గురుకుల ప్రవేశ పరీక్షలకు గడుపు పెంపు

exams
exams

హైదరాబాద్‌: రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు మే 10న నిర్వహించనున్న టీఎస్‌ఆర్జేసీ ప్రవేశ పరీక్ష కోసం ఇప్పటి వరకు 60 వేలకు పైగా దరఖాస్తు వచ్చాయి. ఈ నెల 11తో ముగియాల్సిన గడువు తేదీని 15 వరకు పొడిగించామని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ సొసైటీ సెక్రటరీ ఏ సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఎంపీసీలో 1,500, బైపీసీలో 1,440, ఎంఈసీలో 60, మొత్తం 3వేల సీట్లు ఉన్నాయి.


మరిన్ని కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/