యోగా టీచర్‌గా మారడానికి మెలకువలు

Tips for Becoming a Yoga Teacher

యోగా టీచర్‌గా మారడానికి ముందు ఇన్స్‌ట్రక్టర్‌ పర్య వేక్షణలో మెళకువలు నేర్చుకోవడం, ప్రాక్టీస్‌ చేయడం చాలా ముఖ్యం. నిరంతరం ప్రాక్టీస్‌, మనసు లగ్నం చేయడం, సహనం అంకిత భావం చాలా అవసరం.యోగా ప్రొఫెషనల్‌గా మారేం దుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సుల్లో చేరొచ్చు. కేంద్ర ప్రభుత్వం యోగా టీచర్లను సర్టిపై చేసేందుకు ‘స్కీమ్‌ ఫర్‌ వాలంటరీ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ యోగా ప్రాఫెషనల్స్‌ను ప్రవేశపెట్టింది ఇందులో యోగా ఇన్స్‌ట్రక్టర్‌ సర్టిఫికేషన్‌, యోగాటీచర్‌ సర్టిఫికేషన్‌, యోగా మాస్టర్‌ సర్టి ఫికేషన్‌,యోగా ఆచార్య సర్టి ఫికేషన్‌లుగా వర్గీకరించింది.దీనికి సంబంధించిన ప్రమాణాలను క్వాలిటీ కౌన్సిల్‌ఆఫ్‌ఇండియా నిర్ణయిస్తుంది.
జాబ్‌ ప్రొఫైల్స్‌: రీసెర్చ్‌ ఆఫీసర్‌- యోగా అండ్‌ నేచురోపతి -2యోగా ఏరోబిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ -3 క్లినికల్‌ సైకాలజిస్ట్‌ -4 యోగా థెరపెస్ట్‌-5 యోగా ఇన్‌స్ట్రక్టర్‌ -6 యోగా టీచర్‌ -7తెరపెస్ట్‌/ నేచురోపత్స్‌ -8 ట్రైనర్‌/ఇన్‌స్ట్రక్టర్‌ హెల్త్‌ క్లబ్‌. కెరీర్‌ స్కోప్‌: యోగాలో పొందిన శిక్షణ ఆధారంగా రీసెర్చ్‌, ట్రైనింగ్‌ విభాగాల్లో స్థిరపడొచ్చు. దీంతోపాటు యోగా థెరపెస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించొచ్చు.రిసార్టులు,జిమ్స్‌, స్కూల్స్‌, హెల్త్‌ సెంటర్స్‌, హౌజింగ్‌ సొసైటీస్‌లో ఉపాధి అవకాశాలు ఉంటాయి.- టివి ఛానళ్లతో పాటు సెలబ్రిటీలు, ఉన్నత స్థాయిలోని వ్యక్తులు వ్యక్తిగత యోగా ట్రైనర్లను నియమించుకుంటున్నారు. సెలవు రోజుల్లో యోగా ద్వారా ఒత్తిడి నుంచి బయటపడేందుకు విదేశీ ఏర్పాటకులు భారత్‌కు వస్తున్నారు.
వేతనాలు: ఫ్రెషర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వారునెలకురూ.15,000 నుంచి రూ.20.000 వేల వరకు సంపాదించగలరు అనుభవంతో సంపాదన, వేతనాలు వేగంగా పెరుగుతాయి.
కోర్సుల వివరాలు:యోగా టీచర్‌గా మారేందుకు దేశంలో పలు విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న ప్రాథమిక కోర్సు బిఎ యోగా లేదా బిఎస్సీ యోగా థెరపీ. 50 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. వీటిని పూర్తిచేసినవారికి ఎంఏ/ఎంఎస్సీ యోగా థెరఫి కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఇవే కాకుండా పలు పిజి డిప్లొమా, డిప్లొమా, సర్టిప ¶ికేషన్‌ కోర్సుల్లోనూ చురి యోగాలో నైపుణ్యం సాధించొచ్చు. ఆంధ్ర విశ్వవిద్యా లయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఏ యోగా అండ్‌ కాన్షియస్‌నెస్‌తోపాటు పోసు ్టగ్రా డ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ యోగా, డిప్లొమా ఇన్‌ యోగా, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ యోగాను అందిస్తోంది.
యోగా కోర్సులను అందిస్తున్న సంస్థలు:

  • గాంధీ నేచురోపతిక్‌ మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.- ఎస్‌డిఎం కాలేజ్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సెన్పైస్‌, ఉజిరే, కర్ణాటక.- జెఎస్‌ఎస్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సన్పైస్‌, ఊటకమండ్‌, కర్ణాటక.- శివరాజ్‌ నేచురోపతి అండ్‌ యోగా మెడికల్‌ కాలేజ్‌, సేలం- గవర్నమెంట్‌ నేచురోపతి అండ్‌ యోగా యోగిక్‌ సెన్పైస్‌.దుర్గ్‌- ఎస్‌ఆర్‌కె మెడికల్‌ కాలేజ్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సెన్పైస్‌, తమిళనాడు.-మహవీర్‌ కాలేజ్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సెన్పైస్‌, కర్ణాటక
  • కెఎల్‌ఇఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగాక్‌ సెన్పైస్‌ బెల్లాం, కర్ణాటక
    -మొరార్జీదేశా§్‌ు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగా- గవర్న్‌మెంట్‌ నేచుర్‌క్యూేర్‌ అండ్‌ యోగాకాలేజ్‌, మైసూర్‌.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/