అంతరార్ధ వివరణ

Shirdi sai baba
Shirdi sai baba

 అంతరార్ధ వివరణ

ఒకసారి సాయిబాబా వద్దకు దాసగణు అనే భక్తుడు వచ్చి ఈశావాస్యోపనిషత్తును గూర్చి తెలుపుమని సాయిని కోరాడు. ఈశావ్యాస్యోపనిషత్తును గూర్చి ఒక గ్రంధమును రాయదలచిన దాసగణు తన గురుతుల్యుడైన సాయిబాబాను కోరటం సహజమే. తన వద్దకు చేరిన వ్యక్తుల సందేహాలను తీర్చడం సాయి చేసే పనులలో ఒకటి. సాయిబాబా అప్పుడు దాసగణుతో ‘నీవ్ఞ తొందరపడవద్దు. ఆ విషయంలో ఎట్టికష్టం లేదు. కాకాసాసాహెబ్‌ దక్షితుని నౌకరుపిల్ల, నీతిగురు ప్రయాణముల నీ సందేహమును విర్లీపార్లేలో తీర్చును అన్నారు. ఆ సమయంలో అక్కడున్నవారు దాసగణుతో సాయి తమాషాగ మాట్లాడాడని అనుకున్నారు.

సాయిబాబాకు అలా తామాషాగా మాట్లాడటం అలవాటే. ఒకసారి ఇట్లాగే సాయిబాబా వద్దకు వేదాంతము అగు ఉపనిషత్తులను, అష్టాదశ పురాణములను చదివిన అనంతరావ్ఞపాటలకరు అనే వ్యక్తి వచ్చి తాను అనేక గ్రంధములను చదివానని, శాంతిలేదని, శాంతిని ప్రసాదింపుమని కోరాడు. సాయిబాబా అప్పుడు ‘ఒకనాడు ఒక వర్తకుడు అక్కడికి వచ్చాడు. అతని ముందు ఆడగుర్రం లద్దెవేసెను. అది తొమ్మిది ఉండలుగా పడెను. ఆ వర్తకుడు పంచె కొంగుసాచి ఆ తొమ్మిది పాడలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు తన మనస్సును కేంద్రీకరించాడు అన్నాడు. అయినా అనంతరావ్ఞకు సాయిమాటలు అర్ధము కాలేదు. తరువాత సాయి మాటలకు దాదాకేల్కర్‌ సరైన అర్ధం చెప్పారు. అలాగే తన చతురపు పలుకులతో సాయి కరుణిస్తాడు.

అలాగే సాయి దాసగణును కరుణించాడు. కాకాసాహెబ్‌ దీక్షితు పనిమనిషి ఈశావాస్కోపనిషత్తు అంతరాద్ధాన్న తెలిపింది. దాసగణు అది గ్రహించాడు. సాయి దాసగణును విల్లిపార్లేకు పంపకుండ, ఈశావాస్యోపనిషత్తును బోధింపలేడా? బోధింపగలడు. కాని, దాసగణుకు అనుభవము కావలెను. సాయి బోధించగలడుగని, ఆ క్షణమున దాసగణు ఈశావాస్యోపనిషత్తుడులోని అంతరార్ధను స్వయంగా అనుభవింపలేడు. అందువలన సాయి దాసగణును విల్లిపార్లేకు పంపి అనుభవము ద్వారా, అంతరార్థాన్ని తెలిపాడు. ఇది సనాతన పద్ధతి. దీనిని సాయి పాటించాడు.

ఒకనాడు భృగువుకు ‘బ్రహ్మం అంటే ఏమిటి ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. వెంటనే తన తండ్రి గురువ్ఞ అయిన వరుణుని ప్రశ్నించాడు. వరుణుడు తడుముకోకుండా సమాధానం చెప్పగలడు. కాని చెప్పలేదు. ‘ఈ సమస్త సృష్టిదేని నుండి ఉత్పత్తి అయి, ఆధారపడి, మనుగడ చెంది, లయిస్తుందో ఆమూలతత్వమే బ్రహ్మము. ఆమూలతత్వము ఏమిటో విచారించు. విచారించినవే తెలుసుకో అన్నాడు వరుణుడు తన కుమారుడైన భృగువ్ఞతో. తండ్రి ఆజ్ఞ మేరకు ఆ ఉపదేశ వాక్యాన్ని ఊతగా చేసుకుని తపస్సు చేసి, అన్నయే బ్రహ్మమని తెలుసుకున్నాడు. తండ్రి వద్దకు వచ్చి తన అభిప్రాయాన్ని తెలిపాడు.

‘తపస్సు చేత బ్రహ్మాన్ని తెలుసుకో అన్నాడు తండ్రి. భృగువ్ఞ మరల తండ్రి వాక్యాన్ని విచారించి, విచారణ చేశాడు. ప్రాణమే బ్రహ్మమని తలచాడు. తండ్రి వద్దకు వచ్చి ఈ విషయాన్ని చెప్పాడు. తండ్రి మరల ‘తపస్సు చేత బ్రహ్మాన్ని తెలుసుకో. తపస్సే బ్రహ్మము అన్నాడు. విసుగు చెందని భృగువ్ఞ మరల విచారణ చేసి, తపస్సు చేసి ప్రాణమే బ్రహ్మమని తలచాడు. తండ్రి వద్దకు వచ్చి ఈ సంగతి చెప్పాడు. తండ్రి మరల ‘తపస్సు చేత బ్రహ్మాన్ని తెలుసుకో. తపస్సే బ్రహ్మము అన్నాడు.

విసుగు ఏమాత్రం చెందని భృగువ్ఞ మరల తపస్సు చేసి బుద్ధి బ్రహ్మమని తెలిసి, తండ్రికీ విషయం చెప్పాడు. తండ్రి మరల పాతపాటే పాడాడు. తన తండ్రి ప్రవర్తను ఏవగించుకోలేదు భృగువ్ఞ. ఇంకా తన జిజ్ఞాసపట్ల చిన్నచూపు చూపలేదు. మరల విచారణ చేసి, ఆనందమే బ్రహ్మమని గ్రహించాడు. అంతర్ముఖుడై, ఆనందాన్ని అన్వేషించిన కొద్ది, అతని బుద్ది తపోరూప అగ్నిలో సంస్కరింపబడి, శుద్ధి చేయబడి, సర్వానికి మూలతత్వమయిన ఆనందమే బ్రహ్మమని, అది ఆత్మస్వరూపమని అనుభవంలో గోచరించింది. దీనిని తండ్రికి చెప్పగా, తండ్రి అదే సత్యమన్నాడు. ఆధ్యాత్మిక పధంలో, మౌళిక విషయాలను ముఖాముఖిగా బోధన చేయడం కంటే, అనుభవపూర్వకంగా గ్రహించడమే ఉత్తమం. ఇది వేదకాలం నాటి పద్ధతి. సాయి దీనిని ఆచరణలో చూపాడు.

– యం.పి.సాయినాధ్‌