాసంతో ప్రార్థన చేసి, ఆ సాయం అందెవరకు వేచివ్ఞండాలి. సేవంటే పోటీతో చేసేది కాదు. ఒక సేవకుడు చర్చిని నిర్మిస్తున్న వీడియోను టీవిలో చూపించి, ‘మందిర నిర్మాణానికి మీవంతు సాయం చేయండి అని అడగడం ఎంత అవిశ్వాసచర్య? మందిరాన్ని కట్టమని ఆజ్ఞాపించిన దేవ్ఞడు, ఆ కట్టడం పూర్తి అయ్యేంతవరకు సాయం చేయడా? దేవ్ఞడు పని చేస్తున్నప్పుడు మధ్యలో మనం దేవ్ఞడికి సాయం చేయాలనే పిచ్చి ఆలోచనలెందుకు? మందిర నిర్మాణం దేవ్ఞడికి మహిమ కలగాలంటే ఆ కట్టడం మొత్తం దేవ్ఞడిచేత నిర్మించబడినప్పుడే సాధ్యం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి వేడుకుంటారో, వారిమధ్య ప్రభువ్ఞ ఉంటాడు. అంటే యధార్థంగా ప్రార్థించేవారు, ఆరాధించేవారి మధ్య దేవ్ఞడు ఉంటాడు. ఈ అనుభవం ఎంత రమ్యమైనదో అనుభవిస్తే తప్ప చెప్పలేం. ఇకనుంచి అయినా దేవ్ఞడిపై ఆధారపడి, పరిచర్యలో ముందుకువెళ్దాం. దేవ్ఞడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక.

 – పి.వాణీపుష్ప