ఆశ్రమ ధర్మము

ఆశ్రమ ధర్మము
సాయిబాబా హిందువా? ముస్లిమా? ఆ ప్రశ్న నేటికి కాదు, ఏనాటిదో ఎవరూ ఎటూ తేల్చలేని ప్రశ్న అది. సాయి అన్ని మతాలకూ అతీతుడు. సాయిబాబా ఆశ్ర మం ఏది? గృహస్థాశ్రమమా? సన్యాసాశ్రమా? సాయి గృహస్థ ఆశ్రమమును ప్రోత్సహించాడు, అట్లాగే సన్యాసాశ్రమ వాసులకు కూడా, ఆ ఆశ్రమంలో ఎలా జీవించాలో తెలిపాడు.

దేవీదాసు
సాయిబాబా కంటే ముందే షిరిడీకి వచ్చిన సన్యాసి పాయి దేవీదాసుకు సలహాలిచ్చారు. ఒకటి వైరాగ్యాన్ని అంటిపెట్టుకొని వుండు అనేది. ఇక రెండవది కామాన్ని జయించలేని వానికి దైవప్రాప్తి ఉండదు అని. సన్యాసులు స్త్రీలకు దూరంగా వుండాలని అంతర్లీనంగా సాయి దేవీదాసుకు బోధించారు. సాయికి ముందుచూపు వుండటం వలన అలా చెప్పగలిగాడు. అయితే దేవీదాసు పాటించలేదు. చివరకు అతను పతనమయ్యాడు.

విజయానంద స్వామి
ఆయన మద్రాసు నుండి మానస సరోవరానికి ప్రయాణం చేస్తూ, దారిలో షిరిడీలో ఆగా డు. సాయిని దర్శించాలని అభిలాషతో వచ్చాడు. అప్పుడు షిరిడీలోనే ఉన్న వేరొక సన్యా సిని మానస సరోవరం గురించి అడిగాడు. అది చాలాదూరమని, అచటివారు సంశ యాత్ములని సమాధానం వచ్చింది. విజయానందుని మనస్సు వికాలమయింది. ఈలోగా తన తల్లి ఆరోగ్యము సరిగా లేదని సమాచారం వచ్చింది. తిరిగి తన గ్రామం వెళ్లేందుకు సాయి అనుమతి కోరగా, సాయి నిరాకరించారు. కాషాయ వస్త్రములు ధరించువాడు, దేనియందూ అభిమానం చూపుట తగదు. వస్తువులన్నింటి యందు అభిమానము విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారంగా ఉంటారో, హరి యొక్క పాదములను శరణువేడతారో, వారు సకల కష్టముల నుండి విముక్తి పొంది, మోక్షమును పొందెదరు అన్నారు సాయి. అతడు దేవీదాసువలె గాక సాయి మాటలను పాటించాడు. షిరిడీలోనే మోక్షమును పొందాడు.

గణేశనాధుడు
అవి శివాజీ పరిపాలిస్తున్న రోజులు. ఉజ్జయినిలో గణేశ నాధుడనే మహానుభావ్ఞ డుండేవాడు. తరచుగా పండరీపురం వెళ్లి పాండురంగని దర్శించుకొనేవాడు. ఒకనాడు పండరీపురంలో ఆయన పాండురంగని దర్శిస్తుండగా, శివాజీ మహారాజు కలిశాడు. శివాజీ నూతన తల్పమును తయారు చేయించు కొనినాడు. ఆ తల్పంపై గణేశనాధుడు శయనిస్తే, శుభం జరుగుతుందని శివాజీ మహారాజు అనుకున్నాడు. ఆ మాటను గణేశనా ధునితో చెప్పాడు. ఒక క్షణం ఆలోచించి, గణేశనాధుడు సరే అన్నాడు. గణేశనాధుడు దారిలోని గులకరాళ్లను ఏరి తన వెంట తెచ్చుకున్నాడు. శివాజీ కుతూహలంగా ఇవి ఎందుకు? అని ప్రశ్నించాడు. రామనామ మును ఎంచుటకు సమా ధానమిచ్చాడు గణే శుడు. శివాజీ గణేశనాధునికి పాదములు కడిగి, గంధపుష్పాదులతో పూజించాడు. ఇకనూ తనముగా చేయించిన హంస తూలికా తల్పముపై శయనించండి అని శివాజీ వెళ్లిపో యాడు. తెల్లవారింది. శివాజీ గణేశనాధుని వద్దకు వచ్చాడు. స్వామీ! ఈ హంస మాలికా తల్పంపై ఈ గులకరాళ్లను ఎందుకు పరిచారు? అని ప్రశ్నించాడు. ‘హంస తూలికా తల్పము మీద శయనించుటకన్నా, ఐహిక సుఖములలో మిన్న ఏము న్నది? కానీ, ఆ సౌఖ్యమును అనుభవించితే నేను, ఇక నా మనసు నాకు స్వాధీనము కాదు. నేను అప్పుడు చెడిపోవుట ఎంతసేపు? కావుననే నేను ఈ హంసతూలికా తల్పముపై గులకరా ళ్లను పరచి, వాటిపై విశ్రమించితిని. ఆశ్రమ ధర్మమును అతిక్రమించుట మహాపాతకము. నీవు నిర్మల చిత్తుడవు. కానీ నీ కోరికను కాదనలేక వచ్చితిని. రాళ్లపై శరీరమును ఉంచి, మనస్సును భగవంతునిపై తిప్పితిని అని గణేశనాధుడు పలికాడు. అది ఆశ్రమ ధర్మము. ఆశ్రమ ధర్మమును పాటించమని మహనీయుల బోధ.
  – యం.పి.సాయినాథ్‌