తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

career
career

తెలంగాణలోని వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఉన్నత విద్య శాఖ నిర్వహించే ‘ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్స్‌)-2020 షెడ్యూల్‌ విడుదలైంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ఈ షెడ్యూల్‌ను ఇటీవల విడుదల చేశారు. మే 2వ తేదీన ఈసెట్‌ నిర్వహించ నున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానంగా మే 5,6,7 తేదీల్లో ఇంజినీరింగ్‌ ఎంసెట్‌, మే 9, 11 తేదీలలో అగ్రికల్చర్‌, ఫార్మసీ ఎంసెట్‌ నిర్వహించనున్నారు. మే 13న పీఈసెట్‌, మే 20,21 తేదీల్లో ఐసెట్‌, మే 23న ఎడ్‌సెట్‌, మే 25న లాసెట్‌, పీజీ సెట్‌, మే 27 నుంచి 30 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాపిరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల తేదీలు వెల్లడికావడంతో ఈ తేదీలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు రాష్ట్రంలో నిర్వహించే 8 ప్రవేశ పరీక్షల తేదీలను తాజాగా ఖరారు చేశారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/