ఈనెల 15న దోస్త్‌ నోటిఫికేషన్‌

DOST Online Application
DOST Online Application

సంగారెడ్డి: హైదరబాద్‌ నుండి దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లింబ్రాది మీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ నోటిఫికేషన్‌ ఈ నెల 15న విడుదల కానున్నట్లు ఆయన వెల్లడించారు. 15న నోటిఫికేషన్ విడుదల తర్వాత 16 నుంచి రిజిస్ర్టేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. అయితే గతేడాది తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సారి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మూడు విధాలుగా హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే 15 కళాశాలల్లో విద్యార్థులు నేరుగా రిజిస్ర్టేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఈ సారి ప్రవేశాల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించి తమ సీటును కన్ఫామ్ చేసుకోవచ్చన్నారు. కులం, ఆదాయ ధృవపత్రాలు జతపరిచే విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. ఆయా కళాశాలల్లో సీటు వచ్చిన విద్యార్థులకు జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని లింబాద్రి వివరించారు.


మరిన్ని తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/