టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Results
Results

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 10 నుంచి 24వ తేదీ వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 7642 పాఠశాలల నుంచి 61,431 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలు రాసిన వారిలో 36,931 మంది బాలురు.. 24,500 మంది బాలికలు ఉన్నారు. అయితే ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బి.సుధాకర్‌ విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 53.59 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు ఆయన వెల్లడించారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/