వాతాగ్రం అంటే?

జనరల్ నాలెడ్జి

The boundary between the air masses

వాతాగ్రం అనే పదం 1918 నుంచి అమల్లోకి వచ్చింది. నార్వే శాస్త్రజ్ఞులైన వి,జెర్కిన్స్‌, జె . .జెర్కిన్స్‌, హెచ్‌, సోల్‌బర్గ్‌ కృషి, పరిశోధనల ఫలితంగా వాతాగ్రానికి సంబంధించిన సమాచారం అందుబాటులోకి వచ్చింది.

రెండు భిన్న వాయురాశుల మధ్య ఉన్న సరిహద్దును వాతాగ్రం అంటారు. వేర్వేరు ధర్మాలు(లక్షణాలు) ఉన్న వాయురాశులకు వేర్వేరు వాతాగ్రాలు ఉంటాయి.

ఉష్ణోగ్రత, పీడనం,స్థానం, తరహా, పవన వ్యవస్థ, మేఘావృతం, వర్‌షం ఇవ్వడంలో ఈ వాతాగ్రాలు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉంటాయి.

-వాతాగ్రాలు ప్రారంభ దశలో ఒక తరంగంలా ఉండి, క్రమక్రమంగా చక్రవాతంగా రూపుదిద్దుకుంటాయి. వీటిని తరంగ చక్రవాతాలు అని కూడా అంటారు. ఈ చక్రవాతాల సమభార రేఖలు గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో లేదా వి ఆకారంలో ఉంటాయి.

కేంద్రం వైపు వెళల్లే కొద్దీ పీడనం తగ్గుతూ, కేంద్రం వద్ద 900 మిల్లీ బార్‌ ్సగా ఉంటుంది. పీడన ప్రవణత తక్కువ,

కేంద్రం లో అల్పపీడనాన్ని ఆక్రమించడానికి బయటి నుంచిీఅధిక పీడరం) పవనాలు గంటకు 200- 300 కి.మీ. వేగంతో వీస్తుంటాయి.

దాదాపు 300 నుంచి400 కి,మీ. వ్యాసం ఉన్న చక్రవా తాల మందం 12000 మీటర్ల నుంచి18000 మీటర్లు వరకు ఉంటుంది.

ఈ చక్రవాతాలు ఒంటరిగా ఇవి నేల మీద, సముద్రం మీద కూడా వస్తాయి. ఆవిర్భవించిన ప్రదేశం నుంచి కొన్ని రోజులపాటు కదలకుండా, తటస్థంగా ఉండటం వీటి నైజం. ఉష్ణమండల చక్రవాతాల మాదిరి వీటి ప్రవర్తన కూడా విచ్చలవిడిగా తిరిగే పిచ్చివాని ప్రవర్తనను పోలి ఉంటుంది.

ఇవి పశ్చిమ పవానాలు వెళ్లే దిశను అనుసరిస్తాయి. వాతాగ్ర జననం-క్షీణత: వాతాగ్రాలు పుట్టే విధానానికి వాతాగ్ర జననం అని, వాతాగ్రం నశించిపోచే విధానాన్ని వాతాగ్ర క్షీణత అని అంటారు.

ఈ రెండు పదాలను తొలిసారిగా టార ్‌బెర్గిరాన్‌ ఉపయోగొంచారు.

వాతాగ్రాలు హఠాత్తు గా ఆవిర్హవించి, హఠాత్తుగా క్షీణించవు. వీటి జననానికి, క్షీణతకు కొన్ని అనుకూల, ప్రతికూల పరిస్థితులతోపాటు కొంత వ్యవధి కూడా అవసరం. వాతాగ్రాలను శీతల వాతాగ్రం, ఉష్ణ వాతాగ్రం అని రెండు రకాలుగా విభజించారు.

శీతల వాయురాశి, ఉష్ణ వాయురాశిలోనికి చొచ్చుకువెళ్లేటప్పుడు, శీతల వాయురాశి ముందు భాగాన్ని శీతల వాతాగ్రం అంటారు.శీతల వాయురాశి కొన్నివేల కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది.

ఈ వాయురాశులు సాధారణంగగా అంటార్కిటికా, ఆర్కిటిక్‌ సైభీరియా ప్రాంతాల్లో రూపుదిద్దుకుంటాయి. ఇవి చల్లగా ఉండటం వల్ల బరువుగా ఉంటాయి. వాతావరణ పటంలో దీన్ని గుర్తుతో సూచిస్తారు.

శీతల వాతాగ్రంలో వాతావరణం వింతగా ఉంటుంది. అప్పటివరకు తెల్లని సిర్రస్‌ మేఘాలతో నిర్మలంగా ఉన్న ఆకాశాన్ని నల్లని నింబస్‌ మేఘాలు అవరిస్తాయి. చల్లని గాలి వీస్తూ వర్షం రాకను తెలియజేస్తుంది. వాతావరణ పటంలో దీన్ని గుర్తుతో చూచిస్తారు.

ఉష్ణ వాతాగ్రంలో వాతా వరణం సిర్రస్‌ మేఘాలతో ఆకాశం నిర్మలంగా ఉన్నప్పటికీ క్రమక్రమంగా సిర్రోస్ట్రాటస్‌, ఆల్టోస్ట్రాటస్‌, నింబస్‌ మేఘాలు ఏర్పడి చీకట్లు కమ్ముకుంటూ వర్షానికి నాంది పలుకుతాయి.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/